Good News to Farmers : రైతులకు కేంద్రం శుభవార్త
Good News to Farmers : దేశంలోని రైతులకు కేంద్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. వ్యవసాయ ప్రాధాన్యతను దృష్టిలో ఉంచుకొని, ఫెర్టిలైజర్ సబ్సిడీకి కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపిందని సమాచారం
- By Sudheer Published Date - 04:14 PM, Tue - 28 October 25
దేశంలోని రైతులకు కేంద్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. వ్యవసాయ ప్రాధాన్యతను దృష్టిలో ఉంచుకొని, ఫెర్టిలైజర్ సబ్సిడీకి కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపిందని సమాచారం. ప్రధాని నేతృత్వంలో జరిగిన కేబినెట్ సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు అధికారులు వెల్లడించారు. ఈ సబ్సిడీ ద్వారా రైతులకు సుమారు రూ. 3 వేల కోట్ల మేర ఆర్థిక లబ్ధి చేకూరనుంది. ఎరువుల ధరల పెరుగుదల కారణంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్న రైతులకు ఇది ఊరటనిచ్చే చర్యగా భావిస్తున్నారు.
Electricity Problems : ఏపీలో విద్యుత్ సమస్యలకు చెక్ పెట్టిన ప్రభుత్వం..ఎలా అంటే !!
ప్రస్తుత ఖరీఫ్ సీజన్‌లో ఎరువుల వినియోగం గణనీయంగా పెరిగిన నేపథ్యంలో, కేంద్రం తీసుకున్న ఈ నిర్ణయం రైతుల భారం తగ్గించనుంది. మార్కెట్లో ఎరువుల ధరలు పెరిగి ఉత్పత్తి వ్యయాలు అధికమవుతున్న నేపథ్యంలో సబ్సిడీ మద్దతు చాలా అవసరమైంది. కేంద్ర ప్రభుత్వం ఈ సబ్సిడీలను యూరియా, కాంప్లెక్స్ ఫెర్టిలైజర్లు, డి.ఏ.పి (డైఅమోనియం ఫాస్ఫేట్) వంటి కీలక ఎరువులపై అమలు చేయనుంది. దీంతో, రైతులు తక్కువ ధరలకే ఎరువులు పొందగలుగుతారు.
ఇక ఈ నిర్ణయంతో పాటు ఇతర కొన్ని సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాల పైన కూడా చర్చలు జరిపిందని సమాచారం. మధ్యాహ్నం 3 గంటలకు అధికారిక ప్రకటన ద్వారా ఈ వివరాలు వెల్లడించనున్నారు. నిపుణులు చెబుతున్నట్టుగా, ఫెర్టిలైజర్ సబ్సిడీపై కేంద్రం తీసుకున్న ఈ నిర్ణయం వ్యవసాయ ఆర్థిక వ్యవస్థకు గట్టి బలాన్నిస్తుందని పేర్కొన్నారు. ఇది రైతుల ఉత్పత్తి వ్యయ తగ్గింపుకు తోడ్పడటమే కాకుండా, పంట దిగుబడులు కూడా పెరిగే అవకాశాలు ఉన్నాయని విశ్లేషకులు అభిప్రాయపడ్డారు.