HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > India
  • >2025 Stampede Incidents In India

2025 Stampede incidents In India: తొక్కిసలాట ఘటనల్లో 114 మంది ప్రాణాలు

2025 Stampede incidents In India: దేశవ్యాప్తంగా తొక్కిసలాట ఘటనలు (Stampede Incidents) ఆందోళనకర స్థాయిలో కొనసాగుతున్నాయి. ప్రజా కార్యక్రమాలు, పండుగలు, మత యాత్రలు, రాజకీయ సభలు వంటి సందర్భాల్లో ప్రజల అధిక సంఖ్యలో

  • Author : Sudheer Date : 02-11-2025 - 12:30 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Stampede Incidents Kashibug
Stampede Incidents Kashibug

దేశవ్యాప్తంగా తొక్కిసలాట ఘటనలు (Stampede Incidents) ఆందోళనకర స్థాయిలో కొనసాగుతున్నాయి. ప్రజా కార్యక్రమాలు, పండుగలు, మత యాత్రలు, రాజకీయ సభలు వంటి సందర్భాల్లో ప్రజల అధిక సంఖ్యలో తరలివచ్చి నియంత్రణ తప్పడం వల్ల ప్రాణ నష్టం చోటుచేసుకుంటోంది. ఈ సంవత్సరం ఇప్పటివరకు దేశంలో జరిగిన తొక్కిసలాట ఘటనల్లో కనీసం 114 మంది ప్రాణాలు కోల్పోయారు. తాజాగా ఆంధ్రప్రదేశ్‌లోని శ్రీకాకుళం జిల్లా కాశీబుగ్గ వెంకటేశ్వర స్వామి ఆలయంలో తొక్కిసలాట ఘటనలో తొమ్మిది మంది మృతి చెందడంతో ఈ సమస్య మరలా దేశవ్యాప్తంగా చర్చకు దారితీసింది. ఈ ఘటన ప్రజా భద్రత, జన నియంత్రణ వ్యవస్థల్లో ఉన్న లోపాలను మరోసారి వెలుగులోకి తెచ్చింది.

‎Fenugreek Water: ప్రతీ రోజు మెంతుల నీరు తాగుతున్నారా.. అయితే ఇది మీకోసమే!

ఇటీవలి సంవత్సరాల్లో ఇది రెండో అత్యధిక ప్రాణనష్టం నమోదైన సంవత్సరం కావడం గమనార్హం. 2024లో తొక్కిసలాటల వల్ల 123 మంది మరణించారు, అందులో ఎక్కువగా ఉత్తరప్రదేశ్‌లోని హత్రాస్‌లో జరిగిన నారాయణ్ సకార్ హరి సత్సంగ్ విషాదంలోనే 116 మంది ప్రాణాలు కోల్పోయారు. ప్రస్తుత సంవత్సరం (2025)లో కాశీబుగ్గ ఘటనతో కలిపి ఆరు ప్రధాన తొక్కిసలాటలు చోటుచేసుకున్నాయి. జనవరి 29న మహాకుంభ్‌లో 30 మంది, ఫిబ్రవరి 15న న్యూఢిల్లీ రైల్వే స్టేషన్‌లో 18 మంది, ఉత్తర గోవా షిర్గావ్ జాతరలో 7 మంది, జూన్ 4న బెంగళూరులో ఆర్సీబీ విజయోత్సవ సంబరాల్లో 11 మంది, అలాగే తమిళనాడులో విజయ్ స్థాపించిన టీవీకే పార్టీ ర్యాలీలో 39 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ గణాంకాలు దేశంలో తొక్కిసలాట ఘటనల తీవ్రతను స్పష్టంగా చూపుతున్నాయి.

నిపుణుల విశ్లేషణ ప్రకారం, ఈ ఘటనలు జరగడానికి ప్రధాన కారణం జన నియంత్రణలో లోపం, అధికారుల నిర్లక్ష్యం, తగిన ఎమర్జెన్సీ వ్యవస్థలు లేకపోవడం అని చెబుతున్నారు. అనేక సందర్భాల్లో అధికారులు ప్రజల సంఖ్యను తక్కువగా అంచనా వేయడం వల్ల ఏర్పాట్లు తగిన విధంగా ఉండవు. ఫలితంగా గందరగోళం, తోపులాట, తొక్కిసలాటలు తప్పవు. భద్రతా సిబ్బంది తగిన శిక్షణ లేకపోవడం, ప్రవేశం-నిష్క్రమణ మార్గాలు సరిగా ఉండకపోవడం కూడా ప్రమాదాలకు కారణమవుతున్నాయి. ఈ తరహా విషాదాలు పునరావృతం కాకుండా ఉండాలంటే ప్రభుత్వాలు ప్రజా సమూహ నిర్వహణపై ప్రత్యేక నిబంధనలు, అత్యవసర ప్రతిస్పందన బృందాల ఏర్పాటు, సాంకేతిక పర్యవేక్షణ వ్యవస్థలు అమలు చేయడం అత్యవసరమని నిపుణులు సూచిస్తున్నారు.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • 2025 Stampede incidents
  • india
  • Kasibugga
  • Venkateswara Swamy Temple

Related News

Donald Trump

ట్రంప్ నువ్వు మారవా ? మళ్లీ అదే మాట!

భారత్, PAK మధ్య అణు యుద్ధం జరగకుండా ఆపినట్లు US అధ్యక్షుడు ట్రంప్ మరోసారి ప్రకటించుకున్నారు. దీంతో 10మిలియన్ల కంటే ఎక్కువ మంది ప్రజలను కాపాడినట్లు పాక్ PM చెప్పినట్లు వివరించారు

  • India

    సౌతాఫ్రికాను చిత్తు చేసి టీ20 సిరీస్‌ను కైవ‌సం చేసుకున్న భార‌త్‌!

  • Ishan Kishan

    టీమిండియాకు ఎంపిక కాక‌పోవ‌టంపై ఇషాన్ కిష‌న్ కీల‌క వ్యాఖ్య‌లు!

  • Pakistan extends ban on Indian flights

    భారత విమానాలపై నిషేధాన్ని పొడిగించిన పాకిస్తాన్

Latest News

  • మహిళా డొమెస్టిక్ క్రికెటర్లకు భారీగా పెరిగిన ఫీజులు!

  • మెగాస్టార్ స్టైలిష్ లుక్‌.. ఆకట్టుకుంటున్న కొత్త పోస్టర్!

  • ఏప్రిల్ 1 నుండి మీ ఫోన్, సోషల్ మీడియాపై నిఘా? వైరల్ వార్తలో నిజమెంత?

  • అమెజాన్ సంచలన నిర్ణయం.. ఉత్తర కొరియా దరఖాస్తుదారులపై నిషేధం!

  • శీతాకాలంలో జుట్టు ఎందుకు రాలుతుంది?

Trending News

    • ఏపీలో సమగ్ర కుటుంబ సర్వే.. తల్లికి వందనం, ఇతర పథకాలపై ప్రభావం?!

    • సూర్యకుమార్ యాదవ్ తర్వాత భార‌త్ తదుపరి కెప్టెన్ ఎవరు?

    • భారీగా పెరిగిన బంగారం, వెండి ధరలు.. తులం ఎంతంటే?

    • ఢిల్లీ క్యాపిటల్స్ కొత్త కెప్టెన్‌గా కేఎల్ రాహుల్? అక్షర్ పటేల్‌పై వేటు!

    • విజయ్ హజారే ట్రోఫీ.. 15 ఏళ్ల తర్వాత కోహ్లీ, ఏడేళ్ల త‌ర్వాత రోహిత్‌!

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2025 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd