Gold : మావోయిస్టు డంపుల్లో పెద్ద ఎత్తున గోల్డ్?
Gold : దేశవ్యాప్తంగా మావోయిస్టులు లొంగిపోతున్న నేపథ్యంలో, వారు గతంలో సేకరించిన పార్టీ ఫండ్ పై ఇప్పుడు నిఘా సంస్థలు దృష్టి సారించాయి.
- By Sudheer Published Date - 11:30 AM, Fri - 31 October 25
 
                        దేశవ్యాప్తంగా మావోయిస్టులు లొంగిపోతున్న నేపథ్యంలో, వారు గతంలో సేకరించిన పార్టీ ఫండ్ పై ఇప్పుడు నిఘా సంస్థలు దృష్టి సారించాయి. కేంద్ర దర్యాప్తు సంస్థ NIA (నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ) మావోయిస్టుల ఆర్థిక వ్యవస్థపై కీలక సమాచారం సేకరించినట్లు తెలుస్తోంది. మావోయిస్టులు గ్రామీణ ప్రాంతాల్లో భయాందోళన సృష్టించి, వ్యాపారులు, కాంట్రాక్టర్లు, గనుల యజమానుల వద్ద నుండి విస్తృత స్థాయిలో డబ్బు వసూలు చేసినట్లు దర్యాప్తులో తేలింది. ఆ నిధులు కేవలం నలుగురి చేతుల్లోనే కాకుండా, ఒక సిస్టమాటిక్ నెట్‌వర్క్ ద్వారా దేశంలోని వివిధ ప్రాంతాలకు పంపబడినట్లు NIA గుర్తించింది. ముఖ్యంగా చత్తీస్‌గఢ్, ఒడిశా, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర రాష్ట్రాల్లో ఈ ఫండ్ సేకరణ వ్యవస్థ బలంగా ఉన్నట్లు అధికారులు వెల్లడించారు.
Nirmala Sitharaman: కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌కు తప్పిన ప్రమాదం..!
దర్యాప్తులో మరో ఆసక్తికర అంశం బయటపడింది. కొవిడ్ కాలంలో మావోయిస్టులు తమ పార్టీ ఫండును బంగారంగా మార్చారని సమాచారం. నగదు ప్రవాహం ఆగిపోవడంతో, పెద్ద మొత్తంలో ఉన్న పార్టీ డబ్బును గోల్డ్‌గా మార్చేందుకు నక్సల్స్ మధ్యవర్తుల సహాయం తీసుకున్నారని NIA పేర్కొంది. ఈ బంగారం హైదరాబాదు, నాగపూర్, రాయపూర్, విశాఖపట్నం వంటి నగరాల్లోని జ్యువెలర్ల ద్వారా కొనుగోలు చేయబడిందని అనుమానిస్తున్నారు. ఆ బంగారం కొంత భాగం సానుభూతిపరుల పేర్లతో “డొల్ల కంపెనీల” రూపంలో నిల్వ చేయబడిందని కూడా విచారణలో బయటపడింది. ఈ కంపెనీల ద్వారా డబ్బును లీగల్ ట్రాన్సాక్షన్‌ల రూపంలో మళ్లించే ప్రయత్నాలు కూడా గుర్తించబడ్డాయి.
ప్రస్తుతం NIA అంచనా ప్రకారం..మావోయిస్టుల వద్ద సుమారు రూ.400 కోట్లు, 400 కిలోల బంగారం ఉండొచ్చని భావిస్తోంది. ఈ ఆస్తులు దేశంలోని పలు నగరాల్లోని మాధ్యముల ద్వారా, ట్రస్టుల పేర్లతో దాచబడ్డాయని అనుమానాలు ఉన్నాయి. లొంగిపోతున్న మావోయిస్టుల ద్వారా ఈ ఆర్థిక వ్యవస్థపై మరిన్ని వివరాలు తెలుసుకోవాలని నిఘా సంస్థలు ప్రయత్నిస్తున్నాయి. భవిష్యత్తులో ఈ నిధులు తిరిగి అండర్‌గ్రౌండ్ నెట్వర్క్‌లకు వెళ్లకుండా అడ్డుకోవడమే ప్రస్తుతం కేంద్ర ఏజెన్సీల ప్రధాన లక్ష్యంగా ఉంది. కేంద్ర ప్రభుత్వం కూడా ఈ అంశంపై కఠిన చర్యలు తీసుకోవాలని యోచిస్తోంది. దీంతో మావోయిస్టుల ఆర్థిక నెట్‌వర్క్ కూలిపోవడం, వారి ప్రభావం మరింత తగ్గిపోవడం ఖాయమని నిఘా వర్గాలు విశ్లేషిస్తున్నాయి.
 
                    



