BJP : బీజేపీ ప్రధాన కార్యాలయాన్ని సందర్శించనున్న ప్రధాని మోడీ..!
లోక్‌సభ ఎన్నికల తర్వాత ప్రధాని పార్టీ కార్యాలయానికి వచ్చి కార్యకర్తలను ఉద్దేశించి ప్రసంగించనున్నారని ఆ పార్టీ వర్గాలు తెలిపాయి.
- By Latha Suma Published Date - 06:47 PM, Wed - 17 July 24

PM MODI : బీజేపీ ప్రధాన కార్యాలయాన్ని(BJP Headquarter) ప్రధాని నరేంద్రమోడీ రేపు (గురువారం) సాయంత్రం 7 గంటలకు సందర్శించనున్నట్లు (visiting) బీజేపీ(BJP) వర్గాలు మీడియాకు తెలిపాయి . లోక్‌సభ ఎన్నికల తర్వాత ప్రధాని పార్టీ కార్యాలయానికి వచ్చి కార్యకర్తలను ఉద్దేశించి ప్రసంగించనున్నారని ఆ పార్టీ వర్గాలు తెలిపాయి. ఈ మేరకు బుధవారం ఢిల్లీ హెడ్ ఆఫీస్ దగ్గర బీజేపీ శ్రేణులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. మోడీ రాక కోసం ఏర్పాట్లు కూడా జరుగుతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.
We’re now on WhatsApp. Click to Join.
కాగా, ప్రధాని మోడీ(pm modi) గురువారం బీజేపీ కార్యాలయానికి రావడంపై ఆసక్తిగా మారింది. కార్యకర్తలను ఉద్దేశించి ప్రసగించనున్నారని సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఈ సమావేశంలో రాబోయే ఎన్నికల గురించి కూడా శ్రేణులతో ప్రధాని చర్చించనున్నట్లు సమాచారం. త్వరలో ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఉప ఎన్నికలు జరగనున్నాయి. ఆ తర్వాత మహారాష్ట్ర, హర్యానా రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఆయా ఎన్నికలకు అనుసరించాల్సిన వ్యూహంపై కూడా ఈ సమావేశంలో బీజేపీ నేతలు చర్చించనున్నట్లు పార్టీ వర్గాలు వెల్లడించాయి.
Read Also: High Blood Pressure : రక్తపోటు సమస్యా.? ఈ డ్రై ఫ్రూట్స్ తినండి..!
ఇదిలా ఉంటే ఈనెల 22 నుంచి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు(Parliament Budget Sessions )జరగనున్నాయి. 23న కేంద్రం బడ్జెట్ కూడా ప్రవేశపెట్టనుంది. ఈ నేపథ్యంలో ప్రధాని మోడీ.. కార్యకర్తలను కలవడం ఇంట్రెస్టింగ్‌గా మారింది. కేంద్రంలో ప్రస్తుతం ఎన్డీఏ గవర్నమెంట్ నడుస్తుంది. ఈ సారి బీజేపీకి సొంతంగా మెజార్టీ రాలేదు. దీంతో ఎన్డీఏ మిత్రపక్షాల సపోర్టుతో మోడీ 3.0 ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. ఇక ఇండియా కూటమి కూడా బలంగానే ఉంది. లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ ప్రభుత్వాన్ని ధీటుగానే ఎదుర్కొంటున్నారు.
Read Also: Rashmika Mandanna : రష్మిక మందన్న ఇంట విషాదం.. బాధతో ఇన్‌స్టా పోస్ట్..