HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Speed News
  • >6 5 Magnitude Quake Jolts Northern Philippines

Philippines: ఫిలిప్పీన్స్‌లో భూకంపం.. రిక్టర్ స్కేలుపై 6.5గా నమోదు

ఫిలిప్పీన్స్‌ (Philippines)లోని మిండోరోలో గురువారం బలమైన భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేలుపై భూకంప తీవ్రత 6.5గా నమోదైంది.

  • Author : Gopi Date : 15-06-2023 - 11:33 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Philippines
Earthquake 1 1120576 1655962963

Philippines: ఫిలిప్పీన్స్‌ (Philippines)లోని మిండోరోలో గురువారం బలమైన భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేలుపై భూకంప తీవ్రత 6.5గా నమోదైంది. అంతర్జాతీయ కాలమానం ప్రకారం గురువారం తెల్లవారుజామున 2.19 గంటలకు ప్రకంపనలు వచ్చినట్లు అమెరికన్ జియోలాజికల్ సర్వే తెలిపింది. భూకంప కేంద్రం భూమి ఉపరితలం నుంచి 124 కిలోమీటర్ల లోతులో ఉంది.

ఫిలిప్పీన్స్ లో గురువారం 6.5 తీవ్రతతో భూకంపం సంభవించిందనీ, ప్రకంపనల కార‌ణంగా నష్టం వాటిల్లే అవకాశం ఉందని స్థానిక అధికారులు హెచ్చరించారు. రాజధాని మనీలాకు 120 కిలో మీట‌ర్ల దూరంలో, 10 కిలో మీట‌ర్ల లోతులో భూకంప కేంద్రం కేంద్రీకృత‌మై ఉంద‌ని తెలిపారు. మనీలాతో సహా దేశంలోని అత్యధిక జనాభా కలిగిన ప్రాంతంలో భూప్రకంపనలు సంభవించిన తర్వాత తాను, తన సిబ్బంది బయటకు పరుగులు తీసిన‌ట్టు కలటగాన్ మున్సిపాలిటీ పోలీస్ చీఫ్ ఎమిల్ మెండోజా తెలిపారు. ప్ర‌స్తుతం సంభ‌వించిన భూకంప ప్ర‌భావం చాలా అధికంగానే ఉంద‌నీ, ప్ర‌కంప‌న‌ల స‌మ‌యంలో తాము ప‌రుగెత్తాల్సి వ‌చ్చింద‌ని మెండోజా వెల్ల‌డించారు.

Also Read: United Kingdom: యూకేలో భారత సంతతి విద్యార్థి సహా ముగ్గురు మృతి.. అసలేం జరిగింది.. పోలీసులు ఏం చెప్తున్నారు..?

భూకంపం 30 సెకన్ల నుంచి ఒక నిమిషం వరకు కొనసాగిందని కలాటగన్ విపత్తు అధికారి రోనాల్డ్ టోరెస్ తెలిపారు. భూకంపం కారణంగా రాజధాని ప్రజలు కూడా అపార్ట్‌మెంట్ల నుంచి బయటకు పరుగులు తీశారు. భూకంప ప్రభావాలను అధికారులు అంచనా వేస్తున్నట్లు పౌర రక్షణ కార్యాలయంలోని సమాచార అధికారి డియెగో మారియానో ​​తెలిపారు. అక్టోబర్ 2013లో సెంట్రల్ ఫిలిప్పీన్స్‌లోని బోహోల్ ద్వీపంలో 7.1 తీవ్రతతో భూకంపం సంభవించింది. కొండచరియలు విరిగిపడి 200 మందికి పైగా మరణించారు.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • earthquake
  • Earthquake News
  • Northern Philippines
  • philippines
  • world news

Related News

    Latest News

    • CM VIJAY: టీవీకేకు వీసీకే మద్దతు: ప్రభుత్వ ఏర్పాటుకు లైన్ క్లియర్

    • CM Vijay Thalapathy: ప్రభుత్వ ఏర్పాటుకు గ్రీన్ సిగ్నల్..!

    • Tamil Nadu Politics: విజయ్ను ముప్పుతిప్పలు పెడుతున్న VCK.. డిప్యూటీ సీఎం పదవి ఇస్తేనే

    • Roja Selvamani: మరోసారి జగన్‌ను విజయ్ ఫాలో అవుతున్నారు – రోజా

    • Rowdy Janardhana: విజయ్ బర్త్‌డే స్పెషల్.. రౌడీ జనార్ధన’ న్యూ పోస్టర్‌

    Trending News

      • Cm Thalapathy Vijay: విజయ్‌కి లైన్ క్లియర్!

      • CM VIJAY: టీవీకే ప్రభుత్వ ఏర్పాటుకు లైన్‌ క్లియర్‌

      • Breaking News: టీవీకే ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైన 118 మేజిక్ ఫిగర్ చేరిక

      • సభ్యసమాజం తలదించుకునే ఘటన.. అక్కాతమ్ముడి పెళ్లి.. ఎక్కడంటే..?

      • TVK: 107 మంది ఎమ్మెల్యేలు తో విజయ్ రాజీనామా

    HashtagU Telugu
    • Contact Us
    • About Us
    • Privacy & Cookies Notice
    Network
    • English News
    • Telugu News
    • Hindi News
    Category
    • Telangana News
    • Andhra Pradesh News
    • National News
    • South
    • Entertainment News
    • Trending News
    • Special News
    • Off Beat
    • Business News
    Trending News
    • Health Tips
    • Movie Reviews
    • 2024 Olympics
    • Life Style
    • Nara Lokesh
    • Nara Chandrababu Naidu
    • Revanth Reddy
    • kcr

    follow us

    • Copyright © 2026 Hashtag U. All rights reserved.
    • Powered by Veegam Software Pvt Ltd