Thalassemia: తెలంగాణలో ఆ నాలుగు జిల్లాల్లో తలసేమియా ముప్పు
తెలంగాణలో నాలుగు జిల్లాల్లో తలసేమియా ముప్పు ఎక్కువగా ఉందని అధ్యయనం వెల్లడించింది. జీనోమ్ ఫౌండేషన్, తలసేమియా, సికిల్ సెల్ సొసైటీ (టిఎస్‌సిఎస్) సంయుక్త అధ్యయనంలో ఇది వెల్లడైంది.
- By Hashtag U Published Date - 07:39 PM, Thu - 27 January 22

తెలంగాణలో నాలుగు జిల్లాల్లో తలసేమియా ముప్పు ఎక్కువగా ఉందని అధ్యయనం వెల్లడించింది. జీనోమ్ ఫౌండేషన్, తలసేమియా, సికిల్ సెల్ సొసైటీ (టిఎస్‌సిఎస్) సంయుక్త అధ్యయనంలో ఇది వెల్లడైంది. రంగారెడ్డి, సంగారెడ్డి, మహబూబ్‌నగర్, ఖమ్మం జిల్లాల్లో జన్యు వ్యాధి బీటా-తలసేమియా (బిటిఎం) ముప్పు ఎక్కువగా ఉన్నాయని కనుగొన్నారు. సున్ని, లంబాడా, మాదిగ, మాల, ముదిరాజ్ అనే ఐదు కమ్యూనిటీ గ్రూపులకు చెందిన సభ్యులు ఈ జన్యుపరమైన వ్యాధిని ఇతరులకన్నా ఎక్కువగా పొందుతున్నారని అధ్యయనం తెలిపింది.
“బీటా-తలసేమియా నివారణలో హై రిస్క్ డిస్ట్రిక్ట్ మోడల్‌ను గుర్తించడం, అభివృద్ధి చేయడం” అనే శీర్షికతో ఈ అధ్యయనం జరిగింది. ఈ అధ్యయన నమూనాలో BTMతో బాధపడుతున్న 312 మంది పిల్లలు ఉన్నారు. వీరు ఉచిత రక్తమార్పిడి, చెకప్‌ల కోసం TSCS, హైదరాబాద్‌కు వెళ్తున్నారు. ఈ వ్యాధి అరుదైనది కాదని.. ఏదైనా భౌగోళిక ప్రాంతం లేదా సమాజానికి మాత్రమే పరిమితం అని అధ్యయనం కనుగొంది. ప్రమాదంలో ఐదు సంఘాల సమూహాలు ఉన్నాయి. సున్నీ (27.2%), లంబాడా (20.8%), మాదిగ (12.5%), మాల (4.5%) మరియు ముదిరాజ్ (4.5%) 69.5% సహకరించారని, మరో 43 గ్రూపులు 30.5% BTM రోగులకు సహకరించాయని అధ్యయనం పేర్కొంది.