Delhi Blast: ఢిల్లీ రెడ్ ఫోర్ట్ పేలుడు కేసులో కీలక విషయాలు వెల్లడి!
వర్గాల ద్వారా తెలిసిన సమాచారం ప్రకారం.. అదుపులోకి తీసుకున్న ఈ ముగ్గురు అనుమానితులను ఢిల్లీకి తరలించారు. అక్కడ వారిని ప్రశ్నిస్తున్నారు.
- By Gopichand Published Date - 05:26 PM, Tue - 18 November 25
Delhi Blast: ఢిల్లీలోని ఎర్రకోట సమీపంలోని మెట్రో స్టేషన్ వద్ద జరిగిన పేలుడు (Delhi Blast) కేసు దర్యాప్తులో నేడు ఒక కీలక విషయం బయటపడింది. ‘జైష్-ఏ-మహ్మద్’ ఉగ్రవాద సంస్థను నడుపుతున్న ‘అబూ ఉకాసా’ అనే వ్యక్తి ఉగ్రవాది ఉమర్ ఉన్ నబీని తీవ్రంగా మత ఛాందసవాదిగా మార్చినట్లు సమాచారం అందింది. ఈ కేసులో ఉగ్రవాది ఉమర్ ఉన్ నబీ 2022లో టర్కీ వెళ్ళాడు. అక్కడే అతనికి అబూ ఉకాసా పరిచయమయ్యాడు. ఉగ్రవాద సంస్థ జైష్-ఏ-మహ్మద్ ఈ దాడికి పాకిస్తాన్‌తో సంబంధం ఉందని తెలియకూడదని కోరుకుంది. అందుకే వారు టర్కీ నుంచే ఈ ఆపరేషన్‌ను నిర్వహిస్తున్నట్లుగా తెలుస్తోంది.
‘కశ్మీర్ ముస్లింల కంటే గొప్ప ముస్లింలు లేరు’
వర్గాల సమాచారం ప్రకారం.. ఉమర్ ఉన్ నబీని ఉకాసా ఎంతగానో మత ఛాందసవాదిగా మార్చాడంటే “కశ్మీర్ ముస్లింలు తప్ప వేరే ముస్లింలు ఎవరూ మంచివారు కారు. దేశంలోని ముస్లిమేతరులు, మిగతా ముస్లింలందరినీ అంతం చేయాలి” అని అతను చెప్పేవాడు. ఉమర్ ఇంకా ఇలా కూడా చెప్పేవాడు. “పాకిస్తాన్ లాంటి దేశం మరొకటి లేదు. అందరూ పాకిస్తాన్‌కు వెళ్లాలి. ప్రపంచంలో ముస్లింలను గౌరవించేది కేవలం పాకిస్తాన్‌లోనే.. అందుకే ప్రపంచంలో పాకిస్తాన్ తప్ప మిగతా దేశాలన్నీ మంచివి కావు” అని పేర్కొంది.
Also Read: Vegetarian Snacks: అద్భుతమైన ప్రోటీన్‌ను అందించే 5 శాఖాహార ఆహారాలివే!
ఢిల్లీ పేలుడు కేసు దర్యాప్తు ముంబైకి
తాజా సమాచారం ప్రకారం.. ఢిల్లీ పేలుడు కేసు దర్యాప్తు దేశ ఆర్థిక రాజధాని అయిన ముంబై వరకు విస్తరించింది. ముంబై పోలీసుల సహాయంతో ముగ్గురు అనుమానితులను ఒక రహస్య ఆపరేషన్ ద్వారా అదుపులోకి తీసుకుని దర్యాప్తును ముందుకు తీసుకువెళుతున్నారు. సోషల్ మీడియా ద్వారా ఈ కేసులో నిందితులతో సంబంధాలు పెట్టుకున్న వ్యక్తులను అదుపులోకి తీసుకుంటున్నారు. ముంబైలోని మూడు వేర్వేరు ప్రాంతాల నుంచి ముగ్గురు వ్యక్తులను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.
వర్గాల ద్వారా తెలిసిన సమాచారం ప్రకారం.. అదుపులోకి తీసుకున్న ఈ ముగ్గురు అనుమానితులను ఢిల్లీకి తరలించారు. అక్కడ వారిని ప్రశ్నిస్తున్నారు. ఈ ముగ్గురూ ఉన్నత విద్యను అభ్యసించినవారని, మంచి కుటుంబాలకు చెందినవారని తెలుస్తోంది. ఈ ముగ్గురు అనుమానితులు ఏదో ఒక అప్లికేషన్ ద్వారా నిందితులతో సంప్రదింపులు జరిపారు. ఇలాంటి చర్యలు రాష్ట్రంలోని ఇతర జిల్లాల్లోనూ కొనసాగుతున్నట్లు సమాచారం.