Woman Stabs Daughter: మార్కుల విషయమై కత్తులతో పొడుచుకున్న తల్లీకూతుళ్లు.. కూతురు మృతి
కర్ణాటకలో బెంగళూరులోని బనశంకరికి చెందిన సాహితీకి ఇంటర్ ఫలితాల్లో తక్కువ మార్కులు వచ్చాయి. అయితే తక్కువ మార్కులు ఎందుకు వచ్చాయని తల్లి పద్మజ.. కుమార్తెతో వాగ్వాదానికి దిగింది.
- Author : Gopichand
Date : 30-04-2024 - 3:12 IST
Published By : Hashtagu Telugu Desk
Woman Stabs Daughter: ఇంటర్ ఫలితాల్లో వచ్చిన మార్కులు ఒక యువతి ప్రాణాలు తీశాయి. మార్కులు తక్కువ ఎందుకు వచ్చాయని తల్లి తన కుమార్తెను ప్రశ్నించగా ఇద్దరి మధ్య ఘర్షణకు దారితీసింది. ఈ వివాదం ఎంతవరకు వెళ్లిందంటే.. తల్లీకూతుళ్లు ఇద్దరు కత్తులతో పొడుచుకుని (Woman Stabs Daughter) ఒకరి ప్రాణాలు పోయే పరిస్థితి వరకు వచ్చింది. తాజాగా తల్లీకూతుళ్లు కత్తులతో పొడుచుకున్న ఘటన వెలుగులోకి వచ్చింది. దీనికి కారణం తల్లి తన కుమార్తెను మార్కులు ఎందుకు తక్కువ వచ్చాయని ప్రశ్నించటంతో ఘర్షణ మొదలై చివరకు ఇంటర్ యువతి మృతిచెందింది. ఈ ఘటన కర్ణాటక రాష్ట్రంలోని బెంగళూరులో చోటుచేసుకుంది.
Also Read: Keerthi Suresh : అక్కడ టాలెంట్ చూపిస్తున్న కీర్తి సురేష్.. మరి ఇంతలా రెచ్చిపోతుంది ఏంటో..?
పూర్తి వివరాల్లోకి వెళ్తే.. కర్ణాటకలో బెంగళూరులోని బనశంకరికి చెందిన సాహితీకి ఇంటర్ ఫలితాల్లో తక్కువ మార్కులు వచ్చాయి. అయితే తక్కువ మార్కులు ఎందుకు వచ్చాయని తల్లి పద్మజ.. కుమార్తెతో వాగ్వాదానికి దిగింది. తల్లి మార్కుల గురించి పదే పదే అడగటంతో క్షణికావేశంలో సాహితీ తల్లిని కత్తితో నాలుగుసార్లు పొడిచింది. దీంతో కూతురు చేసిన పనికి షాకైన తల్లి పద్మజ అదే కత్తితో కూతురిపై దాడి చేసింది. ఈ దాడిలో తీవ్రగాయాలైన సాహితీ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయింది. ఈ విషయం తెలుసుకున్న వెంటనే ఇరువురిని స్థానిక ఆస్పత్రికి తరలించారు. అప్పటికే సాహితీ మృతిచెందగా.. తల్లి పద్మజ గాయాలతో ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది. ఈ విషయం స్థానికుల ద్వారా తెలుసుకున్న పోలీసులు కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు.
కత్తులతో ఒకరినొకరు పొడుచుకున్న తల్లీకూతుళ్లు.. కూతురు మృతి
కర్ణాటకలో బెంగళూరులోని బనశంకరికి చెందిన సాహితీకి ఇంటర్ ఫలితాల్లో తక్కువ మార్కులు వచ్చాయి. అయితే తక్కువ మార్కులు ఎందుకు వచ్చాయని తల్లి పద్మజ కుమార్తెతో వాగ్వాదానికి దిగింది.
ఈ వాగ్వాదం ముదిరి కత్తులు తీసుకుని ఒకరినొకరు… pic.twitter.com/OOH4oN61tB
— Telugu Scribe (@TeluguScribe) April 30, 2024
ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు ఇద్దరు మహిళలను ఆసుపత్రికి తరలించగా, సాహితీ మృతి చెందినట్లు ప్రకటించారు. తల్లి చికిత్స పొందుతోందని ఓ స్థానిక వ్యక్తి తెలిపారు. దీనిపై పోలీసులు మాట్లాడుతూ.. ప్రాథమిక విచారణ ప్రకారం ఇద్దరు మాత్రమే ఇంట్లో నివసిస్తున్నారు. తల్లి కోలుకుని ఆమె వాంగ్మూలాన్ని నమోదు చేసిన తర్వాతే ఘటనకు గల కారణాలు తెలుస్తాయి అని పోలీసులు తెలిపారు. బనశంకరి పోలీసులు హత్య కేసు నమోదు చేసి తదుపరి దర్యాప్తు చేస్తున్నారు.
We’re now on WhatsApp : Click to Join