CM KCR: చిరుకు సీఎం కేసీఆర్ ఫోన్.. ఆరోగ్యంపై ఆరా!
- By Balu J Published Date - 01:23 PM, Thu - 27 January 22

టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి కరోనా బారిన పడ్డ విషయం అందరికీ తెలిసిందే. డాక్టర్ల సూచన మేరకు ఆయన హోం క్వారంటైన్ లో ఉండి ట్రీట్ మెంట్ తీసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ చిరంజీవికి ఫోన్ చేశారు. చిరంజీవి ఆరోగ్య విషయాలను అడిగి తెలుసుకొని, త్వరగా రికవరీ కావాలని కోరారు. గత కొద్దిరోజులుగా టాలీవుడ్ కరోనా బారిన పడుతోంది. దీంతో ఆ ప్రభావం చిరంజీవిపై పడింది. మూడు రోజుల క్రితం చిరంజీవి కరోనా టెస్టు చేసుకోవడంతో కొవిడ్ అని తేలింది. ఈ విషయాన్ని ఆయన ట్విట్టర్ ద్వారా తెలియజేశారు.