Match Called Off: భారత్, పాకిస్తాన్ మ్యాచ్ రద్దు.. ఇరుజట్లకు చెరో పాయింట్..!
భారత్, పాకిస్తాన్ (IND vs PAK) మ్యాచ్ రద్దు (Match Called Off) అయింది. ఆసియా కప్ లో భారత్, పాకిస్తాన్ మధ్య జరగాల్సిన మ్యాచ్ వర్షం కారణంగా రద్దయింది.
- Author : Gopichand
Date : 02-09-2023 - 10:13 IST
Published By : Hashtagu Telugu Desk
Match Called Off: భారత్, పాకిస్తాన్ (IND vs PAK) మ్యాచ్ రద్దు (Match Called Off) అయింది. ఆసియా కప్ లో భారత్, పాకిస్తాన్ మధ్య జరగాల్సిన మ్యాచ్ వర్షం కారణంగా రద్దయింది. భారత ఇన్నింగ్స్ తర్వాత వర్షం మొదలైంది. ఎంతకూ తగ్గకపోవడంతో మ్యాచ్ ను రద్దు చేస్తున్నట్లు ఫీల్డ్ అంపైర్లు ప్రకటించారు. దీంతో ఇరుజట్లకు చెరో పాయింట్ దక్కింది. తొలుత బ్యాటింగ్ చేసిన ఇండియా 266 రన్స్ చేసిన విషయం తెలిసిందే. పాండ్యా 87, ఇషాన్ 82 రన్స్ తో రాణించారు. ఎల్లుండి నేపాల్ తో భారత్ తలపడనుంది.
దీంతో పాక్ జట్టు మూడు పాయింట్లతో సూపర్-4కు చేరుకుంది. ఒకవేళ నేపాల్‌తో భారత్ ఓడిపోతే ఆసియాకప్ నుంచి నిష్క్రమిస్తుంది. ఇలాంటి పరిస్థితుల్లో సూపర్-4కు చేరుకోవాలంటే నేపాల్‌తో జరిగే మ్యాచ్‌లో టీమిండియా ఎలాగైనా గెలవాల్సిందే. సూపర్-4లో భారత్, పాకిస్థాన్ మరోసారి పోటీపడనున్నాయి.
ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన భారత కెప్టెన్ రోహిత్ శర్మ ముందుగా బ్యాటింగ్ ఎంచుకున్నాడు. తొలి 4 ఓవర్లకు రోహిత్, గిల్ జోడీ జాగ్రత్తగా ఆడి స్కోరును 15 పరుగులకు చేర్చింది. ఆ తర్వాత వర్షం కారణంగా దాదాపు 20 నిమిషాల పాటు ఆటను నిలిపివేయాల్సి వచ్చింది. మ్యాచ్ పున:ప్రారంభం కావడంతో కెప్టెన్ రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ రూపంలో భారత జట్టుకు రెండు పెద్ద షాక్‌లు తగిలాయి.
Also Read: Hardik Pandya Shoelaces: పిక్చర్ ఆఫ్ ది డే.. హార్దిక్ పాండ్యా షూ లేస్‌లు కట్టిన పాక్ క్రికెటర్..!
పాక్ ఫాస్ట్ బౌలర్ షాహీన్ అఫ్రిది మొదట తన అద్భుతమైన ఇన్‌స్వింగ్ బాల్‌లో రోహిత్ శర్మను బౌల్డ్ చేసి భారత్ ని దెబ్బతీశాడు . ఆ తర్వాత విరాట్ కోహ్లీ జట్టు 27 పరుగుల వద్ద అవుట్ అయ్యాడు. దీని తర్వాత బ్యాటింగ్‌కు దిగిన శ్రేయాస్ అయ్యర్.. వచ్చిన వెంటనే పరుగులు చేసేందుకు ప్రయత్నించినా.. 14 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద హరీస్ రవూఫ్‌కు వికెట్ ఇచ్చాడు. 66 పరుగుల వద్ద శుభమన్ గిల్ రూపంలో టీమ్ ఇండియాకు నాలుగో వికెట్ పడటంతో ఇండియా బ్యాట్స్ మెన్ పై పాక్ బౌలర్ల ఒత్తిడి స్పష్టంగా కనిపించింది.
ఆ తర్వాత హార్దిక్ పాండ్యా (90 బంతుల్లో 87), ఇషాన్ కిషన్ (81 బంతుల్లో 82) ఇద్దరూ అర్ధ శతకాలతో అదరగొట్టి.. జట్టును పటిష్ట స్థితిలో నిలిపారు. ఐదో వికెట్‍కు 138 పరుగులను భాగస్వామ్యాన్ని జోడించారు. వీరిద్దరూ ఔట్ అయ్యేసరికి భారత్ స్కోరు 43.1 ఓవర్లలో 239/6. దీంతో మ్యాచ్‌ను ముగించే బాధ్యత రవీంద్ర జడేజా, శార్దూల్ ఠాకూర్ తీసుకున్నారు. అయితే వీరిద్దరూ విఫలమవడంతో టీమ్ ఇండియా 300 మార్కును దాటలేకపోయింది.