ప్రతిరోజూ హాయిగా నిద్రపోవాలంటే?!
ఒత్తిడి, ఆందోళన నిద్రలేమికి ప్రధాన కారణాలు. పడుకునే ముందు కొన్ని నిమిషాల పాటు ధ్యానం లేదా దీర్ఘ శ్వాస తీసుకోవడం ప్రాక్టీస్ చేయండి.
- Author : Gopichand
Date : 16-03-2026 - 6:25 IST
Published By : Hashtagu Telugu Desk
Sleep: నేటి ఉరుకుల పరుగుల జీవితంలో ఒత్తిడి (స్ట్రెస్) చాలా పెరిగిపోయింది. ప్రజలు మొబైల్‌ను ఎక్కువగా వాడటం వల్ల నిద్రలేమి సమస్యలు ఎదుర్కొంటున్నారు. మారుతున్న జీవనశైలి కారణంగా అర్థరాత్రి వరకు మేల్కొనడం, మాటిమాటికీ మొబైల్ చూడటం లేదా అనవసరంగా ఆలోచించడం వల్ల నిద్ర వచ్చే సమయానికి నిద్రలేవాల్సిన టైమ్ అయిపోతుంది. అయితే నిద్ర కోసం చాలా మంది మందులపై ఆధారపడుతున్నారు. కానీ ఎక్కువ కాలం నిద్రమాత్రలు వాడటం ఆరోగ్యానికి ప్రమాదకరం. నిపుణుల ప్రకారం.. కొన్ని సహజ పద్ధతులు, సరైన జీవనశైలిని పాటించడం ద్వారా మందులు లేకుండానే మంచి నిద్ర పొందవచ్చు. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం.
నిద్రపోయే ముందు ఈ యోగాసనాలు వేయండి
రాత్రి పడుకునే ముందు తేలికపాటి యోగా చేయడం వల్ల శరీరం, మనస్సు రెండూ ప్రశాంతంగా మారుతాయి. బాబా రామ్‌దేవ్ తరచుగా శవాసనం లేదా బాలాసనం చేయాలని సలహా ఇస్తారు. విపరీత కరణి వంటి ఆసనాలు వేయడం వల్ల శరీరంలోని ఒత్తిడి తగ్గి నిద్ర త్వరగా పడుతుంది. దీనితో పాటు 10 నిమిషాల పాటు అనులోమ-విలోమ ప్రాణాయామం, దీర్ఘ శ్వాస తీసుకోవడం వల్ల మనస్సు ప్రశాంతంగా ఉంటుంది.
ప్రతిరోజూ ఒకే సమయానికి నిద్రపోండి
మంచి నిద్ర కోసం ప్రతిరోజూ ఒకే సమయానికి పడుకోవడం, నిద్రలేవడం అలవాటు చేసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. దీనివల్ల శరీరంలోని ‘బయోలాజికల్ క్లాక్’ క్రమబద్ధీకరించబడుతుంది. శరీరం తనంతట తానుగా నిద్రకు సిద్ధమవుతుంది. నిపుణుల అభిప్రాయం ప్రకారం.. ప్రతి వ్యక్తి రోజుకు 10 గంటల నిద్ర (సాధారణంగా 7-8 గంటలు సరిపోతాయి. కానీ గాఢ నిద్ర ముఖ్యం) తప్పనిసరిగా తీసుకోవాలి.
Also Read: ఈ ఎన్నికలకు పర్పుల్ మార్కర్‌ను ఉపయోగిస్తారని మీకు తెలుసా?
పాలలో జాజికాయ కలిపి తాగండి
ఆయుర్వేదంలో జాజికాయ నిద్రకు చాలా మేలు చేస్తుందని భావిస్తారు. పడుకునే ముందు గోరువెచ్చని పాలలో చిటికెడు జాజికాయ పొడి కలుపుకుని తాగడం వల్ల శరీరం రిలాక్స్ అవుతుంది. గాఢ నిద్ర రావడానికి సహాయపడుతుంది.
పాదాల అడుగున ఆవనూనె లేదా నెయ్యితో మసాజ్
ఆయుర్వేద గృహ వైద్యం ప్రకారం.. పడుకునే ముందు పాదాల అడుగున (అరికాళ్లపై) ఆవనూనె లేదా దేశీ నెయ్యితో తేలికగా మసాజ్ చేయాలి. దీనివల్ల శరీరంలోని అలసట తగ్గి, మెదడు ప్రశాంతంగా మారి త్వరగా నిద్ర పడుతుంది.
రాత్రిపూట స్క్రీన్ టైమ్ తగ్గించండి
మొబైల్, టీవీ, ల్యాప్‌టాప్ నుండి వచ్చే నీలి కాంతి మెదడును చురుకుగా ఉంచుతుంది. దీనివల్ల నిద్ర రావడం కష్టమవుతుంది. కాబట్టి పడుకోవడానికి కనీసం 30 నిమిషాల ముందే స్క్రీన్ వాడటం ఆపివేయాలి. ఆ సమయంలో ధ్యానం చేయడం లేదా ప్రశాంతమైన సంగీతం వినడం మంచిది.
నిద్రపోయే ముందు మెడిటేషన్ చేయండి
ఒత్తిడి, ఆందోళన నిద్రలేమికి ప్రధాన కారణాలు. పడుకునే ముందు కొన్ని నిమిషాల పాటు ధ్యానం లేదా దీర్ఘ శ్వాస తీసుకోవడం ప్రాక్టీస్ చేయండి. ఇది మనస్సును శాంతపరిచి, శరీరానికి విశ్రాంతిని ఇస్తుంది.