Niharika Konidela: తన అందాలతో గేర్ మార్చిన మెగా డాటర్ నిహారిక.. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న పిక్స్..
మెగా డాటర్ నిహారిక ప్రస్తుతం సోషల్ మీడియాలో ఎంతగా హల్చల్ చేస్తోందో అందరికీ తెలిసిందే. తన పర్సనల్ లైఫ్ మీద ఎన్ని రూమర్లు వస్తున్నా స్పందించడం లేదు కానీ నెట్టింట్లో మాత్రం నిహారిక తాను చేయదల్చుకున్నది చేస్తూనే వెళ్తోంది.
- Author : Maheswara Rao Nadella
Date : 14-04-2023 - 7:30 IST
Published By : Hashtagu Telugu Desk
Niharika Konidela : మెగా డాటర్‌గా నిహారికకు బుల్లితెర, వెండితెరపై మంచి క్రేజ్ ఉంది. అయితే నిహారిక బుల్లితెరపై సక్సెస్ అయినా వెండితెరపై ఆకట్టుకోలేకపోయింది. ఓటీటీలో అయితే నిహారిక అందరినీ మెప్పించింది. నిహారిక (Niharika Konidela) తీసిన వెబ్ సిరీస్‌లు, తాను నటించిన వెబ్ సిరీస్‌లు బాగానే హిట్ అయ్యాయి. నిహారికకు సిల్వర్ స్క్రీన్ కంటే ఓటీటీ ఫ్లాట్ ఫాం ఎక్కువగా కలిసి వచ్చింది. అయితే నిహారిక ఇప్పుడు తన కొత్త ప్రాజెక్ట్‌లతో బిజీగా ఉంది. నిహారిక మీద గత కొన్ని రోజులుగా రూమర్లు వస్తోన్న సంగతి తెలిసిందే. నిహారిక తన భర్త చైతన్యకు దూరంగా ఉంటున్నట్టు కనిపిస్తోంది. చైతన్యకు సంబంధించిన ఫోటోలను డిలీట్ చేసింది. అతడ్ని అన్ ఫాలో కూడా చేసింది. మెగా ఇంట్లో మరో విడాకుల జంట అని గత కొన్ని రోజులుగా రూమర్లు వస్తూనే ఉన్నాయి. శ్రీజ కళ్యాణ్ దేవ్‌ల విడాకుల మీద ఇంకా మెగా ఫ్యామిలీ స్పందించలేదు. ఇక ఇప్పుడు నిహారిక చైతన్య విడాకుల విషయం మీదనైనా స్పందిస్తారా? లేదా? అన్నది చూడాలి. నిహారిక ఇప్పుడు తన మీద వస్తోన్న రూమర్లను పట్టించుకోకుండా.. తన పని తాను చేసుకుంటూ పోతోంది. తాజాగా ఆమె షేర్ చేసిన ఫోటోలు, డెనిమ్ వేర్‌లో కనిపించిన తీరుకు అంతా ఫిదా అవుతున్నారు.




Also Read: Lavanya Tripathi: గ్రీన్ శారీలో పిచ్చెక్కిస్తున్న లావణ్య త్రిపాఠి