Isro : మరో భారీ ప్రయోగానికి ఇస్రో సిద్ధం
Isro : భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో (ISRO) మరో కీలక అడుగు వేయడానికి సిద్ధమవుతోంది. రేపు సాయంత్రం 5.26 గంటలకు, సుమారు 4,410 కిలోల బరువుతో ఉన్న CMS-03 (GSAT-7R) కమ్యూనికేషన్ ఉపగ్రహాన్ని
- By Sudheer Published Date - 10:22 AM, Sat - 1 November 25
భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో (ISRO) మరో కీలక అడుగు వేయడానికి సిద్ధమవుతోంది. రేపు సాయంత్రం 5.26 గంటలకు, సుమారు 4,410 కిలోల బరువుతో ఉన్న CMS-03 (GSAT-7R) కమ్యూనికేషన్ ఉపగ్రహాన్ని బాహుబలి రాకెట్ LVM3-M5 ద్వారా అంతరిక్షంలోకి ప్రవేశపెట్టనున్నారు. ఈ ప్రక్షేపణ శ్రీహరికోటలోని రెండో లాంచ్ ప్యాడ్ నుంచి జరగనుంది. ఇప్పటికే అన్ని సన్నాహాలు పూర్తి కాగా, కౌంట్‌డౌన్ ఇవాళ సాయంత్రం 5.26 గంటలకు ప్రారంభమవుతుంది. ఈ ప్రయోగం ద్వారా ఇస్రో మరోసారి భారత అంతరిక్ష సామర్థ్యాన్ని ప్రపంచానికి చాటబోతోంది.
Radish Side Effects: ముల్లంగి ఆరోగ్యానికి మంచిదే కానీ.. వీరు తింటే మాత్రం అదే ఆఖరి రోజు!
CMS-03 (GSAT-7R) ఉపగ్రహం భారత నౌకాదళం (Indian Navy) అవసరాల కోసం ప్రత్యేకంగా రూపకల్పన చేయబడింది. సముద్ర ప్రాంతాల్లో నౌకల మధ్య సురక్షితమైన కమ్యూనికేషన్ సదుపాయాలను అందించడం దీని ప్రధాన ఉద్దేశం. ఈ ఉపగ్రహం ద్వారా నేవీకి ఆధునిక డేటా ట్రాన్స్‌మిషన్, నావిగేషన్, సిగ్నల్ ఇంటెలిజెన్స్ వంటి సౌకర్యాలు లభించనున్నాయి. ఇది సముద్ర భద్రత, తీర రక్షణ, ఆపరేషనల్ కమాండ్ కంట్రోల్‌లో కీలక పాత్ర పోషించనుంది. GSAT-7R ప్రాజెక్ట్ ద్వారా భారత్ నావల్ కమ్యూనికేషన్ రంగంలో మరింత స్వావలంబన సాధించబోతోంది.
ఈ ప్రయోగానికి ముందు, ఇస్రో చైర్మన్ శ్రి నారాయణన్ తిరుమల శ్రీవారిని దర్శించుకోవడం విశేషం. దేశానికి శుభఫలితాలు కలగాలని, ప్రయోగం విజయవంతం కావాలని ఆయన ప్రార్థించినట్లు సమాచారం. ప్రతి కీలక మిషన్ ముందు ఇస్రో శాస్త్రవేత్తలు దేవస్థానాలను సందర్శించడం ఒక సంప్రదాయంగా మారింది. ఈసారి కూడా అదే విశ్వాసంతో బాహుబలి రాకెట్ ప్రయోగం విజయవంతం కావాలని దేశం మొత్తం ఎదురుచూస్తోంది. రేపటి ఈ ప్రయోగం విజయవంతమైతే, భారత నావికాదళం సాంకేతిక సామర్థ్యంలో మరో దశ ముందుకు సాగినట్టవుతుంది.