NATA: లాస్ వేగాస్ లో నాటా నూతన కార్యవర్గం ఎంపిక
అమెరికాలో ప్రవాసాంధ్రుల అభిమాన తెలుగు సంఘం నార్త్ అమెరికా తెలుగు అసొసియేషన్ నాటా బోర్డు సమావేశం లాస్ వేగాస్ లో మూడు వందలు పైగా సభ్యుల సమక్షం లో ఎంతో ఉత్సాహం గా జరిగినది.
- By Hashtag U Published Date - 10:32 PM, Wed - 26 January 22
అమెరికాలో ప్రవాసాంధ్రుల అభిమాన తెలుగు సంఘం నార్త్ అమెరికా తెలుగు అసొసియేషన్ నాటా బోర్డు సమావేశం లాస్ వేగాస్ లో మూడు వందలు పైగా సభ్యుల సమక్షం లో ఎంతో ఉత్సాహం గా జరిగినది. నాటా నూతన అధ్యక్షుడిగా డాక్టర్ కొర్సపాటి శ్రీధర్ రెడ్డి ఇప్పటివరకు అధ్యక్షుడిగా ఉన్న డాక్టర్ గోసల రాఘవ రెడ్డి నుంచి బాధ్యతలు స్వీకరించారు. ఈ సమావేశానికి నాటా అడ్వైజరీ కౌన్సిల్ గౌరవ చైర్మన్ డాక్టర్ ప్రేమ్ రెడ్డి ప్రత్యేక అతిధి గా వచ్చి స్ఫూర్తి ని నింపారు.
ప్రతీ రెండేళ్లకోసారి అంగరంగ వైభవంగా నిర్వహించే నాటా మెగా కన్వెన్షన్ ఈ సారి జులై 2023 లో జరగనున్నది అందుకు డాలస్ వేదిక కానున్నదని డాక్టర్ కొర్సపాటి శ్రీధర్ రెడ్డి తెలిపారు. ప్రవాసాంధ్రులను ఒక్కతాటి పైకి తేవడంతో పాటు వారికి సంబంధించిన అన్ని అంశాలు చర్చిస్తామని, అలాగే తెలుగు రాష్ట్రాల్లో స్వచ్ఛంధ, సేవా కార్యక్రమాలను చేపడతామని శ్రీధర్ రెడ్డి తెలిపారు. రాఘవ రెడ్డి గారు మాట్లాడుతూ న్యూజెర్సీలో ప్రేమ్ రెడ్డి నాటా కమ్యూనిటీ హాల్ ను త్వరలోనే నిర్మిస్తామని తెలిపారు.
ఈ సమావేశం లో అడ్వైజరీ కౌన్సిల్ ఆది శేషారెడ్డి, డా.మోహన్ మల్లం, డా.సంజీవ రెడ్డి, డా.ప్రసాద్ జీరెడ్డి, డా.చంద్రశేఖర్ నరాల తదితర ప్రముఖులు హాజరయ్యారు. ఈ సమావేశం లో 2022 – 2023 కు గాను నాటా కొత్త కార్యవర్గంను ఏకగ్రీవం గా ఎన్నుకున్నది.
డాక్టర్ కొర్సపాటి శ్రీధర్ రెడ్డి(అధ్యక్షులు), హరి వేల్కూర్(కాబోయే అధ్యక్షులు), ఆళ్ళ రామి రెడ్డి (కార్యనిర్వహణ ఉపాధ్యక్షుడు), గండ్ర నారాయణ రెడ్డి(ప్రధాన కార్యదర్శి), సోమవరపు శ్రీనివాస్ (కోశాధికారి), మందపాటి శరత్ (సంయుక్త కోశాధికారి), సతీష్ నరాల(సంయుక్త కార్యదర్శి ), డాక్టర్ గోసల రాఘవ రెడ్డి(మాజీ అధ్యక్షులు)
అలాగే ఎగ్జిక్యూటివ్ కమిటీ లో సభ్యులుగా అంజిరెడ్డి సాగంరెడ్డి (ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్), శ్రీనివాస్ కొట్లూరి (నేషనల్ కన్వెన్షన్ అడ్వైజర్), అంతర్జాతీయ ఉపాధ్యక్షులు గా నగేష్ ముక్కమల్ల, దర్గా నాగిరెడ్డి, లక్ష్మీ నరసింహారెడ్డి కొండా, శ్రీధర్ తిక్కవరపు, సురేన్ బత్తినపట్ల, సురేష్ కొత్తింటి ఎంపిక చేశారు.
డల్లాస్ కన్వెన్షన్ కమిటీ కు గిరీష్ రామిరెడ్డి కన్వీనర్ గా, రామిరెడ్డి బూచిపూడి (కోఆర్డినేటర్), కృష్ణ కోడూరు ( కో కన్వీనర్), భాస్కర్ గండికోట (కో-ఆర్డినేటర్), రమణరెడ్డి (డిప్యూటీ కన్వీనర్), మల్లిక్ అవుల (డిప్యూటీ కోఆర్డినేటర్) గా వుంటారు.
ఈ సమావేశం లో ఆళ్ళ రామి రెడ్డి, గండ్ర నారాయణ రెడ్డి, హరి వేల్కూర్, ఏవీఎన్ రెడ్డి తదితరులు ప్రసంగించారు. ఇండియా కోఆర్డినేటర్స్ గా డీ వీ కోటి రెడ్డి, ఆళ్ళ నవీన్ రెడ్డి, జైపాల్ రెడ్డి, విష్ణు కోటంరెడ్డి ను ఎంపిక చేశారు.
Related News
NATA Meeting : డల్లాస్ లో నాటా బోర్డు సమావేశం.. నిధుల సేకరణ కు విశేష స్పందన
అమెరికాలో ప్రవాసాంధ్రుల అభిమాన తెలుగు సంఘం నార్త్ అమెరికా తెలుగు అసొసియేషన్ (నాటా ) బోర్డు సమావేశం జరిగింది.