HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Speed News
  • >Congress Will Decimate Bjp In Telangana Says Rahul Gandhi

Telangana Politics: తెలంగాణాలో రాజకీయ రగడ మొదలుకానుందా…?

రానున్న ఎన్నికల నేపథ్యంలో రాజకీయాల జోరు అమాంతం ఊపందుకుంది. ఈ ఎన్నికల్లో ప్రాంతీయ పార్టీల విషయం అంటుంచింతే, నేషనల్ పార్టీలైన కాంగ్రెస్, బీజేపీల మధ్య రాజకీయ పోరు తారాస్థాయికి చేరుకుంది.

  • Author : Vamsi Chowdary Korata Date : 04-06-2023 - 3:03 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Telangana Politics
Modi Kcr Rahul 1537069514

Telangana Politics: రానున్న ఎన్నికల నేపథ్యంలో రాజకీయాల జోరు అమాంతం ఊపందుకుంది. ఈ ఎన్నికల్లో ప్రాంతీయ పార్టీల విషయం అంటుంచింతే, నేషనల్ పార్టీలైన కాంగ్రెస్, బీజేపీల మధ్య రాజకీయ పోరు తారాస్థాయికి చేరుకుంది. తాజా కర్ణాటక ఎన్నికల ఫలితాల్లో కాంగ్రెస్ ప్రభంజనం సృష్టించింది. అధికార పార్టీ బీజేపీని ఆల్మోస్ట్ తుడిచిపెట్టేసింది. దీంతో కాంగ్రెస్ వర్గాల్లో జోష్ మొదలైంది. వచ్చే ఎన్నికల్లో ఎలాగైనా ఢిల్లీ గడ్డపై కాంగ్రెస్ హస్తం జెండా ఎగురవేస్తామని ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఇదిలా ఉండగా కర్ణాటక ఫలితాల్లో విశేషంగా ఆకట్టుకున్న కాంగ్రెస్ ప్రస్తుతం తెలంగాణాని ఫోకస్ చేసింది. వచ్చే ఎన్నికల్లో తెలంగాణ గడ్డపై కాంగ్రెస్ జెండా ఎగురుతుందనే సంకేతాలు పంపిస్తున్నారు ఆ పార్టీ ప్రధాన నేతలు.

కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి రాహుల్ గాంధీ (Rahul Gandhi)ప్రస్తుతం అమెరిక పర్యటనలో ఉన్నారు. పలు ప్రతిష్టాత్మక వేదికలపై ఆయన ప్రసంగిస్తున్నారు. అమెరికా వేదికగా ప్రధాని మోడీపై రాహుల్ గురి పెట్టారు. విదేశీ గడ్డపై ప్రధాని మోడీని ఏకిపారేస్తున్నారు. భారత్ లో మోడీ (PM Modi)పరిపాలన చివరిదశకు చేరుకుందని రాహుల్ అన్నారు. దేశంలో మోడీ రాక్షస పాలనను తుడిచిపెట్టే రోజులు దగ్గర పడ్డాయని రాహుల్ అన్నారు. కర్ణాటక ఎన్నికల్లో బీజేపీని ఓడించడం కాదని, తుడిచిపెట్టేసినమని, ఇప్పుడు తెలంగాణలోనూ ఇదే రిపీట్ అవ్వనున్నట్టు రాహుల్ వ్యక్తం చేశారు.

వచ్చే ఎన్నికలలోపు మోడీ వ్యతిరేక శక్తులన్నీ ఏకమవుతాయని రాహుల్ చెప్పారు. తెలంగాణాలో బీజేపీని నమ్మే పరిస్థితి లేదని, తెలంగాణలోనూ బీజేపీని తుడిచిపెట్టేస్తామని ఆశాభావం వ్యక్తం చేశారాయన. ఇదిలా ఉండగా ఈ ఏడాది తెలంగాణాలో ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో తెలంగాణ రాజకీయాల్లోనూ రాజకీయ రగడ మొదలైంది. తెలంగాణాలో ప్రధానంగా బీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ పార్టీల మధ్య రసవత్తర పోరు జరగనుంది. అయితే గత కాలంగా బీఆర్ఎస్ కు బీజేపీ ప్రధాన ప్రతిపక్షంగా కనిపించినా, అనూహ్యంగా కాంగ్రెస్ దూసుకొచ్చింది.దీంతో తెలంగాణాలో కాంగ్రెస్ పార్టీ పూర్వవైభవాన్ని తీసుకొచ్చేందుకు చరిష్మా ఉన్న నేతలను రంగంలోకి దించుతుంది. (Telangana Politics)

తెలంగాణలో కెసిఆర్ (KCR) నాయకత్వంలో బీఆర్ఎస్ కు తిరుగులేకుండాపోయింది. బీఆర్ఎస్ పార్టీ తెలంగాణ ప్రజల పార్టీ అన్నంతగా కెసిఆర్ తన పార్టీని మలుచుకున్నారు.తెలంగాణ ఇచ్చింది కాంగ్రెస్ అయినప్పటికీ, తెలంగాణ తెచ్చింది నేనే అనే నినాదాన్ని ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లారు. దీంతో బీఆర్ఎస్ ప్రస్తుతం తెలంగాణ గడ్డపై ఎదురులేని పార్టీగా తయారైంది. అయితే ప్రస్తుతం తెలంగాణ రాజకీయాల్లోనూ కాస్త మార్పు చోటుచేసుకుంటుంది. టిఆర్ఎస్ బీఆర్ఎస్ గా మారిన తరువాత ఆ పార్టీని ప్రజలు విశ్వసించడం లేదన్నది ప్రధాన విమర్శ. ఈ నేపథ్యంలో తెలంగాణ ఇచ్చిన పార్టీ కాంగ్రెస్ ను హక్కును చేర్చుకునేందుకు ప్రజలు కూడా ఆలోచిస్తున్నట్టు సర్వేలు చెప్తున్నాయి. ఇక తెలంగాణాలో బీజేపీ బలం పెద్దగా కనిపించడం లేదు. సరైన నాయకత్వం లేకపోవడంతో తెలంగాణ బీజేపీ బలహీనంగానే కనిపిస్తుంది. మరోవైపు వైఎస్ షర్మిల అధికార పార్టీని ఇరుకున పెడుతూ కెసిఆర్ కి తలనొప్పిగా మారింది. కాగా వచ్చే ఎన్నికల నాటికి షర్మిల కాంగ్రెస్ తో దోస్తీ కట్టి కెసిఆర్ కు గట్టి పోటీ ఇచ్చేందుకు అడుగులు వేస్తున్నది. ఇటీవల ప్రియాంక గాంధీ షర్మిలతో మాట్లాడి డీల్ సెట్ చేసినట్లుగా వార్తలు గుప్పుమన్నాయి.

తెలంగాణాలో బీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ పార్టీల మధ్య ప్రధాన పోరు జరగనుంది. అయితే బీజేపీ బలాన్ని తగ్గించేందుకు కెసిఆర్ అవసరమైతే కాంగ్రెస్ తో దోస్తీ కట్టే అవకాశం లేకపోలేదంటున్నారు రాజకీయ పండితులు. బీజేపీని ఒంటరిని చేసి వైఎస్ఆర్టీపి, బీఆర్ఎస్, కాంగ్రెస్ కలిసి సీట్లు పంచుకునే అవకాశం కూడా లేకపోలేదంటున్నారు. అయితే ఇదంతా కేంద్రంలో కాంగ్రెస్ అధికారం చేపట్టేందుకేనని పరిణామాలు చెప్తున్నాయి. మరోవేపు టీడీపీ కూడా తెలంగాణ రాజకీయాలపై ఆసక్తి చూపిస్తుంది. టీడీపీ బీజేపీ కలిసి తెలంగాణ ఎన్నికల్లో పోటీ చేసేందుకు సిద్ధమవుతున్నాయి. ఇప్పటికే చంద్రబాబు బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా, పార్టీ ముఖ్య నేత జేపీ నడ్డాతో సమావేశమై చర్చలు జరిపారు. దీంతో తెలంగాణ రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి. మొత్తానికి దేశంలో బీజేపీని ఒంటరిని చేసి కాంగ్రెస్ అధికారంలోకి రావాలని తహతహలాడుతోంది. చూడాలి మరి ఎం జరుగుతుందో.

Read More: Indian Railways: ప్రతి ఏడాది పట్టాలు తప్పుతున్న 282 రైళ్లు.. కాగ్ నివేదికలో కీలక విషయాలు..!


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • bjp
  • brs
  • congress
  • Karnataka Election Results
  • kcr
  • modi
  • rahul gandhi
  • sharmila
  • telangana elections
  • telangana political analysis
  • telangana politics
  • ysrtp

Related News

RS Praveen Kumar Challenges Bandi!

Bandi Sanjay: బండికి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సవాల్!

బండి భగీరథ్‌ కేసు విషయంలో బండి సంజయ్‌ని ఉద్దేశించి బీఆర్ఎస్ నేత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సంచలన ఆరోపణలు చేశారు. ఈ కేసు విషయంలో బండి సంజయ్ బాధితులను బెదిరించారని సంచలన వ్యాఖ్యలు చేశారు. బాధితులను ఎలాంటి బెదిరింపులకు గురి చేయలేదని బండి సంజయ్ హనుమాన్ గుడిలో ప్రమాణం చేయాలని ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ డిమాండ్ చేశారు. బండి సంజయ్ నిజమైన హనుమాన్ భక్తుడైతే తన కొడుకును పోలీసులకు అప్పగ

  • Cm Revanth

    POCSO Case: బండి భ‌గీర‌థ్‌ కేసుపై సీఎం రేవంత్ సీరియస్

  • Ktr

    KTR: మాజీ మంత్రి కేటీఆర్‌పై క్రిమినల్ కేసు నమోదు..

Latest News

  • Revanth Reddy: తెలంగాణ సర్కార్ మరో కీలక నిర్ణయం.. మూడు నగరాలకు ఔటర్ రింగ్ రోడ్లు

  • Work From Home: ప్రభుత్వ ఉద్యోగులకు వర్క్ ఫ్రం హోం.. చంద్రబాబు కీలక ప్రకటన..!

  • Karuppu: సూర్య కరుప్పు కు షాక్.. మార్నింగ్‌ షోలు రద్దు

  • AP Cabinet Meeting: ఏపీ కేబినెట్ సమావేశం.. 2 లక్షల కోట్ల పెట్టుబడులకు గ్రీన్‌సిగ్నల్

  • Vaastu Tips: పిచ్చుకలు ఇంట్లో గూడు కట్టాయా? అయితే వాస్తు శాస్త్రం ఏం చెబుతుందో తెలుసుకోండి..!!

Trending News

    • Petrol price: పెట్రోల్‌, డీజిల్‌ ధరలపై ఆర్‌బీఐ గవర్నర్‌ షాకింగ్ కామెంట్స్

    • TVK విజయ్‌ అను నేను..

    • CM VIJAY: టీవీకేకు వీసీకే మద్దతు: ప్రభుత్వ ఏర్పాటుకు లైన్ క్లియర్

    • CM Vijay Thalapathy: ప్రభుత్వ ఏర్పాటుకు గ్రీన్ సిగ్నల్..!

    • Tamil Nadu Politics: విజయ్ను ముప్పుతిప్పలు పెడుతున్న VCK.. డిప్యూటీ సీఎం పదవి ఇస్తేనే

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd