Congress Protest : నేడు దేశ వ్యాప్తంగా నిరసనలకు పిలుపునిచ్చిన కాంగ్రెస్
ద్రవ్యోల్బణం, నిరుద్యోగం, పెరిగిన జీఎస్టీ రేట్లకు వ్యతిరేకంగా కాంగ్రెస్ శుక్రవారం దేశవ్యాప్తంగా నిరసనలు చేపట్టింది.
- Author : Prasad
Date : 05-08-2022 - 9:26 IST
Published By : Hashtagu Telugu Desk
ద్రవ్యోల్బణం, నిరుద్యోగం, పెరిగిన జీఎస్టీ రేట్లకు వ్యతిరేకంగా కాంగ్రెస్ శుక్రవారం దేశవ్యాప్తంగా నిరసనలు చేపట్టింది. ఢిల్లీ పోలీసులు అనుమతి నిరాకరించినప్పటికీ, ప్రధాని నివాసం వద్ద నిరసన చేపట్టాలని కూడా కాంగ్రెస్ పార్టీ యోచిస్తోంది. పార్టీ ప్రధాన కార్యదర్శులు, రాష్ట్ర ఇన్‌ఛార్జ్‌లు, రాష్ట్ర అధ్యక్షులకు ఆయా రాష్ట్రాల్లో అన్ని స్థాయిల్లో నిరసనలు తెలియజేయాలని ఆదేశాలు జారీ చేశారు. దేశవ్యాప్త ఆందోళనలకు పార్టీ ఆఫీస్ బేరర్లు ప్రజలతో మమేకమయ్యేలా చూడాలని కూడా వారికి సూచించారు. ప్రతిపక్ష పార్టీలు లేవనెత్తిన డిమాండ్‌ను అనుసరించి సోమవారం లోక్‌సభలో ధరల పెరుగుదలపై చర్చ జరిగింది.ఇందులో ద్రవ్యోల్బణం ప్రతి ఇంటిని ప్రభావితం చేస్తుందని కాంగ్రెస్ ఆరోపించింది. అయితే, రిటైల్ ద్రవ్యోల్బణాన్ని 7 శాతం దిగువకు తగ్గించేందుకు ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తోందని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ అన్నారు.