Kavitha: సుప్రీంకోర్టులో కవితకు ఎదురుదెబ్బ.. బెయిల్ కోసం ట్రయల్ కోర్టుకే వెళ్లాలని సూచన
- By Latha Suma Published Date - 11:44 AM, Fri - 22 March 24

MLC Kavitha Petition : ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసు(Delhi Liquor Policy Case)లో నిందితురాలిగా ఉన్న బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత(BRS MLC Kavitha)కు సుప్రీంకోర్టు(Supreme Court)లో నిరాశ ఎదురయింది. తనపై క్రిమినల్ ప్రొసీడింగ్స్ ను క్వాష్ చేయాలని, బెయిల్ మంజూరు చేయాలని కోరుతూ కవిత దాఖలు చేసిన పిటిషన్ ను విచారించిన సుప్రీంకోర్టు ధర్మాసనం… ఆమెకు బెయిల్ మంజూరు చేయడానికి నిరాకరించింది.
BRS leader K Kavitha's arrest in liquor policy case | Supreme Court remarks that it has to follow a uniform policy for all and can't allow people to approach the top court directly for bail as they are a political person https://t.co/MXFLVu3e3x
— ANI (@ANI) March 22, 2024
పిటిషనర్ ఎవరైనా సరే తాము ఏకరీతి విధానాన్ని అనుసరిస్తామని ఈ సందర్భంగా ధర్మాసనం వ్యాఖ్యానించింది. బెయిల్ కోసం నేరుగా సుప్రీంకోర్టును ఆశ్రయించడాన్ని తాము అంగీకరించబోమని తెలిపింది. బెయిల్ కోసం ట్రయల్ కోర్టుకే వెళ్లాలని సూచించింది. ఎవరైనా సరే బెయిల్ కోసం తొలుత కింది కోర్టుకే వెళ్లాలని స్పష్టం చేసింది.
We’re now on WhatsApp. Click to Join.
తన అరెస్ట్ చట్ట విరుద్ధమంటూ రాజ్యాంగ ఉల్లంఘనలకు సంబంధించి కవిత లేవనెత్తిన అంశాలను… గతంలో విజయ్ మదన్ లాల్ కేసుకు ధర్మాసనం జత చేసింది. కేవలం రాజ్యాంగ ఉల్లంఘనలకు సంబంధించిన అంశాలపై మాత్రమే విచారణ జరుపుతామని తెలిపింది.
read also: Janata Curfew: జనతా కర్ఫ్యూకి నాలుగేళ్లు.. 2020 మార్చి 22 ఏం జరిగిందంటే..?
ఇదే విషయంపై దాఖలైన మరో పిటిషన్ తో కలిసి విచారిస్తామని సుప్రీంకోర్టు తెలిపింది. పిటిషన్ లోని అంశాలపై ఈడీకి నోటీసులు ఇస్తామన్న ధర్మాసనం… ఈడీకి నోటీసులు జారీ చేసింది. ప్రస్తుతం కేసు మెరిట్స్ లోకి వెళ్లబోమని స్పష్టం చేసింది. సుప్రీంకోర్టులో కవిత తరపున ప్రముఖ సీనియర్ న్యాయవాది, రాజకీయవేత్త కపిల్ సిబల్ వాదనలు వినిపించారు.