Kiccha Sudeep: కిచ్చా సుదీప్ తో కర్ణాటక కాంగ్రెస్ చీఫ్ భేటీ
అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న కర్ణాటకలో (Karnataka) కీలక పరిణామం చోటుచేసుకుంది.
- By Maheswara Rao Nadella Published Date - 05:09 PM, Fri - 3 February 23

అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న కర్ణాటకలో కీలక పరిణామం చోటుచేసుకుంది. కన్నడ సూపర్ స్టార్ కిచ్చా సుదీప్ (Kiccha Sudeep) తో కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షుడు డీకే శివకుమార్ భేటీ అయ్యారు. ఇప్పుడు ఈ వార్త కన్నడ రాజకీయాల్లో హాట్ టాపిక్.
బెంగళూరులోని సుదీప్ ఇంటికి శివకుమార్ వెళ్లి.. భేటీ అయ్యారు. ఇందుకు సంబంధించిన ఫొటోలు వైరల్ అవుతున్నాయి. అయితే వీరిద్దరి సమావేశానికి సంబంధించిన వివరాలు ఇంకా బయటికి రాలేదు. కేవలం మర్యాదపూర్వంగానే సుదీప్ (Kiccha Sudeep) ను శివకుమార్ కలిశారని కాంగ్రెస్ వర్గాలు చెబుతున్నాయి. కాంగ్రెస్ స్టార్ క్యాంపెయినర్ గా ఉండాలని సుదీప్ ను ఆహ్వానించినట్లుగా తెలుస్తోంది.
గతంలో జేడీఎస్ తో కలిసి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసినా.. బీజేపీ దెబ్బకు 2019లో కూటమి కుప్పకూలింది. తర్వాత జరిగిన నాటకీయ పరిణామాలతో బీజేపీ అధికారాన్ని దక్కించుకుంది. ఈ నేపథ్యంలో వచ్చే ఎన్నికల్లో ఎలాగైనా ప్రభుత్వాన్నిఏర్పాటు చేయాలని కాంగ్రెస్ భావిస్తోంది.
Also Read: K. Vishwanath: ముగిసిన కె. విశ్వనాథ్ అంత్యక్రియలు, కళాతపస్వికి ఇక సెలవు!