Hardik Pandya Shoelaces: పిక్చర్ ఆఫ్ ది డే.. హార్దిక్ పాండ్యా షూ లేస్‌లు కట్టిన పాక్ క్రికెటర్..!
భారత ఇన్నింగ్స్‌లో పాకిస్థాన్ ఆటగాడు షాదాబ్ ఖాన్ (Shadab Khan).. హార్దిక్ పాండ్యా షూ లేస్‌లు (Hardik Pandya Shoelaces) కట్టాడు. షాదాబ్ క్రీడాస్ఫూర్తికి ప్రజలు ప్రశంసలు కురిపిస్తున్నారు.
- By Gopichand Published Date - 08:55 PM, Sat - 2 September 23

Hardik Pandya Shoelaces: 2023 ఆసియా కప్‌లో భాగంగా భారత్ మూడో మ్యాచ్‌లో పాకిస్థాన్‌కు 267 పరుగుల విజయలక్ష్యాన్ని ఉంచింది. ఈ మ్యాచ్‌కు సంబంధించిన ఆసక్తికరమైన ఫోటో సోషల్ మీడియాలో చాలా లైక్ చేయబడింది. భారత ఇన్నింగ్స్‌లో పాకిస్థాన్ ఆటగాడు షాదాబ్ ఖాన్ (Shadab Khan).. హార్దిక్ పాండ్యా షూ లేస్‌లు (Hardik Pandya Shoelaces) కట్టాడు. షాదాబ్ క్రీడాస్ఫూర్తికి ప్రజలు ప్రశంసలు కురిపిస్తున్నారు. ఈ మ్యాచ్‌లో భారత్ తరఫున హార్దిక్ అద్భుత ప్రదర్శన చేశాడు. పాండ్యా 87 పరుగుల ముఖ్యమైన ఇన్నింగ్స్ ఆడాడు.
పాకిస్థాన్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో భారత కెప్టెన్ రోహిత్ శర్మ టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్ ఎంచుకున్నాడు. ఈ సమయంలో హార్దిక్ ఆరో నంబర్‌లో బ్యాటింగ్‌కు వచ్చాడు. భారత ఇన్నింగ్స్‌లో పాండ్యా షూ లేస్‌లు ఊడిపోయాయి. ఇది చూసిన షాదాబ్ ఖాన్ అతనికి సహాయం చేయడానికి వచ్చాడు. షాదాబ్.. పాండ్యా షూ షూలేస్‌లు కట్టాడు. షాదాబ్ క్రీడాస్ఫూర్తిని ప్రదర్శించాడు. దీంతో ఆయనపై ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. షాదాబ్, హార్దిక్ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అభిమానులు కూడా ఆసక్తికర రియాక్షన్స్ ఇచ్చారు.
https://twitter.com/__ABHISHEKRAJ__/status/1697983341105221718?ref_src=twsrc%5Etfw%7Ctwcamp%5Etweetembed%7Ctwterm%5E1697983341105221718%7Ctwgr%5E30cbfdfa5ec3696dcbe0630c19789d339c24a225%7Ctwcon%5Es1_&ref_url=https%3A%2F%2Fwww.abplive.com%2Fsports%2Fcricket%2Findia-vs-pakistan-hardik-pandya-shoe-lace-ties-shadab-khan-3rd-match-asia-cup-2023-2486330
Also Read: India All Out: 266 పరుగులకు టీమిండియా ఆలౌట్.. షాహీన్ అఫ్రిదికి నాలుగు వికెట్లు..!
ఈ మ్యాచ్‌లో ఇషాన్ కిషన్‌తో కలిసి హార్దిక్ భారత్‌ను గట్టెక్కించాడు. తొలుత టీమిండియా 66 పరుగులకే 4 వికెట్లు కోల్పోయింది. ఆ తర్వాత ఇషాన్, హార్దిక్ సెంచరీ భాగస్వామ్యం నెలకొల్పారు. పాండ్యా 90 బంతుల్లో 87 పరుగులు చేశాడు. 7 ఫోర్లు, ఒక సిక్స్ కొట్టాడు. ఇషాన్ 81 బంతుల్లో 82 పరుగులు చేశాడు. ఇషాన్ 9 ఫోర్లు, 2 సిక్సర్లు బాదాడు.
ముందుగా బ్యాటింగ్ చేసిన భారత్ 48.5 ఓవర్లలో 266 పరుగులకు ఆలౌటైంది. భారత్‌కు శుభారంభం లభించలేదు. 11 పరుగుల వ్యక్తిగత స్కోర్ వద్ద రోహిత్ శర్మ ఔటయ్యాడు. 4 పరుగుల వ్యక్తిగత స్కోర్ వద్ద విరాట్ కోహ్లీ ఔటయ్యాడు. 10 పరుగులు చేసిన తర్వాత శుభ్‌మన్ గిల్ ఔట్ అయ్యాడు. 14 పరుగుల వద్ద శ్రేయాస్ అయ్యర్ కూడా పెవిలియన్‌కు చేరుకున్నాడు. రవీంద్ర జడేజా 14 పరుగులు చేశాడు. శార్దూల్ ఠాకూర్ 3 పరుగులు చేసి ఔట్ అయ్యాడు.