ఆర్సీబీ ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్!
అనేక మ్యాచ్‌ల ఆతిథ్యం దూరం తొక్కిసలాట తర్వాత కర్ణాటక ప్రభుత్వం చిన్నస్వామి స్టేడియంలో మ్యాచ్‌ల నిర్వహణపై నిషేధం విధించడంతో భారత క్రికెట్ బోర్డు (BCCI) మహిళల వన్డే ప్రపంచకప్ ఆతిథ్య హక్కులను బెంగళూరు నుండి వెనక్కి తీసుకుంది.
- Author : Gopichand
Date : 17-01-2026 - 9:18 IST
Published By : Hashtagu Telugu Desk
Chinnaswamy Stadium: చిన్నస్వామి స్టేడియంలో ఐపీఎల్, అంతర్జాతీయ మ్యాచ్‌లను నిర్వహించుకోవడానికి ప్రభుత్వం నుండి అనుమతి లభించిందని జనవరి 17న కర్ణాటక రాష్ట్ర క్రికెట్ అసోసియేషన్ (KSCA) ప్రకటించింది. ఐపీఎల్ 2026 టైటిల్‌ను ఆర్సీబీ (RCB) గెలుచుకుంది. ఆ తర్వాత బెంగళూరులో భారీ విజయోత్సవ వేడుకలు జరపాలని జట్టు నిర్ణయించింది. అయితే ఈ వేడుకల సమయంలో జరిగిన తొక్కిసలాటలో పలువురు అభిమానులు మృతి చెందారు. ఈ విషాద ఘటన తర్వాత చిన్నస్వామి స్టేడియంలో మ్యాచ్‌ల నిర్వహణపై ప్రభుత్వం నిషేధం విధించింది. కానీ ఇప్పుడు కొన్ని షరతులతో మళ్లీ ఐపీఎల్, అంతర్జాతీయ మ్యాచ్‌లను నిర్వహించుకోవచ్చని ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
KSCA ప్రకటన విడుదల KSCA ఒక ప్రకటన విడుదల చేస్తూ.. “అన్ని షరతులను నెరవేరుస్తామన్న పూర్తి నమ్మకం KSCA (కర్ణాటక స్టేట్ క్రికెట్ అసోసియేషన్)కి ఉంది. నిబంధనలను ఎలా పాటిస్తామో ఇప్పటికే నిపుణుల కమిటీకి వివరించాము. భద్రత, జాగ్రత్తలు, గుంపును నియంత్రించే అన్ని నిబంధనలను పూర్తి స్థాయిలో, కఠినంగా అమలు చేయడానికి అసోసియేషన్ సిద్ధంగా ఉంది” అని పేర్కొంది.
Also Read: చరిత్ర సృష్టించనున్న టీమిండియా కెప్టెన్, వైస్ కెప్టెన్!
గత జూన్‌లో జరిగిన తొక్కిసలాటలో 11 మంది ప్రాణాలు కోల్పోగా, మరో 50 మంది గాయపడ్డారు. ఆ ఘటన తర్వాత ఎం చిన్నస్వామి స్టేడియంలో ఇప్పటివరకు ఒక్క మ్యాచ్ కూడా జరగలేదు. ఐపీఎల్ 2026 టైటిల్ వేడుకలు నిర్వహించడం ఆర్సీబీకి తీరని లోటును మిగిల్చింది. అయితే ఇప్పుడు కర్ణాటక ప్రభుత్వం నుండి అసోసియేషన్‌కు పచ్చజెండా లభించింది.
అనేక మ్యాచ్‌ల ఆతిథ్యం దూరం తొక్కిసలాట తర్వాత కర్ణాటక ప్రభుత్వం చిన్నస్వామి స్టేడియంలో మ్యాచ్‌ల నిర్వహణపై నిషేధం విధించడంతో భారత క్రికెట్ బోర్డు (BCCI) మహిళల వన్డే ప్రపంచకప్ ఆతిథ్య హక్కులను బెంగళూరు నుండి వెనక్కి తీసుకుంది. ఆ మ్యాచ్‌లను నవీ ముంబైలోని డివై పాటిల్ స్టేడియానికి మార్చారు. అంతేకాకుండా ఫిబ్రవరి, మార్చి 2026లో జరగనున్న పురుషుల టీ20 ప్రపంచకప్‌లో కూడా బెంగళూరుకు ఏ ఒక్క మ్యాచ్ ఆతిథ్య ఇచ్చే అవకాశం దక్కలేదు. అయితే ఇప్పుడు స్టేడియం పునఃప్రారంభం కానుండటం అభిమానులకు శుభవార్తగా మారింది.