K. Vishwanath: ముగిసిన కె. విశ్వనాథ్ అంత్యక్రియలు, కళాతపస్వికి ఇక సెలవు!
కళా తపస్వి కె.విశ్వనాథ్ అంత్యక్రియలు ముగిశాయి. గత అర్ధరాత్రి హైదరాబాదులో (Hyderabad) కె.విశ్వనాథ్ తుదిశ్వాస విడిచిన సంగతి తెలిసిందే.
- By Maheswara Rao Nadella Published Date - 04:33 PM, Fri - 3 February 23
కళా తపస్వి కె. విశ్వనాథ్ (K. Vishwanath) అంత్యక్రియలు ముగిశాయి. గత అర్ధరాత్రి హైదరాబాదులో కె. విశ్వనాథ్ (K. Vishwanath) తుదిశ్వాస విడిచిన సంగతి తెలిసిందే. కె.విశ్వనాథ్ భౌతికకాయాన్ని ఈ మధ్యాహ్నం పంజాగుట్ట శ్మశానవాటికలో ఖననం చేశారు. కుటుంబ సభ్యులు, బంధుమిత్రులు, సినీ ప్రముఖులు తరలివచ్చారు. అంతకుముందు, ఫిలింనగర్ లోని ఆయన నివాసం నుంచి పంజాగుట్ట శ్మశాన వాటిక వరకు అంతిమయాత్ర నిర్వహించారు. తెలుగు జాతి గర్వించదగ్గ దిగ్గజ దర్శకుడు కె.విశ్వనాథ్ కు కడసారి వీడ్కోలు పలికేందుకు అభిమానులు భారీ సంఖ్యలో అంతిమయాత్రలో పాల్గొన్నారు.
Also Read: Amul Milk: పాల ధరలను మరోసారి పెంచిన అమూల్