HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > India
  • >Plstic Currency Note Release Soon

New Currency : త్వరలో ప్లాస్టిక్ కరెన్సీ నోట్లు?.. ఆర్‌బీఐ కసరత్తు వేగవంతం

  • Author : Prasad Date : 30-05-2026 - 10:10 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
New Currency
New Currency

భారత కరెన్సీ వ్యవస్థలో కీలక మార్పులకు భారతీయ రిజర్వు బ్యాంక్‌ సన్నాహాలు చేస్తున్నట్లు సమాచారం. ప్రస్తుతం వినియోగంలో ఉన్న కాగితపు నోట్ల స్థానంలో దశలవారీగా ప్లాస్టిక్ లేదా పాలిమర్ కరెన్సీ నోట్లను ప్రవేశపెట్టే అంశంపై ఆర్‌బీఐ అధ్యయనం చేస్తున్నట్లు తెలుస్తోంది. 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన కరెన్సీ నిర్వహణ ప్రణాళికల్లో భాగంగా ప్లాస్టిక్ నోట్ల అమలుపై ఆర్‌బీఐ దృష్టి సారించింది. దేశవ్యాప్తంగా ప్రయోగాత్మకంగా ఈ నోట్లను ప్రవేశపెట్టేందుకు అవసరమైన పరిస్థితులను పరిశీలిస్తున్నట్లు సమాచారం. పాలిమర్ నోట్లు సాధారణ కాగితపు నోట్లతో పోలిస్తే ఎక్కువ కాలం మన్నికగా ఉంటాయి. నీటిలో తడిసినా, పదే పదే మడతపెట్టినా లేదా ఎక్కువ కాలం వినియోగించినా సులభంగా చిరిగిపోవు. ఈ నోట్లలో అత్యాధునిక భద్రతా ఫీచర్లు, ప్రత్యేక సాంకేతికతలను అమలు చేయడం ద్వారా నకిలీ కరెన్సీ తయారీని గణనీయంగా తగ్గించే అవకాశం ఉందని నిపుణులు భావిస్తున్నారు.

పాలిమర్ నోట్లు ఎక్కువ కాలం చలామణిలో ఉండటంతో పదే పదే కొత్త నోట్ల ముద్రణ అవసరం తగ్గుతుంది. దీని వల్ల ఆర్‌బీఐ, కేంద్ర ప్రభుత్వానికి ముద్రణ వ్యయం ఆదా అయ్యే అవకాశం ఉంది. పాత నోట్లను తరచుగా మార్చాల్సిన అవసరం తగ్గడం వల్ల కరెన్సీ నిర్వహణలో పర్యావరణానికి అనుకూల ప్రయోజనాలు కూడా లభించే అవకాశం ఉంది. ప్రారంభ దశలో ప్రజల్లో ఎక్కువగా చలామణి అయ్యే చిన్న విలువ కలిగిన నోట్లను పాలిమర్ రూపంలో ప్రవేశపెట్టే అవకాశం ఉందని సమాచారం. మొదట ప్రయోగాత్మకంగా విడుదల చేస ప్రజల స్పందనను పరిశీలించిన తర్వాత తదుపరి దశల్లో ₹200, ₹500 నోట్లను కూడా ప్లాస్టిక్ కరెన్సీ రూపంలో తీసుకురావచ్చని అంచనా వేస్తున్నారు. దేశంలోని వివిధ ప్రాంతాల వాతావరణ పరిస్థితులు, ప్రజల వినియోగ విధానాలు, నోట్ల మన్నిక వంటి అంశాలపై నిపుణుల కమిటీలతో ఆర్‌బీఐ అధ్యయనం నిర్వహిస్తున్నట్లు సమాచారం. అయితే ప్లాస్టిక్ నోట్ల విడుదలపై ఇంకా అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • india
  • New currency
  • Plastic Currency
  • rbi

Related News

Four gangsters killed in encounter in Gurugram

Police Encounter: 11 ఏళ్ల బాలికపై అత్యాచారం.. హత్య కేసులో ప్రధాన నిందితుడిని పోలీసులు ఎన్‌కౌంటర్‌

పశ్చిమ బెంగాల్‌లోని బరుయిపూర్‌లో 11 ఏళ్ల బాలికపై అత్యాచారం మరియు హత్య కేసులో ప్రధాన నిందితుడైన ప్రభాస్ మోండల్, నేర జరిగిన తీరును పునర్నిర్మించేందుకు తీసుకెళ్తుండగా బుధవారం జరిగిన పోలీసు ఎన్‌కౌంటర్‌లో కాల్పుల్లో మరణించాడు. పోలీసుల వివరాల ప్రకారం, బరుయిపూర్ పోలీస్ స్టేషన్ దర్యాప్తు అధికారి మరియు ఇతర పోలీసుల బృందం నిందితుడు ప్రభాస్ మోండల్‌తో కలిసి అర్ధరాత్రి 12:45 గంటల

    Latest News

    • Vastu Tips: ఇంట్లో అరటి చెట్టు నాటితే అశుభమా..? శాస్త్రం ఏం చెబుతోంది..!!

    • Cigarette Alert: ఇప్పుడు బాక్స్‌పై కాదు, ప్రతి సిగరెట్‌పై హెచ్చరిక.. ఎక్కడంటే?

    • Harish Rao: బీజేపీతో టచ్‍లో హరీశ్ రావు : రేవంత్ రెడ్డి

    • True Love: ఒక వ్యక్తికి మీ మీద నిజంగా ప్రేమ ఉందో లేదో ఇలా తెలుసుకోవచ్చు!

    • Donald Trump: ముంచుకొస్తున్న డెడ్‌లైన్.. ఇరాన్‎కు ట్రంప్ మాస్ వార్నింగ్

    Trending News

      • Kissing Day: ఆవేశపూరితమైన ముద్దు నిమిషానికి 6.4 కేలరీల ఖర్చు చేస్తుంది

      • Kalyan Ram : సంక్రాంతి 2027కు సిద్ధమవుతున్న అనిల్ రావిపూడి.. కళ్యాణ్ రామ్ ఫస్ట్ లుక్‌ పోస్టర్ విడుదల !

    HashtagU Telugu
    • Contact Us
    • About Us
    • Privacy & Cookies Notice
    Network
    • English News
    • Telugu News
    • Hindi News
    Category
    • Telangana News
    • Andhra Pradesh News
    • National News
    • South
    • Entertainment News
    • Trending News
    • Special News
    • Off Beat
    • Business News
    Trending News
    • Health Tips
    • Movie Reviews
    • 2024 Olympics
    • Life Style
    • Nara Lokesh
    • Nara Chandrababu Naidu
    • Revanth Reddy
    • kcr

    follow us

    • Copyright © 2026 Hashtag U. All rights reserved.
    • Powered by Veegam Software Pvt Ltd