HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > India
  • >Nationwide Protest Against Waqf Amendment Bill

Congress : వక్ఫ్‌ సవరణ బిల్లుకు వ్యతిరేకంగా దేశవ్యాప్త ఆందోళన

వీటికి మద్దతు ఇవ్వాలని టీడీపీ, వైసీపీ, కాంగ్రెస్‌ను కోరింది. వక్ఫ్‌ బిల్లుకు మద్దతు ఉపసంహరించండి...లేకుంటే మా మద్దతును కోల్పోతారు అన్న సందేశాన్ని బీజేపీ మిత్ర పక్షాలకు పంపించడమే ఈ ధర్నాల ఉద్దేశమని పేర్కొన్నారు.

  • By Latha Suma Published Date - 10:54 AM, Mon - 24 March 25
  • daily-hunt
Nationwide protest against Waqf Amendment Bill
Nationwide protest against Waqf Amendment Bill

Congress : ఆల్ ఇండియా ముస్లిం పర్సనల్‌‌ లా బోర్డు వక్ఫ్‌ సవరణ బిల్లుకు వ్యతిరేకంగా దేశవ్యాప్త ఆందోళనలకు సిద్ధమైంది. ఈ మేరకు అఖిల భారత ముస్లిం పర్సనల్‌ లా బోర్డు(ఏఐఎంపీఎల్‌బీ) ఆదివారం ప్రకటించింది. తొలి దశలో భాగంగా ఈనెల 26న బిహార్ రాజధాని పట్నాలో, 29న ఏపీలోని విజయవాడలో నిరసనలు జరపనున్నట్లు ప్రకటించింది. వీటికి మద్దతు ఇవ్వాలని టీడీపీ, వైసీపీ, కాంగ్రెస్‌ను కోరింది. వక్ఫ్‌ బిల్లుకు మద్దతు ఉపసంహరించండి…లేకుంటే మా మద్దతును కోల్పోతారు అన్న సందేశాన్ని బీజేపీ మిత్ర పక్షాలకు పంపించడమే ఈ ధర్నాల ఉద్దేశమని పేర్కొన్నారు. అన్ని రాష్ట్రాల రాజధానుల్లో ప్రదర్శనలను జరుపుతామని, ముఖ్యంగా హైదరాబాద్‌, ముంబయి. కోల్‌కతా, బెంగళూరు, మలేర్‌కోట్లా (పంజాబ్‌), రాంచీల్లో భారీ ఊరేగింపులు ఉంటాయని వివరించారు. ముస్లిం బోర్డు వినతిపై ఆయా పార్టీలు ఎలా స్పందిస్తాయనేది ఆసక్తిగా మారింది.

Read Also: Phone Tapping Case: విదేశీ గడ్డపైకి ఫోన్ ట్యాపింగ్ కేసు.. ప్రభాకర్‌, శ్రవణ్‌ ఆలోచన అదేనా ?

కేంద్రం తీసుకొచ్చిన వక్ఫ్‌ (సవరణ) బిల్లును రాజ్యాంగంపై దాడిగా కాంగ్రెస్‌ పేర్కొంది. శతాబ్దాల కాలం నుంచి బలంగా ఉన్న మన దేశ బహుళ మత సమాజ సామరస్యాన్ని దెబ్బతీసేందుకు బీజేపీ నిరంతరంగా చేస్తున్న ప్రయత్నాల్లో భాగంగా దీన్ని తీసుకొచ్చారని ఆరోపించింది. వక్ఫ్‌ ప్రయోజనాల కోసం భూమిని ఎవరు దానం చేయవచ్చో నిర్ణయించడంపై ఉద్దేశపూర్వకంగా అస్పష్టత ఇచ్చారని, వక్ఫ్‌ నిర్వచనాన్నే మార్చారని రమేశ్‌ ఆరోపించారు. వక్ఫ్‌ పాలనను బలహీనం చేసేందుకు ప్రస్తుతం ఉన్నచట్టంలోని నిబంధనలు తొలగించారని, వక్ఫ్‌ భూములను అక్రమించిన వారికి రక్షణ కల్పించేలా మార్పులు చేశారని ఆరోపించారు. వక్ఫ్‌ ఆస్తులపై వివాదాలు, వాటి రిజిస్ట్రేషన్‌కు సంబంధించిన అంఽశాలపై కలెక్టర్లు, నియమించిన ఇతర రాష్ట్ర ప్రభుత్వ అధికారులకు విశేష అధికారాలు కల్పించడాన్ని ఆయన తప్పుబట్టారు.

Read Also: Summer : సమ్మర్ లో మీరు చురుకుగా ఉండాలంటే ఇవి తినాలసిందే

 


Follow us
HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • ap
  • congress
  • nationwide protests
  • tdp
  • vijayawada
  • Waqf Amendment Bill
  • ysrcp

Related News

Tdp Leaders Ycp

Big Shock to TDP : వైసీపీలో చేరిన కీలక నేతలు

Big Shock to TDP : కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు నుంచి పలువురు టీడీపీ, బీజేపీ నేతలు వైఎస్సార్‌సీపీలో చేరారు. టీడీపీకి చెందిన మధు, మల్లికార్జున్, బీజేపీ అసెంబ్లీ ఇంఛార్జ్ మురహరిరెడ్డి, బీజేపీ నేత కిరణ్ కుమార్‌తో పాటు వారి అనుచరులు జగన్ సమక్షంలో చేరడం ఆ పార్టీకి ఊతమిచ్చింది

  • Lokesh supports National Education Policy

    Mega DSC : ప్రతి ఏటా DSC ప్రకటన – లోకేష్

  • Let's decide who will win!..KTR challenges CM Revanth Reddy

    CM Revanth : ఆ ఇద్దరు ఆడించినట్లు రేవంత్ ఆడుతున్నాడు – KTR

  • Og Tgh

    OG కి బిగ్ షాక్ ఇచ్చిన తెలంగాణ హైకోర్టు…టికెట్స్ కొనుగోలు చేసిన వారి పరిస్థితి ఏంటి..?

  • Pawan Uppada

    Pawan’s Key Decision : ఉప్పాడ మత్స్యకారుల సమస్యలకు పవన్ చెక్ !!

Latest News

  • India vs Sri Lanka: శ్రీలంక ముందు భారీ ల‌క్ష్యం.. భార‌త్ స్కోర్ ఎంతంటే?

  • America: భార‌త్‌లో ప‌ర్య‌టించనున్న అమెరికా ప్ర‌తినిధులు.. అగ్ర‌రాజ్యానికి మోదీ స‌ర్కార్ కండీష‌న్‌!

  • Election Schedule: రేపు స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్ విడుద‌ల‌?

  • Formula E Car Race Case : అరెస్ట్ చేస్తే చేసుకోండి – కేటీఆర్

  • Suryakumar Yadav: సూర్య‌కుమార్ యాద‌వ్‌కు షాక్‌.. మ్యాచ్ ఫీజులో 30 శాతం కోత‌!

Trending News

    • Prime Minister Routine Checkup: ప్రధానమంత్రి మోదీ ఆరోగ్య ప్రోటోకాల్.. ప్రతి 3 నెలలకు ఒకసారి చెకప్!

    • Rupee: పుంజుకున్న రూపాయి.. బ‌ల‌హీన‌ప‌డిన డాల‌ర్‌!

    • IND vs PAK Final: భార‌త్‌- పాక్ మ‌ధ్య ఫైన‌ల్ మ్యాచ్‌.. పైచేయి ఎవ‌రిదంటే?

    • Ladakh: లడఖ్‌లో ఉద్రిక్త ప‌రిస్థితుల‌కు కార‌ణాలీవేనా??

    • UPI Boom: యూపీఐ వినియోగం పెరగడంతో నగదు వాడకం తగ్గింది: ఆర్‌బీఐ

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2025 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd