తనపై తనే కోప్పడ్డ కోహ్లీ.. వీడియో వైరల్!
ఈ మూడో వన్డేలో టీమ్ ఇండియా ఆరంభం అద్భుతంగా ఉంది. మ్యాచ్ మొదటి ఓవర్‌లోనే అర్ష్‌దీప్ సింగ్ హెన్రీ నికోల్స్‌ను డకౌట్ చేయగా రెండో ఓవర్‌లో హర్షిత్ రాణా డెవాన్ కాన్వేను పెవిలియన్‌కు పంపాడు.
- Author : Gopichand
Date : 18-01-2026 - 4:26 IST
Published By : Hashtagu Telugu Desk
Virat Kohli: విరాట్ కోహ్లీ మైదానంలో ఉన్నారంటే జట్టు కోసం తనను తాను పూర్తిగా అంకితం చేసుకుంటారు. బ్యాటింగ్‌లో ప్రతి పరుగు కోసం పాకులాడే కోహ్లీ, ఫీల్డింగ్‌లో కూడా ప్రత్యర్థి జట్టు ఒక్క పరుగు కూడా తీయకుండా అడ్డుకోవాలని ప్రయత్నిస్తుంటారు. అయితే తన నుంచి ఏదైనా చిన్న పొరపాటు జరిగితే మాత్రం విరాట్ తనపై తనే అసంతృప్తి చెందుతుంటారు. అలాంటి దృశ్యమే ఇండోర్ మైదానంలో మరోసారి కనిపించింది.
న్యూజిలాండ్‌తో జరిగిన మూడో వన్డేలో టాస్ గెలిచిన కెప్టెన్ శుభ్‌మన్ గిల్ కివీస్ జట్టును బ్యాటింగ్‌కు ఆహ్వానించారు. భారత బౌలర్లు అర్ష్‌దీప్ సింగ్ హర్షిత్ రాణా జట్టుకు అద్భుతమైన ఆరంభాన్ని అందించారు. కానీ డారిల్ మిచెల్ మరోసారి క్రీజులో పాతుకుపోయి, వరుసగా రెండో మ్యాచ్‌లో కూడా సెంచరీ సాధించాడు.
Also Read: ఉమెన్స్ ప్రీమియర్ లీగ్‌లో చరిత్ర సృష్టించిన స్మృతి మంధాన!
Virat Kohli looks disappointed after his fumble.
His commitment towards the game 🙌🏻🔥pic.twitter.com/Bmc2MBmyEj
— Suprvirat (@Mostlykohli) January 18, 2026
తనపై తనే కోప్పడ్డ కోహ్లీ
ప్రస్తుతం సోషల్ మీడియాలో ఒక వీడియో వైరల్ అవుతోంది. అందులో విరాట్ కోహ్లీ తనపై తనే ఆగ్రహం వ్యక్తం చేయడం కనిపిస్తుంది. వీడియో ప్రకారం.. కోహ్లీ ఒక బంతిని ఆపేందుకు వేగంగా పరుగెత్తుకుంటూ వెళ్తారు. బంతిని అందుకుని వెంటనే విసిరే క్రమంలో రెండు మూడు సార్లు ప్రయత్నించినప్పటికీ బంతి సరిగ్గా చేతికి చిక్కదు. తన ప్రయత్నం విఫలమవడంతో తీవ్ర అసంతృప్తికి లోనైన కింగ్ కోహ్లీ కోపంతో బంతిని కాలితో తన్నబోయారు.
మరోసారి బయటపడ్డ టీమ్ ఇండియా బలహీనత
ఈ మూడో వన్డేలో టీమ్ ఇండియా ఆరంభం అద్భుతంగా ఉంది. మ్యాచ్ మొదటి ఓవర్‌లోనే అర్ష్‌దీప్ సింగ్ హెన్రీ నికోల్స్‌ను డకౌట్ చేయగా రెండో ఓవర్‌లో హర్షిత్ రాణా డెవాన్ కాన్వేను పెవిలియన్‌కు పంపాడు. ఆ తర్వాత 30 పరుగులు చేసిన విల్ యంగ్‌ను కూడా హర్షిత్ అవుట్ చేశాడు. 13 ఓవర్లలోనే 3 వికెట్లు తీసినప్పటికీ మిడిల్ ఓవర్లలో (మధ్య ఓవర్లలో) వికెట్లు తీయడంలో భారత బౌలర్లు మళ్లీ విఫలమయ్యారు.
మొదటి, రెండో వన్డేల తరహాలోనే మూడో మ్యాచ్‌లో కూడా భారత బౌలర్లు మిడిల్ ఓవర్లలో వికెట్ల కోసం కష్టపడాల్సి వచ్చింది. డారిల్ మిచెల్, గ్లెన్ ఫిలిప్స్ జోడీ భారత బౌలర్లపై విరుచుకుపడుతూ స్కోరు బోర్డును పరుగులు పెట్టించారు.