HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > India
  • >Voting On Three Bills Tomorrow Evening At 4 Pm

Loksabha: రేపు సాయంత్రం 4 గంటలకు మూడు బిల్లులపై ఓటింగ్

  • Author : Vamsi Chowdary Korata Date : 16-04-2026 - 1:41 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Delimitation Bill Parliament Special Session
Delimitation Bill Parliament Special Session

దేశవ్యాప్తంగా ఎంతోకాలంగా ఎదురుచూస్తున్న మహిళా రిజర్వేషన్ బిల్లు సహా మూడు కీలక బిల్లులను కేంద్ర ప్రభుత్వం నేడు లోక్‌సభలో ప్రవేశపెట్టింది. ఈ బిల్లులపై సుదీర్ఘంగా చర్చించిన తర్వాత, రేపు ఓటింగ్ నిర్వహించనున్నట్టు పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరణ్ రిజిజు సభకు తెలియజేశారు. లోక్‌సభ ముందుకు వచ్చిన ఈ బిల్లుల ప్రాధాన్యత దృష్ట్యా, వాటిపై విస్తృత స్థాయి చర్చ జరగాలని సభ్యులు కోరడంతో చర్చా సమయాన్ని పెంచుతున్నట్టు స్పీకర్ ఓం బిర్లా ప్రకటించారు.

కేంద్ర న్యాయశాఖ మంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్ రాజ్యాంగ (131వ సవరణ) బిల్లు-2026 (మహిళా రిజర్వేషన్), డీలిమిటేషన్ బిల్లు-2026, కేంద్ర పాలిత ప్రాంతాల చట్టాల (సవరణ) బిల్లు-2026ను సభలో ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరణ్ రిజిజు మాట్లాడుతూ.. ఈ బిల్లులపై 12 గంటల పాటు చర్చ జరపాలని ప్రాథమికంగా నిర్ణయించినట్టు తెలిపారు. అయితే, దీనిపై స్పందించిన స్పీకర్ ఓం బిర్లా, చర్చను అవసరమైతే 15 నుంచి 18 గంటల వరకు పొడిగిస్తామని, సభ్యులందరికీ మాట్లాడేందుకు తగిన సమయం ఇస్తామని హామీ ఇచ్చారు. రేపు సాయంత్రం 4 గంటలకు ఓటింగ్ నిర్వహిస్తామని ఆయన స్పష్టం చేశారు.

అంతకుముందు మహిళా రిజర్వేషన్ బిల్లును ప్రవేశపెట్టే దశలోనే సభలో ఆసక్తికర పరిణామాలు చోటుచేసుకున్నాయి. ప్రతిపక్షాలు మూజువాణి ఓటింగ్‌ను వ్యతిరేకించి, డివిజన్ (రికార్డెడ్ ఓటింగ్) పద్ధతిలో ఓటింగ్ జరపాలని పట్టుబట్టాయి. సాధారణంగా సభలో మూజువాణి ఓటుతో తీర్మానాలు ఆమోదిస్తుంటారు. కానీ, ఫలితంపై వివాదం తలెత్తినప్పుడు డివిజన్ ఓటింగ్ నిర్వహిస్తారు.

ప్రతిపక్షాల డిమాండ్ మేరకు స్పీకర్ డివిజన్ ఓటింగ్‌కు ఆదేశించారు. ఓటు స్లిప్పుల ద్వారా జరిగిన ఈ ఓటింగ్‌లో బిల్లు ప్రవేశపెట్టడానికి అనుకూలంగా 251 ఓట్లు, వ్యతిరేకంగా 185 ఓట్లు పోలైనట్టు స్పీకర్ ప్రకటించారు. ఈ సంఖ్యలో మార్పులు ఉండొచ్చని కూడా ఆయన సూచించారు. అనంతరం జరిగిన మరో రౌండ్ ఓటింగ్‌లో మొత్తం 333 మంది సభ్యులు ఓటు వేయగా, ఎవరూ తటస్థంగా లేకపోవడం గమనార్హం. ఈ ప్రక్రియతో బిల్లుల పరిచయం పూర్తవగా రేపు జరగనున్న ఓటింగ్‌పై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • delimitation bill
  • lok sabha
  • Lok Sabha Voting
  • Union Law Minister Arjun Ram Meghwal
  • Union Minister Kiren Rijiju
  • Women Reservation Bill

Related News

Women’s Reservation Bill

వీగిపోయిన 131వ రాజ్యాంగ సవరణ బిల్లు.. 2029లో అమలయ్యేనా?

రాజ్యాంగ సవరణ బిల్లు ఆమోదం పొందకపోవడం మహిళా రిజర్వేషన్లపై పెద్ద ప్రభావాన్ని చూపుతుంది. ఎందుకంటే ఈ బిల్లులో పార్లమెంటు స్థానాలను 543 నుండి 850కి పెంచే నిబంధన ఉంది.

  • Delimitation Bill Cm Stalin

    Delimitation Bill : ఢిల్లీని ఓడించిన తమిళనాడు అంటూ స్టాలిన్ హర్షం

  • Delimitation Bill

    Delimitation Bill : కేంద్రానికి బిగ్ షాక్..డీలిమిటేషన్ బిల్లు వెనక్కి !

  • Hoisting a black flag to protest the Delimitation Bill

    MK Stalin: కేంద్రం డీలిమిటేషన్‌ బిల్లుకు వ్యతిరేకంగా తమిళనాడు సీఎం నిరసన

  • Kalvakuntla Kavitha Warning

    Kalvakuntla Kavitha: తెలంగాణకు అన్యాయం జరిగితే చూస్తూ ఊరుకోం: కల్వకుంట్ల కవిత

Latest News

  • మీరు చ‌క్కెర ఎక్కువ‌గా తింటున్నారా?

  • రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీకి పెరగనున్న కష్టాలు!

  • మ‌రోసారి మెటాలో ఉద్యోగాల కోత‌?!

  • లాస్ ఏంజెలెస్‌లో మహిళ అరెస్ట్.. ఇరాన్‌కు అక్రమంగా డ్రోన్ సప్లయ్.

  • కొత్త జట్టుకు యజమానిగా క్రిస్ గేల్!

Trending News

    • HBDOneAndOnlyCBN : చంద్రబాబుకు భువనేశ్వరి ఎమోషనల్ బర్త్ డే విషెస్

    • సీజ్‌ఫైర్‌పై నీలినీడలు?

    • గల్ఫ్ దేశాల్లో కొనసాగుతున్న ఉత్కంఠ.. హోర్ముజ్ జలసంధికి పొంచి ఉన్న ముప్పు!

    • ఏసీ నడపడానికి ఎంత సోలార్ సామర్థ్యం ఉండాలి?

    • Punarvika: చిన్నారి పునర్వికకు రూ.16 కోట్ల ఇంజెక్షన్‌ తెప్పించిన లోకేశ్‌

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd