Tamil Nadu: తమిళనాడులో నైట్ కర్ఫ్యూ, వీకెండ్ లాక్ డౌన్ ఎత్తివేత
తమిళనాడులో లాక్‌డౌన్ నిబంధనలను ఫిబ్రవరి 15 వరకు మరో రెండు వారాల పాటు పొడిగిస్తూ, ముఖ్యమంత్రి స్టాలిన్ నిర్ణయం తీసుకున్నారు. రాబోయే రోజుల్లో కొన్ని ముఖ్యమైన సడలింపులను ఉంటాయని ఆయన ప్రకటించారు.
- By Hashtag U Published Date - 10:21 AM, Fri - 28 January 22

తమిళనాడులో లాక్‌డౌన్ నిబంధనలను ఫిబ్రవరి 15 వరకు మరో రెండు వారాల పాటు పొడిగిస్తూ, ముఖ్యమంత్రి స్టాలిన్ నిర్ణయం తీసుకున్నారు. రాబోయే రోజుల్లో కొన్ని ముఖ్యమైన సడలింపులను ఉంటాయని ఆయన ప్రకటించారు.
ఫిబ్రవరి ఒకటవ తేదీనుంచి 1 నుంచి 12వ తరగతి వరకు చదువుతున్న విద్యార్థులకు ఫిజికల్ క్లాసులు ప్రారంభం కానున్నాయి.అయితే ప్లేస్కూల్స్, ఎల్‌కేజీ, యూకేజీలు పనిచేయవు. ప్రభుత్వ, ప్రైవేట్ విశ్వవిద్యాలయాలు, కళాశాలలు, పాలిటెక్నిక్‌లు మరియు శిక్షణా కేంద్రాలు ఫిబ్రవరి 1 నుండి (కోవిడ్ కేంద్రాలుగా పనిచేస్తున్నవి మినహా) పని చేయవచ్చు. అలాగే జనవరి 28 నుండి రాత్రి కర్ఫ్యూ ఉండదని.. జనవరి 30 (ఆదివారం) పూర్తి లాక్డౌన్ కూడా ఉండదని సీఎం స్టాలిన్ తెలిపారు.