Rashmika Mandanna : రష్మిక మందన్న ఇంట విషాదం.. బాధతో ఇన్‌స్టా పోస్ట్..
రష్మిక మందన్న ఇంట విషాదం. మేము నిన్ను చాలా మిస్ అవుతాము అంటూ బాధతో ఇన్‌స్టా పోస్ట్.
- By News Desk Published Date - 06:08 PM, Wed - 17 July 24

Rashmika Mandanna : నేషనల్ క్రష్ రష్మిక మందన్న ప్రస్తుతం టాలీవుడ్ టు బాలీవుడ్ క్రేజీ ప్రాజెక్ట్స్ లో నటిస్తున్నారు. దీంతో ఒక సినిమా షూటింగ్ తరువాత మరో సినిమా షూటింగ్ లో పాల్గొంటూ బిజీ లైఫ్ ని చూస్తున్నారు. ఇక ఈ బిజీ లైఫ్ లో రష్మికకి ఒక బాధాకరమైన సంఘటన ఎదురైంది. తన పెట్ మ్యాక్సీని రష్మిక కోల్పోయింది. దీంతో ఆమె బాధతో ఇన్‌స్టా స్టోరీలో ఓ పోస్ట్ వేశారు. ప్రస్తుతం అది నెట్టింట వైరల్ గా మారింది.
రష్మిక ఇంటిలో ఉన్న మ్యాక్సీ అనే కుక్క చనిపోయిందట. దీంతో రష్మిక మ్యాక్సీతో ఉన్న ఫోటోని షేర్ చేస్తూ.. “నా చిన్ని మ్యాక్సీ ఆత్మకి శాంతి కలగాలని కోరుకుంటున్నాను. మేము నిన్ను చాలా మిస్ అవుతాము. మనం అతి త్వరలో ఒకరినొకరు కలుసుకుంటామని నేను ఆశిస్తున్నాను” అంటూ రాసుకొచ్చారు. ఇక ఇది చూసిన రష్మిక ఫ్యాన్స్.. మ్యాక్సీ ఆత్మకి శాంతి చేకూరాలని కామెంట్స్ చేస్తున్నారు.

Rashmika Mandanna
ఇక రష్మిక సినిమాలు విషయానికి వస్తే.. ప్రస్తుతం అరడజను సినిమాల్లో నటిస్తున్నారు. సౌత్ లో నాలుగు సినిమాలు చేస్తున్న రష్మిక, బాలీవుడ్ లో రెండు సినిమాలు చేస్తున్నారు. అల్లు అర్జున్ సరసన పుష్ప 2లో నటిస్తున్న సంగతి అందరికి తెలిసిందే. ఇక ధనుష్ హీరోగా తెరకెక్కుతున్న బై లింగువల్ మూవీ ‘కుబేర’లో కూడా రష్మికనే హీరోయిన్. అలాగే రెయిన్ బో, ది గర్ల్ ఫ్రెండ్ వంటి లేడీ ఓరియంటెడ్ మూవీస్ ని కూడా చేస్తున్నారు. ఇక బాలీవుడ్ విషయానికి వస్తే.. ‘సికిందర్’ సినిమాతో సల్మాన్ ఖాన్ సరసన నటించే అవకాశాన్ని దక్కించుకున్నారు. అలాగే విక్కీ కౌశల్ తో ఓ పీరియాడిక్ మూవీని చేస్తున్నారు.