HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Andhra Pradesh
  • >Chief Minister Chandrababu Naidu Tastes Fresh Toddy

CM Chandrababu : తాజా కల్లు రుచి చూసిన ముఖ్యమంత్రి చంద్రబాబు

  • Author : Prasad Date : 02-06-2026 - 8:58 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
CM Chandrababu
CM Chandrababu

తుని నియోజ‌క‌వ‌ర్గం చామ‌వ‌రం గ్రామంలో చంద్ర‌బాబు పేద‌ల సేవ‌లో కార్య‌క్ర‌మంలో పాల్గోన్నారు.కల్లుగీత కార్మికుడు సింహాచలం ఇంటికి వెళ్లిన సీఎం చంద్ర‌బాబు ఎన్టీఆర్ భరోసా పథకం కింద పెన్షన్ అందజేశారు. కుటుంబ పరిస్థితులను స్వయంగా తెలుసుకుని, సింహాచలం కుటుంబానికి మరింత సహాయం అందించాలని అధికారులను ఆదేశించారు. సింహాచలానికి రూ.4 వేల పెన్షన్‌ను అందజేసిన సీఎం, ఇంటికే వచ్చి పెన్షన్ సక్రమంగా అందుతున్నదా లేదా అని ఆరా తీశారు. ఎలాంటి ఇబ్బందులు లేకుండా పెన్షన్ అందుతోందని సింహాచలం ముఖ్యమంత్రికి తెలిపారు. ఈ సందర్భంగా తనకు సొంతిల్లు లేదని, ఇంటికి ట్యాప్ కనెక్షన్ కూడా లేదని సింహాచలం సీఎం దృష్టికి తీసుకువచ్చారు. దీనిపై స్పందించిన చంద్రబాబు, సింహాచలానికి ఇల్లు నిర్మించి ఇవ్వడంతో పాటు తాగునీటి కనెక్షన్ కూడా కల్పించాలని అధికారులను ఆదేశించారు. కల్లు గీయడం ద్వారా నెలకు రూ.5 నుంచి రూ.6 వేల వరకు మాత్రమే ఆదాయం మిగులుతుందని, ప్రభుత్వం అందించే పెన్షన్ కుటుంబానికి ఎంతో అండగా నిలుస్తోందని సింహాచలం తెలిపారు. తన కుటుంబానికి ఉపాధి అవకాశాలు కూడా కల్పించాలని ముఖ్యమంత్రిని కోరారు. దీనిపై స్పందించిన సీఎం చంద్ర‌బాబు కుటుంబ సభ్యులకు ఉద్యోగం లేదా ఉపాధి అవకాశాలు కల్పించే అంశాన్ని పరిశీలించాలని అధికారులకు సూచించారు.

కల్లుగీత కార్మికుల సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని చంద్రబాబు పేర్కొన్నారు. కల్లుగీత కార్మికులకు సబ్సిడీపై మద్యం దుకాణాల కేటాయింపులు చేసిన విషయాన్ని గుర్తుచేశారు. వారి జీవనోపాధి మెరుగుపడేలా మరిన్ని చర్యలు తీసుకుంటామని తెలిపారు. ప‌ర్యటనలో భాగంగా కల్లు గీత విధానాన్ని ముఖ్యమంత్రి పరిశీలించారు. తాటిచెట్టు నుంచి తాజాగా తీసిన కల్లును రుచి చూసి కార్మికులతో మాట్లాడారు. అనంతరం సింహాచలం కుటుంబ సభ్యులతో ఆప్యాయంగా ముచ్చటించి, ఆయన మనవడిని ముద్దాడారు. సింహాచలం కుటుంబానికి ప్రభుత్వం అండగా ఉంటుందని హామీ ఇచ్చిన సీఎం, పేదల జీవన ప్రమాణాల మెరుగుదలే ప్రభుత్వ లక్ష్యమని స్పష్టం చేశారు.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • ap tdp
  • CM Chandrababu
  • tdp
  • toddy
  • Tuni

Related News

Another twist in the Gyaneshwari missing case.

Jnaneswari Missing: జ్ఞానేశ్వరి మిస్సింగ్ కేసులో మరో ట్విస్ట్

తుని మండలం సీహెచ్ అగ్రహారంలోని పామాయిల్ తోటలో కాపలాగా పనిచేస్తున్న సుంకర గణేశ్, భవాని దంపతుల కుమార్తె జ్ఞానేశ్వరి, జూన్ 6న అదృశ్యమైన విషయం తెలిసిందే. తల్లి వంట చేస్తున్న సమయంలో ఇంటి బయట ఆడుకుంటున్న పాప కనిపించకుండా పోయింది. కుటుంబానికి చెందిన పెంపుడు కుక్కతో కలిసి కొండ వైపు వెళ్లినట్లు ఒక గ్రామస్థుడు చూసినా, ఆ తర్వాత కుక్క మాత్రమే ఒంటరిగా తిరిగి వచ్చింది. మంగళవారం తున

    Latest News

    • Chandrababu Naidu: గోదావరి పుష్కరాలకు చంద్రబాబు కీలక ప్రకటన..

    • Jr NTR: జూనియర్ ఎన్టీఆర్ పొలిటికల్ ఎంట్రీపై క్లారిటీ ఇచ్చిన ఫ్యాన్స్

    • Weather Update: తెలుగు రాష్ట్రాల్లో నిప్పుల కొలిమి

    • Banakacherla Project: బనకచర్ల పిటిషన్‌పై తెలంగాణ అభ్యర్థనకు నిరాకరించిన సుప్రీంకోర్టు

    • CSK: 18 సంవత్సరాల ప్రస్థానానికి ముగింపు.. చెన్నై సూపర్ కింగ్స్ కు ఫ్లెమింగ్ గుడ్​బై..

    Trending News

    HashtagU Telugu
    • Contact Us
    • About Us
    • Privacy & Cookies Notice
    Network
    • English News
    • Telugu News
    • Hindi News
    Category
    • Telangana News
    • Andhra Pradesh News
    • National News
    • South
    • Entertainment News
    • Trending News
    • Special News
    • Off Beat
    • Business News
    Trending News
    • Health Tips
    • Movie Reviews
    • 2024 Olympics
    • Life Style
    • Nara Lokesh
    • Nara Chandrababu Naidu
    • Revanth Reddy
    • kcr

    follow us

    • Copyright © 2026 Hashtag U. All rights reserved.
    • Powered by Veegam Software Pvt Ltd