HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Speed News
  • >Ap Pensions Unqualified Recipients Issues Reviewed

AP Pensions : ఆంధ్రప్రదేశ్‌లో అనర్హులకు కూడా పెన్షన్లు.. కలెక్టర్ల కాన్ఫరెన్స్ లో శశిభూషణ్ కుమార్ వెల్లడి..

AP Pensions : ఏపీలో అనర్హులకూ పెన్షన్లు అందుతున్నట్లు బయటపడింది. ప్రతీ 10 వేల మందిలో దాదాపు 500 మంది అర్హత లేని వారు పెన్షన్ పొందుతున్నట్లు అధికారులు గుర్తించారు. ఈ వివరాలను రాష్ట్ర పంచాయతీ రాజ్, గ్రామీణ అభివృద్ధి శాఖ ముఖ్య కార్యదర్శి శశిభూషణ్ కుమార్ కలెక్టర్ల సమావేశంలో ప్రజెంటేషన్ ద్వారా వెల్లడించారు.

  • Author : Kavya Krishna Date : 12-12-2024 - 12:43 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Ap Pensions
Ap Pensions

AP Pensions : ఆంధ్రప్రదేశ్‌లో అనర్హులకూ పెన్షన్లు అందుతున్నట్లు బయటపడింది. ప్రతీ 10 వేల మందిలో దాదాపు 500 మంది అర్హత లేని వారు పెన్షన్ పొందుతున్నట్లు అధికారులు గుర్తించారు. ఈ వివరాలను రాష్ట్ర పంచాయతీ రాజ్, గ్రామీణ అభివృద్ధి శాఖ ముఖ్య కార్యదర్శి శశిభూషణ్ కుమార్ రెండో రోజు కలెక్టర్ల సమావేశంలో ప్రజెంటేషన్ ద్వారా వెల్లడించారు. అనర్హులకు పెన్షన్లు అందుతున్నాయనే ఫిర్యాదులపై నిర్వహించిన సర్వేలో ఈ వివరాలు వెల్లడయ్యాయి. గత ప్రభుత్వ కాలంలో, ముఖ్యంగా ఎన్నికల ముందు, 6 లక్షల మందికి పెన్షన్లు మంజూరు చేయడం జరిగింది. వీరిలో చాలా మంది అనర్హులేనని, ఇది ఆ సమయంలో తీసుకున్న హడావుడి నిర్ణయాల ఫలితమని మంత్రి నాదెండ్ల మనోహర్ పేర్కొన్నారు. ఈ సమస్యకు పరిష్కారం చూపేందుకు ప్రతి పెన్షన్‌ను జిల్లా కలెక్టర్ల ద్వారా మూడు నెలల్లోగా పరిశీలించాలంటూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశాలు జారీ చేశారు.

గ్రామీణ ఉపాధి హామీ పథకంపై ఫోకస్
సీఎం చంద్రబాబు నాయుడు గ్రామీణ ఉపాధి హామీ పథకం (MGNREGS) పనుల ప్రగతిని సమీక్షించారు. వంద రోజుల పనిదినాలు సక్రమంగా నిర్వహించకపోవడం వల్ల మెటీరియల్ కాంపోనెంట్ సబ్సిడీ రాకుండా పోతుందని చెప్పారు. పల్లె పండుగలో పనులు కేవలం 14.8 శాతం పూర్తయ్యాయని, అల్లూరి జిల్లాలో 54 శాతం పనులు పూర్తయ్యాయని, కానీ మరో జిల్లాలో కేవలం 1.6 శాతం మాత్రమే పనులు జరగడం సరికాదని సీఎం అభిప్రాయపడ్డారు. జల జీవన్ మిషన్‌ను గత ప్రభుత్వం నిర్లక్ష్యంగా నిర్వహించిందని ఆరోపించిన సీఎం, గ్రామీణ ప్రాంతాల్లో అంతర్గత రహదారుల నిర్మాణం తిరిగి ప్రారంభించినట్లు తెలిపారు. గ్రామాల్లో కనీస మౌలిక సదుపాయాలు అందించడంలో ప్రాధాన్యత చూపాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు.

తల్లిదండ్రులను కోల్పోయిన చిన్నారులకు ప్రత్యేకంగా పెన్షన్లు అందించాలని సూచించిన సీఎం, దివ్యాంగుల కోసం 15 వేల పెన్షన్ డిమాండ్లపై దృష్టి సారించారు. అర్హులకే ధృవీకరణ పత్రాలు అందేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్లకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. సీఎం చంద్రబాబు నాయుడు తన సమీక్షలో పని పూర్తయిన వెంటనే బిల్లులు చెల్లించడంలో జాప్యం ఎందుకని ప్రశ్నించారు. కలెక్టర్లు నిర్లిప్తంగా వ్యవహరించడం సరికాదని హెచ్చరించారు. ఈ చర్యలన్నీ పారదర్శకతను పెంపొందించడంతో పాటు, అర్హులకు మాత్రమే సంక్షేమ ఫలాలు అందించే దిశగా నడిపించడమే లక్ష్యమని సీఎం స్పష్టం చేశారు.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • andhra pradesh
  • Chief Minister Chandrababu Naidu
  • District Collectors
  • Jala Jeevan Mission
  • MGNREGS
  • pensions
  • rural development
  • Transparency
  • Unqualified Recipients
  • Welfare Programs

Related News

Air Trunk Campus to be Established in Visakhapatnam! — Minister Nara Lokesh

Nara Lokesh: విశాఖలో ఎయిర్ ట్రంక్ క్యాంపస్ ఏర్పాటు..! మంత్రి నారా లోకేష్

ఆంధ్రప్రదేశ్‌కు భారీ పెట్టుబడులను ఆకర్షించడమే లక్ష్యంగా రాష్ట్ర ఐటీ, ఎలక్ట్రానిక్స్, విద్యాశాఖల మంత్రి నారా లోకేష్ తన ప్రయత్నాలను ముమ్మరం చేశారు. ఇందులో భాగంగా, ప్రపంచవ్యాప్తంగా హైపర్‌స్కేల్ డేటా సెంటర్లను నిర్వహిస్తున్న ప్రఖ్యాత సంస్థ ఎయిర్‌ట్రంక్ సీఈఓ రాబిన్ ఖుదాతో ముంబయిలో ఆయన కీలక సమావేశం నిర్వహించారు. విశాఖపట్నంలో ‘ఎయిర్‌ట్రంక్ ఫ్యూచర్ క్యాంపస్’ను ఏర్ప

  • CBN

    CBN : జూన్ 4 రాష్ట్ర విముక్తి దినం : చామవరం సభలో సీఎం చంద్రబాబు

  • A Decades-Old Dream Realized: South Coast Railway Zone Launched, Headquartered in AP.

    South Coast Railway Zone: నెరవేరిన దశాబ్దాల నాటి కల.. ఏపీ కేంద్రంగా దక్షిణ కోస్తా రైల్వేజోన్‌ ప్రారంభం

  • NRI TDP

    TDP NRI : లాస్ ఏంజెల్స్ లో ఘనంగా ఎన్టీఆర్ జయంతి, మినీ మహానాడు వేడుకలు

  • AP

    AP : కుప్పంలో పీఎం మిత్రా పార్క్, అమరావతిలో నిఫ్ట్.. కేంద్రానికి ఏపీ ప్రతిపాదనలు

Latest News

  • Annamalai: బీజేపీకి అన్నామలై రాజీనామా

  • Kangana Ranaut: కంగనా రిక్వెస్ట్.. నేషనల్ క్రష్ ట్యాగ్‌ను అంగీకరించని నటి గిరిజా ఓక్

  • Donald Trump Tariff: భారత్‌పై టారిఫ్స్ 25% నుంచి 15% తగ్గింపు : ట్రంప్ కీలక నిర్ణయం

  • Krunal Pandya: ఐపీఎల్‌లో ఐదోసారి కప్పు కొట్టిన కృనాల్ పాండ్యా

  • Dental Tips: ఏ వయసులో దంతాలు బలహీనమవుతాయి? దీనికి కారణం ఏంటో తెలుసా?

Trending News

    • Nandu’s World Nandana: మా మీద కావాలనే కుట్ర.. డబ్బులిచ్చి సోషల్ మీడియా లో దుష్ర్పచారం Nandu’ s world సంచలనం

    • Kalita Majhi: అప్పట్లో ఇంటి పనిమనిషి.. నేడు బెంగాల్‌ మంత్రి

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd