India
-
Tamil Nadu : మహిళా కానిస్టేబుల్ సాహసోపేత సహాయం.. ఆటోలోనే నిండు గర్భిణికి పురుడు
అర్ధరాత్రి సమయంలో తిరుమురుగన్‌పూండి రింగ్ రోడ్డులో పోలీస్ తనిఖీలు జరుగుతున్నాయి. అదే సమయంలో ఒడిశా రాష్ట్రానికి చెందిన భారతి అనే యువతి కుటుంబ సభ్యులతో కలిసి ఆటోలో ఆసుపత్రికి బయలుదేరింది. అయితే మార్గమధ్యంలో ఆమెకు తీవ్రమైన పురిటి నొప్పులు మొదలయ్యాయి.
Published Date - 12:14 PM, Sun - 17 August 25 -
Shubhanshu Shukla : స్వదేశానికి చేరుకున్న శుభాంశు శుక్లా.. ఢిల్లీ ఎయిర్‌పోర్ట్‌లో ఘనస్వాగతం, వీడియో వైరల్
ఇది కేవలం వ్యక్తిగత ప్రయాణం కాదు. ఇది దేశం పట్ల నాకు ఉన్న ప్రేమకు, నా శిక్షణను అందించిన ప్రతీ గురువు పట్ల ఉన్న కృతజ్ఞతకు నిదర్శనం అన్నారు. అంతరిక్షంలో గడిపిన క్షణాలు మరిచిపోలేనివిగా పేర్కొంటూ, తన అనుభవాలను దేశంలోని విద్యార్థులతో, శాస్త్రవేత్తలతో, సైనికులతో పంచుకోవాలని ఆకాంక్షించారు.
Published Date - 10:57 AM, Sun - 17 August 25 -
Jammu and Kashmir : మళ్లీ మేఘ విస్ఫోటం కలకలం ..నలుగురు మృతి, సహాయ చర్యలు ముమ్మరం
మరికొంతమంది గాయపడ్డారని స్థానిక అధికారులు తెలిపారు. స్థానికంగా వర్షాలు భారీగా కురుస్తుండటంతో కొండచరియలు విరిగిపడి పలు ప్రాంతాలు తడిసి ముద్దయ్యాయి. ఘాటీ సమీపంలోని జుతానా జోడ్ ప్రాంతంలో కొండలు విరిగిపడి ఓ కుటుంబం శిథిలాల కింద చిక్కుకుపోయిందని సమాచారం. సహాయక చర్యల కోసం వెంటనే ఎస్డీఆర్ఎఫ్ బృందం సంఘటనా స్థలానికి చేరుకుంది.
Published Date - 10:42 AM, Sun - 17 August 25 -
EC : ఓటర్ల జాబితా లోపాలపై ప్రతిపక్షాల విమర్శలకు ఈసీ కౌంటర్
ఓ ప్రకటనలో ఎన్నికల సంఘం వెల్లడించిన వివరాల ప్రకారం, ఓటర్ల జాబితా తయారీ ప్రక్రియలో రాజకీయ పార్టీల భాగస్వామ్యం మొదటి దశ నుంచే ఉంటుంది. ముసాయిదా జాబితా విడుదలయ్యే సమయంలో ప్రతి పార్టీకీ సమాచారం పంపిస్తామని, వారు తమ ప్రతినిధుల ద్వారా అన్ని వివరాలు పరిశీలించే అవకాశం కల్పించబడుతుందని తెలిపింది.
Published Date - 09:53 AM, Sun - 17 August 25 -
Prices Will Drop : భారీగా తగ్గబోతున్న ఫ్రిజ్, ఏసీ, టీవీల ధరలు
Prices Will Drop : ఈ సంస్కరణల ముఖ్య ఉద్దేశ్యం సామాన్యులు వాడే నిత్యావసర వస్తువులపై పన్నులను తగ్గించడం. ప్రస్తుతం ఉన్న 12% మరియు 28% జీఎస్టీ శ్లాబ్‌లను రద్దు
Published Date - 07:31 PM, Sat - 16 August 25 -
Kishtwar : కిష్త్వార్‌లో భయానక ప్రళయం..! మూడో రోజు కూడా కొనసాగుతున్న సహాయక చర్యలు
Kishtwar : జమ్మూ కశ్మీర్‌లోని కిష్త్వార్ జిల్లాలో మేఘ విస్ఫోటనం (క్లౌడ్‌బర్స్ట్) కారణంగా ఏర్పడిన ఘోర వరదల ప్రభావం కొనసాగుతూనే ఉంది.
Published Date - 04:48 PM, Sat - 16 August 25 -
Vice President Candidate : ఉపరాష్ట్రపతి అభ్యర్థి ఎంపికకు ఎన్డీఏ సిద్ధం..ఆదివారం ఖరారు చేయనున్న మోడీ, అమిత్ షా.. !
భారతీయ జనతా పార్టీ (బీజేపీ) పార్లమెంటరీ బోర్డు సమావేశాన్ని ఆదివారం (ఆగస్టు 17) న నిర్వహించనుంది. ఈ సమావేశంలో ఉపరాష్ట్రపతి అభ్యర్థి పేరును ఖరారు చేసే అవకాశముంది. పార్టీ వర్గాల ప్రకారం, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, హోంమంత్రి అమిత్ షా ఇప్పటికే అవసరమైన చర్చలు పూర్తిచేశారని తెలుస్తోంది.
Published Date - 03:32 PM, Sat - 16 August 25 -
FASTag Annual Pass : ఫాస్టాగ్ యాన్యువల్ పాస్‌కు అద్భుత స్పందన ..తొలి రోజు లక్షల్లో వినియోగదారులు కొనుగోలు
కేవలం నిన్నటితో (ఆగస్టు 15) ప్రారంభమైన ఈ కొత్త విధానం, వినియోగదారుల్లో విశేష ఉత్సాహాన్ని రేకెత్తించింది. కేంద్ర రోడ్డు రవాణా, రహదారుల మంత్రిత్వ శాఖ వెల్లడించిన వివరాల ప్రకారం, మొదటి రోజు సాయంత్రం 7 గంటల వరకూ సుమారు 1.4 లక్షల మంది వినియోగదారులు ఈ పాస్‌ను సొంతం చేసుకున్నారు.
Published Date - 03:14 PM, Sat - 16 August 25 -
Kangana : ఆ సమయంలో వచ్చే బాధ.. ఎంపీలకూ తప్పదు.. కంగనా రనౌత్ కీలక వ్యాఖ్యలు
ప్రతి రోజు ఒక కొత్త ప్రాంతంలో ప్రయాణం. ఒక్కోసారి రోజుకు 10–12 గంటల పాటు కాంటిన్యూగా మిషన్ల మీద ఉంటాం. టాయిలెట్ వెళ్ళే అవకాశం కూడా ఉండదు. ఇలా మారిన వాతావరణంలో, ఒక మహిళగా నేను తట్టుకుంటున్న బాధను మాటల్లో చెప్పలేను అని ఆవేదన వ్యక్తం చేశారు.
Published Date - 02:08 PM, Sat - 16 August 25 -
GST : జీఎస్టీలో మార్పులు.. ధరలు తగ్గే అవకాశం ఉన్న వస్తువులు ఇవే..!
ప్రస్తుతం జీఎస్టీలో 5%, 12%, 18%, 28% అనే నాలుగు శ్లాబ్‌లు ఉన్నాయి. ఇకపై ఈ విధానాన్ని సరళతరం చేస్తూ... 5% మరియు 18% అనే రెండు ప్రధాన శ్లాబ్‌లను మాత్రమే కొనసాగించాలని కేంద్రం యోచిస్తోంది. దీని ప్రకారం, ప్రస్తుతం 12% శ్లాబ్‌లో ఉన్న వస్తువులలో సుమారు 99% వస్తువులను 5% శ్లాబ్‌లోకి మారుస్తారు. అలాగే 28% శ్లాబ్‌లో ఉన్న వస్తు-సేవల్లో సుమారు 90% శాతం వాటిని 18% శ్లాబ్‌లోకి మార్చనున్నట్లు సమాచారం.
Published Date - 01:49 PM, Sat - 16 August 25 -
Rahul Gandhi : ఇకపై ఓట్ల దొంగతనం కుదరదు..వీడియోతో కాంగ్రెస్ కొత్త ప్రచారం
తాజాగా ఈ అంశాన్ని మరింత ప్రజలకు చేరవేయడానికి రాహుల్ గాంధీ తన అధికారిక ఎక్స్ ఖాతాలో ఓ ఆసక్తికరమైన వీడియోను షేర్ చేశారు. "లాపాటా ఓటు" అనే పేరుతో రూపొందించిన ఈ వీడియో, బాలీవుడ్ సినిమాల శైలిలో రూపొందించబడింది. వీడియోలో ఓటు చోరీని చిత్రీకరించిన విధానం సామాన్య ప్రజల దృష్టిని ఆకర్షిస్తోంది.
Published Date - 01:05 PM, Sat - 16 August 25 -
Shubhanshu Shukla : స్వదేశానికి శుభాంశు శుక్లా .. ప్రధాని మోదీతో భేటీ అయ్యే అవకాశం!
ఇటీవల యాక్సియం-4 (Axiom-4) మిషన్‌లో భాగంగా అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం (ISS)కి వెళ్లిన శుభాన్షు, అక్కడ 18 రోజుల పాటు గడిపారు. ఈ ప్రయాణంలో ఆయన 60 కంటే అధిక శాస్త్రీయ ప్రయోగాల్లో పాల్గొని విశేష కృషి చేశారు. ఈ మిషన్‌లో చీఫ్ పైలట్‌గా వ్యవహరించిన శుభాన్షు, జులై 15న భూమికి క్షేమంగా తిరిగివచ్చారు.
Published Date - 12:14 PM, Sat - 16 August 25 -
Atal Bihari Vajpayee Death Anniversary : వాజ్‌పేయీ వర్ధంతి .. ప్రధాని, రాష్ట్రపతి ఘన నివాళి
అటల్ జీ పుణ్య తిథి నాడు ఆయనను స్మరించుకుంటున్నాను. భారతదేశం యొక్క సర్వతోముఖాభివృద్ధికి ఆయన అంకితభావం మరియు సేవా స్ఫూర్తి అభివృద్ధి చెందిన మరియు స్వావలంబన భారతదేశాన్ని నిర్మించడంలో ప్రతి ఒక్కరికీ స్ఫూర్తినిస్తూనే ఉన్నాయి అని పేర్కొన్నారు.
Published Date - 09:56 AM, Sat - 16 August 25 -
Atal Bihari Vajpayee’s Death Anniversary : వాజ్‌పేయి జీవితం, సాధించిన విజయాలు
Atal Bihari Vajpayee’s Death Anniversary : శనివారం ఆయన వర్ధంతి (Atal Bihari Vajpayee’s Death Anniversary) సందర్భంగా రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, ఇతర ప్రముఖులు ఢిల్లీలోని 'సాదేవ్ అటల్' స్మారక చిహ్నం వద్ద ఆయనకు నివాళులు అర్పించారు
Published Date - 09:47 AM, Sat - 16 August 25 -
GST : GST శ్లాబ్స్ 5 నుంచి 2కి తగ్గింపు?
GST : ఈ మార్పుల వల్ల సామాన్య ప్రజలు ఉపయోగించే చాలా వస్తువుల ధరలు తగ్గే అవకాశం ఉంది. అయితే, మిగిలిన 10% వస్తువులను, అనగా లగ్జరీ మరియు హానికరం అని భావించే వస్తువులను 40% స్లాబ్‌లోకి తీసుకువచ్చే అవకాశం ఉంది.
Published Date - 09:13 PM, Fri - 15 August 25 -
GST Reform: సూపర్ న్యూస్ చెప్పిన కేంద్ర ప్రభుత్వం..!
అదే విధంగా ఫెడరేషన్ ఆఫ్ సదర్ బజార్ ట్రేడ్స్ అసోసియేషన్ (FESTA) చైర్మన్ పరమ్‌జీత్ సింగ్ పమ్మా, అధ్యక్షుడు రాకేష్ యాదవ్ కూడా ఈ ప్రకటనను హర్షించారు.
Published Date - 08:29 PM, Fri - 15 August 25 -
Sudarshan Chakra : స్వదేశీ వైమానిక రక్షణ వ్యవస్థను అభివృద్ధి చేయబోతున్న భారత్
Sudarshan Chakra : ఈ ప్రాజెక్టును 'మిషన్ సుదర్శన్ చక్ర' (Sudarshan Chakra)గా పిలుస్తున్నట్లు ప్రధాని నరేంద్ర మోదీ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ప్రకటించారు.
Published Date - 05:16 PM, Fri - 15 August 25 -
FASTag annual pass : అమల్లోకి ఫాస్టాగ్ వార్షిక పాస్.. ఎలా యాక్టివేట్ చేసుకోవాలంటే?
ఇది జాతీయ రహదారులపై ప్రయాణించే కార్లు, జీపులు, వ్యాన్ల వంటివాటి యజమానులకు వర్తించనుంది. వాణిజ్య వాహనాలకు ఇది వర్తించదు. ఈ కొత్త పాస్ ద్వారా వాహనదారులు ఏటా 200 ట్రిప్పులు లేదా ఒక సంవత్సరం వరకు (ఏది ముందైతే అది) టోల్‌చార్జీల వరించకుండా ప్రయాణించవచ్చు. ప్రయాణ పరిమితి పూర్తైన తర్వాత, మళ్లీ రూ.3 వేల చెల్లించి పాస్‌ను తిరిగి యాక్టివేట్ చేసుకోవచ్చు.
Published Date - 02:49 PM, Fri - 15 August 25 -
Congress : ఎర్రకోట వేడుకలకు ఖర్గే, రాహుల్ దూరం..సీటుపై నెలకొన్న వివాదమే కారణమా?..!
తాజా సమాచారం మేరకు, ఈ వార్షిక వేడుకలకు రాహుల్, ఖర్గే దూరంగా ఉండటానికి ప్రధాన కారణంగా గతేడాది జరిగిన "సీటు వివాదం" ఉన్నట్లు వర్గాలు భావిస్తున్నాయి. అధికారికంగా కాంగ్రెస్ పార్టీ ఈ మేరకు ఎలాంటి ప్రకటన విడుదల చేయకపోయినా, రాజకీయ విశ్లేషకులు మాత్రం ఇది ఉద్దేశపూర్వక నిర్ణయమేనని అభిప్రాయపడుతున్నారు.
Published Date - 01:03 PM, Fri - 15 August 25 -
PM Modi : సామాన్యులకు దీపావళి కానుక.. తగ్గనున్న జీఎస్టీ రేట్లు: ప్రధాని మోడీ
ముఖ్యంగా సామాన్య ప్రజలకు రిలీఫ్ ఇవ్వడమే లక్ష్యంగా, నిత్యవసర వస్తువులపై వస్తు మరియు సేవల పన్ను (జీఎస్టీ)లో భారీ కోతను తీసుకురాబోతున్నట్లు తెలిపారు. ఈ దీపావళి మీకో ప్రత్యేకమైనది కానుంది. మీరు ఒక్కటి కాదు, రెండు దీపావళులు జరుపుకుంటారు. ఎందుకంటే సామాన్యులపై ఉన్న పన్ను భారం తగ్గించేందుకు మేం గట్టి చర్యలు తీసుకుంటున్నాం. ముఖ్యంగా సాధారణ గృహాల్లో వాడే వస్తువులపై జీఎస్టీ తగ
Published Date - 11:48 AM, Fri - 15 August 25