Speed News
-
Dulquer Salmaan: ప్రముఖ నటుడు దుల్కర్ సల్మాన్‌కు కరోనా పాజిటివ్
దేశ వ్యాప్తంగా కరోనా కేసులు రోజురోజుకి పెరుగుతున్నాయి. ప్రతిరోజు లక్షల్లో కేసులు నమోదవుతుండటంతో ప్రజల్లో భయాందోళన నెలకొంది .
Date : 20-01-2022 - 10:27 IST -
Kerala Lockdown: కేరళలో ఆ రెండు రోజులు లాక్ డౌన్..!
కేరళలో కరోనా కేసులు పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో వచ్చే రెండు ఆదివారాల్లో లాక్డౌన్ లాంటి ఆంక్షలను విధించాలని కేరళ సర్కార్ నిర్ణయించింది. లాక్ డౌన్ లో అత్యవసర సేవలకు మినహాయింపు ఇస్తున్నట్లు ప్రభుత్వం తెలిపింది.
Date : 20-01-2022 - 10:23 IST -
Hyderabad: రియల్ ఎస్టేట్ లో హైదరాబాద్ ఫస్ట్
ఈ ఏడాది తెలంగాణ రియల్ ఎస్టేట్ పంట పండింది. దేశంలోనే మొదటి స్థానంలో నిలిచి 5,120 కోట్లను రాబట్టింది. సీఎం కేసీఆర్ మ్యాజిక్ తో దేశ వ్యాప్తంగా క్షిణించినా తెలంగాణలో మాత్రం రియల్ ఎస్టేట్ కాసులు కురిపించింది.
Date : 20-01-2022 - 9:04 IST -
ఎదురు కాల్పుల్లో గాయపడిన కానిస్టేబుల్‌ను ఆసుపత్రిలో పరామర్శించిన హోం మంత్రి
సోమాజిగూడలోని యశోద ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న కానిస్టేబుల్ మహేశ్‌ను తెలంగాణ రాష్ట్ర హోం శాఖ మంత్రి శ్రీ మహమ్మద్ మహమూద్ అలీ,శ్రీ ఎం మహేందర్ రెడ్డి, గ్రేహౌండ్స్ అదనపు డీజీపీ శ్రీ కె.శ్రీనివాస్ రెడ్డి, ఓఎస్ డి శ్రీ దయానంద్ కలిసి గురువారం పరామర్శించారు.
Date : 20-01-2022 - 8:25 IST -
AP Schools: పాఠశాలలకు సెలవులు ఇచ్చే ఆలోచన లేదు : మంత్రి ఆదిమూలపు సురేష్
ఏపీలో కరోనా కేసులు రోజురోజుకి పెరుగుతున్నాయి. అయితే కరోనా కేసులు పెరుగుతున్నప్పటికీ పాఠశాలలకు సెలవులు ఇచ్చే ఆలోచన లేదని మంత్రి ఆదిమూలపు సురేష్ తేల్చి చెప్పారు.
Date : 20-01-2022 - 8:03 IST -
TTD: విరాళాలు అందించండి.. వేంకటేశ్వరుడిని దర్శించుకోండి!
తిరుపతి అంతర్జాతీయ విమానాశ్రయానికి చేరుకునే ప్రయాణికులు వెంకటేశ్వర ఆలయ నిర్మాణ (శ్రీవాణి) ట్రస్ట్ కు తక్షణమే విరాళం ఇవ్వడం ద్వారా తిరుమలలోని వెంకటేశ్వర స్వామి ఆలయ దర్శన టిక్కెట్లను బుక్ చేసుకోవచ్చు.
Date : 20-01-2022 - 4:20 IST -
Kishan Reddy: కిషన్ రెడ్డికి కరోనా పాజిటివ్!
రాజకీయనాయకులపై కరోనా ప్రభావం చూపుతోంది. తాజాగా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కి కరోనా పాజిటివ్ అని తేలింది. ఆయన ఈ విషయాన్ని ట్విట్టర్ ద్వారా తెలియజేశారు. తనకు స్వల్ప లక్షణాలు ఉన్నాయని చెప్పారు. కోవిడ్ ప్రొటోకాల్స్ అన్నింటినీ తాను పాటిస్తున్నానని, ప్రస్తుతం హోమ్ క్వారంటైన్ లో ఉన్నానని తెలిపారు. ఇటీవల తనతో కాంటాక్ట్ లోకి వచ్చిన ప్రతి ఒక్కరూ కోవిడ్ టెస్టులు చేయించుకోవాలన
Date : 20-01-2022 - 3:05 IST -
Kaikala: సీఎం జగన్ కు నటుడు కైకాల సత్యనారాయణ లేఖ!
ముఖ్యమంత్రి జగన్‌కు సీనియర్ నటుడు కైకాల సత్యనారాయణ లేఖ రాశారు. ఇటీవల తాను అనారోగ్యానికి గురైన సమయంలో తన కుటుంబానికి అండగా నిలిచిన జగన్‌కు కృతజ్ఞతలు చెప్పారు. బిజీ షెడ్యూల్ ఉన్నప్పటికీ వ్యక్తిగతంగా నాకు ఫోన్ చేసి ప్రభుత్వం తరఫు నుంచి ఏమైనా సాయం చేస్తానని చెప్పారు. చెప్పిన మాట ప్రకారమే మీ అధికారులను మా వద్దకు పంపించి సాయం చేశారు. అంతేకాకుండా వైద్య ఖర్చుల కోసం ఆర్థి
Date : 20-01-2022 - 1:07 IST -
PRC Issue: పీఆర్సీ జీవోలను రద్దు చేయాలని రోడెక్కిన సంఘాలు!
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇటీవల విడుదల చేసిన పీఆర్సీ జీవోలను రద్దు చేయాలని.. రాష్ట్రవ్యాప్తంగా ఉపాధ్యాయ సంఘాలు రోడ్లమీదికొచ్చాయి. “పే రివర్సల్” అని పేర్కొంటూ వేతన సవరణపై ప్రభుత్వ ఉత్తర్వులను పూర్తిగా తిరస్కరించారు. తమ ప్రయోజనాలకు పూర్తిగా విరుద్ధంగా ఉన్నాయని, వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. న్యాయం జరిగే వరకు త్వరలో సమ్మె చేస్తామని హెచ్చరించారు. జగన్ ప్ర
Date : 20-01-2022 - 12:56 IST -
Vijayawada: రూ. కోటి పరిహారం ఇవ్వాలని మాజీ మంత్రి కన్నాకు కోర్టు ఆదేశం
గృహహింస కేసులో కోటి రూపాయల నష్టపరిహారం చెల్లించాలని మాజీ మంత్రి , ఏపీ బీజేపీ మాజీ చీఫ్ కన్నా లక్ష్మీనారాయణకు విజయవాడ కోర్టు ఆదేశించింది.
Date : 20-01-2022 - 12:39 IST -
3 Lakhs Cases: దేశంలో కరోనా కల్లోలం.. ఒక్కరోజే 3 లక్షల కేసులు!
దేశంలో కరోనా మహమ్మారి మరింత తీవ్రరూపం దాల్చింది. కొత్త కేసులు భారీగా పెరిగి, మూడు లక్షల మార్కును దాటేశాయి.
Date : 20-01-2022 - 11:45 IST -
Casino Probe: గుడివాడ క్యాసినో పై పోలీసుల విచారణ
సంక్రాంతి పండుగ సందర్భంగా ఏపీలో విచ్చలవిడిగా కోడిపందల నిర్వహాణ, గుండాట లాంటి జూదక్రీడలు జరిగాయి. ఇవి ప్రతిఏటా పోలీసుల నిఘా ఉన్నప్పటికీ జరుగుతూనే ఉన్నాయి.
Date : 20-01-2022 - 11:30 IST -
Chandrababu Naidu: క్వారంటైన్ నుంచే సమీక్షలు నిర్వహిస్తున్న చంద్రబాబు
కరోనా పాజిటివ్ తో హోం క్వారంటైన్ లో ఉన్న టీడీపీ అధినేత చంద్రబాబు పార్టీ వ్యవహారలపై ఆన్ లైన్ నుంచి సమీక్షా సమావేశాలు నిర్వహిస్తున్నారు. నిన్న రాష్ట్రంలోని 8 నియోజకవర్గాల టీడీపీ ఇంచార్జ్ లతో చంద్రబాబు సమీక్ష జరిపారు.
Date : 20-01-2022 - 11:26 IST -
Andhra Pradesh: అనంతపురంలో నకీలీ బంగారు నాణేలు.. రైతుకు 10 లక్షలు టోకరా
బంగారు నాణేల పేరుతో ఓ రైతును మోసం చేసిన ఘటన అనంతపురం జిల్లాలో చోటుచేసుకుంది. కర్నాటకకు చెందిన దొంగల ముఠా రైతును మోసం చేసి రూ.10 లక్షకు పైగా మోసం చేసిందని అనంతపురం రూరల్ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు చేశారు.
Date : 20-01-2022 - 11:20 IST -
R Day: రిపబ్లిక్ డే పరేడ్‌కు విజయనగరం బాలిక
జనవరి 26న న్యూఢిల్లీలో జరగనున్న రిపబ్లిక్ డే పరేడ్‌కు విజయనగరం బాలిక ఎంపికైయ్యారు.
Date : 20-01-2022 - 11:13 IST -
Burj Khalifa: బుర్జ్ ఖలీఫా బిల్డింగ్ పై డేరింగ్ లేడీ.. ఎందుకో తెలుసా!
ప్రపంచంలో అతి ఎత్తైన బిల్డింగ్ ఏదైనా ఉందంటే.. మొదటగా గుర్తుకువచ్చేది దుబాయ్ లోనే బుర్జ్ ఖలీఫానే..
Date : 19-01-2022 - 10:57 IST -
1st ODI: సఫారీలదే తొలి వన్డే…
భారత్‌తో మూడు వన్డేల సిరీస్‌లో సౌతాఫ్రికా శుభారంభం చేసింది. పార్ల్ వేదికగా జరిగిన తొలి మ్యాచ్‌లో 31 పరుగుల తేడాతో విజయం సాధించింది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న దక్షిణాఫ్రికా ఓపెనర్లు త్వరగానే ఔటైనా... కెప్టెన్ బవుమా, డస్సెన్ సెంచరీలతో చెలరేగారు.
Date : 19-01-2022 - 10:29 IST -
Pushpa: ‘డెల్టా అయినా ఒమిక్రాన్ అయినా.. మాస్క్ తీసేదేలే’
ఏదైనా విషయం గురించి ప్రజల్లో అవగాహన కల్పించాలంటే.. పేపర్ ప్రకటననో, సోషల్ మీడియాలో ఓ పోస్టు పెడితేనో సరిపోదు.. కాస్త డిఫరెంట్ గా, అట్రాక్టివ్ గా, సిట్చుయేషన్ తగ్గట్టుగా చెబితేనే ఎక్కుతుంది.
Date : 19-01-2022 - 10:28 IST -
AP CS: కరోనా వల్ల ప్రభుత్వ ఆదాయం బాగా తగ్గింది!
కరోనా వైరస్ వల్ల ప్రభుత్వ ఆదాయం బాగా తగ్గిపోయిందని ఆంధ్రప్రదేశ్ సీఎస్ సమీర్ శర్మ అన్నారు. థర్డ్ వేవ్ వల్ల మరింత నష్టం జరిగే పరిస్థితి కనిపిస్తోందని, ఏపీలోనే ఉద్యోగుల జీతాల బడ్జెట్ ఎక్కువగా ఉందని తెలిపారు. ఆర్థిక సమస్యలు ఉన్నప్పుడు ప్రభుత్వం ఉద్యోగుల జీతాలు, సంక్షేమ పథకాలు బ్యాలెన్స్ చేసుకోవాలని ఈ సందర్భంగా పేర్కొన్నారు. కరోనా కష్టకాలంలో కూడా ఉద్యోగులకు ఐఆర
Date : 19-01-2022 - 10:02 IST -
Hyderabad: టీనేజర్లకు ఉచిత కోవిడ్ వ్యాక్సిన్
హైదరాబాద్‌లోని ఇనార్బిట్ మాల్లో 15-18 ఏళ్ల మధ్య ఉన్న టీనేజర్లకు ఉచితంగా వ్యాక్సినేషన్ ఇస్తున్నారు. జనవరి మరియు ఫిబ్రవరిలో ఉదయం 11 నుండి సాయంత్రం 5 గంటల వరకు యుక్తవయస్కులకు COVID-19 వ్యాక్సిన్ యొక్క మొదటి డోస్ అందించడానికి మాల్ ఒక ప్రముఖ ఆసుపత్రితో కలిసి పనిచేసింది.
Date : 19-01-2022 - 8:51 IST