HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Andhra Pradesh
  • >Deadline For Sir Extended In Ap

Election Commission: ఏపీలో ‘SIR’ గడువు పెంపు!

  • Author : Vamsi Chowdary Korata Date : 14-07-2026 - 3:37 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Deadline for 'SIR' extended in AP!
Deadline for 'SIR' extended in AP!

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (ఎస్ఐఆర్) గడువును పెంచుతూ కేంద్ర ఎన్నికల సంఘం నిర్ణయం తీసుకుంది. జూలై 24వ తేదీ వరకూ SIR (Special Intensive Revision) గడువును పెంచింది. వాస్తవానికి నేటితో (జులై 14) ఎస్ఐఆర్ గడువు ముగియనుంది. అయితే ఎస్ఐఆర్ గడువు పొడిగించాలంటూ ఏపీ ఎన్నికల ప్రధానాధికారి ఎన్నికల సంఘానికి లేఖ రాశారు. ఈ నేపథ్యంలో జూలై 24వ తేదీ వరకూ ఎస్ఐఆర్ గడువును పొడిగిస్తూ కేంద్ర ఎన్నికల సంఘం నిర్ణయం తీసుకుంది. జూలై 31న ఓటర్ల ముసాయిదా జాబితా విడుదల చేయనుంది. జూలై 31వ తేదీ నుంచి ఆగస్ట్ 30వ తేదీ వరకూ ఓటర్ల జాబితాపై అభ్యంతరాల స్వీకరణకు అవకాశం ఇచ్చింది. ఏపీ ఎన్నికల ప్రధానాధికారి అభ్యర్థనతో సవరించిన కొత్త షెడ్యూల్‌ను వెల్లడించింది.

మరోవైపు ఏపీలో గత నెల రోజులుగా ఎస్ఐఆర్ ప్రక్రియ చేపట్టగా.. జూలై 13వ తేదీ నాటికి 88 శాతం ఓటర్ల డిజిటలైజేషన్ పూర్తైంది. అయితే జూలై 14వ తేదీతో ఎస్ఐఆర్ గడువు పూర్తి కానుండటం.. డిజిటలైజేషన్ ప్రక్రియ ఇంకా పూర్తి కాకపోవటంతో గడువును పొడిగించాలంటూ వివిధ రాజకీయ పార్టీలు రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి వివేక్ యాదవ్‌ను కోరారు. ఈ నేపథ్యంలో ఈ ప్రక్రియ గడువును పొడిగించాలని కేంద్ర ఎన్నికల సంఘానికి సీఈవో లేఖ రాశారు. దీంతో ఎన్నికల సంఘం కొత్త షెడ్యూల్ వెల్లడించింది.

మరోవైపు ఏపీలో ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియలో భాగంగా 4 కోట్ల 16 లక్షల 26 వేల 144 ఎన్యుమరేషన్ ఫారాలను బీఎల్‌వోలు పంపిణీ చేశారు. సోమవారం వరకూ 3 కోట్ల 69 లక్షల 50 వేల 812 మంది ఓటర్ల వివరాలను, అంటే 88 శాతం మంది వివరాలను డిజిటలైజేషన్ చేశారు. ఇంకా 1.67 శాతం ఫారాలు పెండింగ్‌లో ఉన్నాయి. సర్వే ప్రక్రియలో భాగంగా ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా 14,19,644 మంది ఓటర్లు మరణించినట్లు అధికారులు గుర్తించారు. ఉపాధి, ఇతర కారణాలతో 12,14,994 మంది ఇతర ప్రాంతాలకు శాశ్వతంగా వలస వెళ్లినట్లు గుర్తించారు.

అలాగే బీఎల్ఓలు ఓటర్ల ఇళ్లకు వెళ్లిన సమయంలో.. 7,26,425 మంది ఓటర్లు అందుబాటులో లేరు. ఈ నేపథ్యంలో చనిపోయిన ఓటర్ల విషయాన్ని పక్కనబెడితే ఎస్ఐఆర్ ప్రక్రియ ఏపీలో ఇంకా 9 శాతానికి పైగా పూర్తి కావాల్సి ఉంది. ఈ నేపథ్యంలో గడువు పొడిగించాలని కోరుతూ రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి.. కేంద్ర ఎన్నికల సంఘానికి ప్రత్యేకంగా లేఖ రాశారు. ఎస్ఐఆర్ ప్రక్రియను వంద శాతం పూర్తి చేసేందుకు సమయాన్ని పెంచాలని కోరడంతో ఎన్నికల సంఘం అంగీకరిస్తూ గడువును పొడిగించింది.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • andhra pradesh
  • CEO Mukesh Kumar Meena
  • election commission of india
  • Election Commission of India (ECI)
  • sir
  • voter list

Related News

Scorching heat ahead; intense sultriness today as well.

Weather update: దంచికొట్టనున్న ఎండలు.. నేడు కూడా తీవ్ర ఉక్కపోత

సాధారణంగా నైరుతి రుతుపవనాల ప్రభావంతో జూలై నెలలో విస్తారంగా వర్షాలు కురిసి వాతావరణం చల్లబడాలి. కానీ, ఈ ఏడాది రుతుపవనాల జాడ లేకపోవడంతో తెలుగు రాష్ట్రాల్లో మునుపెన్నడూ లేని విధంగా ఎండలు హడలెత్తిస్తున్నాయి. జూలై మాసంలో కూడా ప్రజలు భానుడి భగభగలకు విలవిలలాడుతున్నారు. నిన్న ఆంధ్రప్రదేశ్‌లోని తీరప్రాంత నగరమైన బాపట్లలో అత్యధికంగా 42.1 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదైంది. క

  • Supreme Court rejects Telangana's plea regarding the Banakacherla petition.

    Banakacherla Project: బనకచర్ల పిటిషన్‌పై తెలంగాణ అభ్యర్థనకు నిరాకరించిన సుప్రీంకోర్టు

  • Are you applying for a new vote? Here are the EC's new rules.

    New Voter Registration: కొత్తగా ఓటు కోసం దరఖాస్తు చేసుకుంటున్నారా..? ఈసీ కొత్త రూల్స్..

  • INS Mahendragiri joins the Indian Navy.

    INS Mahendragiri: భారత నౌకాదళంలో చేరిన ఐఎన్‌ఎస్ మహేంద్రగిరి

  • State-of-the-art showroom 'Elite Eco Energy' inaugurated in Bhimavaram.

    Elite Eco Energies: భీమవరంలో అత్యాధునిక షోరూమ్ ‘ఎలైట్ ఎకో ఎనర్జీస్’ ప్రారంభం

Latest News

  • Election Commission: ఏపీలో ‘SIR’ గడువు పెంపు!

  • Revanth Reddy: తెలంగాణ అభివృద్ధికి.. సీఎం రేవంత్ రెడ్డి మాస్టర్ ప్లాన్!

  • AP Local Body Elections: ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలపై బిగ్ అప్డేట్

  • StepX Neo Smartphone: ప్రపంచంలోనే తొలి ఏజెంటిక్ స్మార్ట్‌ఫోన్ లాంచ్ చేసిన స్టెప్‌ఫన్!

  • Strait of Hormuz: హార్ముజ్ ట్యాంకర్ దాడిలో భారతీయ నావికుడు మరణించినందుకు ఇరాన్ దౌత్యవేత్తను MEA సమన్లు ​​చేసింది

Trending News

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd