Upasana Konidela: మెగాస్టార్ గారూ.. మీ కోడలికి సంస్కారం నేర్పలేదా?
మెగాస్టార్ చిరంజీవి కోడలు ఉపాసన పేరు చెప్పగానే ఆసక్తికరమైన ట్వీట్స్ గుర్తుకువస్తాయి.
- Author : Balu J
Date : 27-01-2022 - 3:45 IST
Published By : Hashtagu Telugu Desk
మెగాస్టార్ చిరంజీవి కోడలు ఉపాసన పేరు చెప్పగానే ఆసక్తికరమైన ట్వీట్స్ గుర్తుకువస్తాయి. నిత్యం సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ ఆరోగ్యం, ఇతర విషయాలపై అవగాహన కల్పిస్తుంటారు. ఆమె ట్వీట్స్ కు నెటిజన్ల నుంచి కూడా మంచి స్పందన వస్తుంటుంది. అయితే ఆమె రిపబ్లిక్ డే నాడు ఓ ఆశ్చర్యకరమైన పోస్టు ను పెట్టారు. అది కాస్త వివాదానికి దారి తీసింది. ఇంతకీ ఉపాసన ఏం ట్విట్ చేసిందంటే..
తమిళనాడులోని ఓ భారీ ఆలయం గోపురం మీద శిల్పాలు, దైవ చిత్రాలకు బదులు మనుషుల ఉన్నారు. ఆ ఫొటోను ఉపాసన షేర్ చేసి.. క్యాప్షన్ ప్లీజ్ అంటూ ట్వీట్ చేశారు. హిందు దేవుడి ఆలయ గోపురం పై మనుషుల బొమ్మలా.. అంటూ నెటిజన్స్ సీరియస్ అవుతున్నారు. అక్కడితో ఆగకుండా చిరంజీవి గారూ… మీ కొడలికి సంస్కారం నేర్పించలేదా అంటూ కొంతమంది కామెంట్స్ సైతం చేశారు. అయితే ఉపాసన మాత్రం తనకేమీ సంబంధం లేన్నట్టుగా ఆ పోస్టును అలాగే వదిలేసింది. అయితే అసలు ట్విస్ట్ ఏంటంటే.. ఆ ఫొటో రియల్ ది కాదనీ, గ్రాఫిక్ చేసినదనీ కొంతమంది అభిప్రాయపడుతున్నారు.
Caption this 👆🏼 piece of art
Mine 👉🏼 Let’s engage in building a progressive, more tolerant nation together through active involvement & inclusion without barriers.
Happy Republic Day 🇮🇳
Btw see if u can spot RC & Me in this image. pic.twitter.com/d6RKKVfMe8
— Upasana Konidela (@upasanakonidela) January 26, 2022