HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Sports
  • >India Vs South Africa Live Score

world cup 2023: కోహ్లీ, అయ్యర్ విధ్వంసం..

ఈడెన్ గార్డెన్స్‌లో లో టీమిండియా సౌతాఫ్రికా జట్ల మధ్య హోరాహోరీ మ్యాచ్ జరుగుతుంది. తొలుత బ్యాటింగ్ బరిలో టీమిండియా ఓపెనర్లు ధాటిగా ఆడారు. రోహిత్ శర్మ వేగంగా పరుగులు తీయడంపై దృష్టిపెడితే గిల్ మెల్లగా ఆడాడు. ఈ క్రమంలో రోహిత్ హాఫ్ సెంచరీకి చేరువలో అవుట్ అయ్యాడు.

  • Author : Vamsi Chowdary Korata Date : 05-11-2023 - 5:34 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
World Cup 2023 (81)
World Cup 2023 (81)

world cup 2023: ఈడెన్ గార్డెన్స్‌లో లో టీమిండియా సౌతాఫ్రికా జట్ల మధ్య హోరాహోరీ మ్యాచ్ జరుగుతుంది. తొలుత బ్యాటింగ్ బరిలో టీమిండియా ఓపెనర్లు ధాటిగా ఆడారు. రోహిత్ శర్మ వేగంగా పరుగులు తీయడంపై దృష్టిపెడితే గిల్ మెల్లగా ఆడాడు. ఈ క్రమంలో రోహిత్ హాఫ్ సెంచరీకి చేరువలో అవుట్ అయ్యాడు.

కసిగో రబడా బౌలింగ్ లో 40 పరుగుల వద్ద రోహిత్ పెవిలియన్ చేరాడు. రోహిత్ 24 బంతుల్లో 2 సిక్సర్లు, 6 ఫోర్ల సహాయంతో 40 పరుగులు సాధించాడు. రోహిత్ అవుట్ అవ్వడంతో మైదానంలో అడుగుపెట్టిన కోహ్లీ గిల్ తో కలిసి మ్యాచ్ ని చక్కదిద్దే ప్రయత్నం చేశాడు. గిల్, కోహ్లీ ధాటిగా ఆడుతుండటంతో రోహిత్ అవుట్ అయిన బాధని ఫాన్స్ మర్చిపోయారు. తొలి పవర్ ప్లే 10 ఓవర్లు ముగిసే సమయానికి వికెట్ నష్టానికి టీమిండియా 91 రన్స్ చేసింది. ఈ క్రమంలో గిల్ అవుట్ అయి తీవ్రంగా నిరాశపరిచాడు. కేశవ్ మహరాజ్ బౌలింగ్ లో శుభ్‌మన్ గిల్ 23 పరుగుల వద్ద క్లీన్ బౌల్డ్ అయ్యాడు. 24 బంతుల్లో 4 ఫోర్లు, 1 సిక్సర్ సహాయంతో 23 పరుగులు వద్ద గిల్ పెవిలియన్ చేరాడు.

93 పరుగుల దగ్గర ఇండియా రెండో వికెట్ కోల్పోయింది. గిల్ అవుట్ అవ్వడంతో అయ్యర్ మైదానంలో అడుగుపెట్టాడు. ఆరంభంలో తడబడినా మిడ్ ఓవర్లు ముగిసిన తర్వాత బౌండరీల వర్షం కురిపించాడు. మరోవైపు కోహ్లీ పుట్టిన రోజున చెలరేగి ఆడాడు. కోహ్లీ 67 బంతుల్లో 6 బౌండరీలు కొట్టి ఫిఫ్టీ కంప్లీట్ చేశాడు. పుట్టిన రోజు జరుపుకుంటున్న విరాట్ కోహ్లీ రాణించాలని అభిమానులు కోరుకున్నట్టుగానే కోహ్లీ అద్భుతంగా ఆడాడు. ఇక శ్రేయాస్ ధాటిగా ఆడటంతో ఫిఫ్టీ పూర్తి చేశాడు. 65 బంతుల్లో 6 బౌండరీల సహాయంతో ఫిఫ్టీ చేశాడు. సౌతాఫ్రికాపై శ్రేయస్ అయ్యర్ వరుసగా రెండో హాఫ్ సెంచరీ నమోదు చేశాడు. 77 పరుగుల వద్ద అయ్యర్ పెవిలియన్ చేరాడు. దీంతో ఒక్కసారిగా స్కోర్ బోర్డు వేగం తగ్గింది. అయ్యర్ తర్వాత క్రీజులోకి అడుగుపెట్టిన కేఎల్ రాహుల్ 17 బంతులు ఆడి 8 పరుగులు చేసి అవుట్ అయ్యాడు. కోహ్లీ, సూర్యకుమార్ యాదవ్ కలిసి జట్టును ముందుకు నడిపిస్తున్నారు.

Also Read: AP : రాష్ట్రంలో ఎప్పుడు ఎన్నికలు వచ్చిన గెలిచేది జగనే – ధర్మాన కృష్ణ దాస్


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • ind vs sa
  • india
  • Live Score
  • shreyas iyer
  • south africa
  • virat kohli
  • world cup 2023

Related News

    Latest News

    • LPG Cylinder Subsidy: సబ్సిడీతో ఇక ఏడాదికి 4 సిలిండర్లే!

    • Arjun Tendulkar: కొడుకు అర్జున్‌ ప్రదర్శనపై సచిన్‌ ప్రశంసల జల్లు

    • H1B visa: వీసాలపై అమెరికా ఉక్కుపాదం.. హెచ్‌-1బీ వీసా ఫీజు పెంపు

    • తెలంగాణను తాకిన నైరుతి రుతుపవనాలు

    • చంద్రబాబును కలిసిన పెద్దాయన సత్యనారాయణ

    Trending News

      • Kalita Majhi: అప్పట్లో ఇంటి పనిమనిషి.. నేడు బెంగాల్‌ మంత్రి

    HashtagU Telugu
    • Contact Us
    • About Us
    • Privacy & Cookies Notice
    Network
    • English News
    • Telugu News
    • Hindi News
    Category
    • Telangana News
    • Andhra Pradesh News
    • National News
    • South
    • Entertainment News
    • Trending News
    • Special News
    • Off Beat
    • Business News
    Trending News
    • Health Tips
    • Movie Reviews
    • 2024 Olympics
    • Life Style
    • Nara Lokesh
    • Nara Chandrababu Naidu
    • Revanth Reddy
    • kcr

    follow us

    • Copyright © 2026 Hashtag U. All rights reserved.
    • Powered by Veegam Software Pvt Ltd