MS Dhoni : జార్ఖండ్ అసెంబ్లీ పోల్స్‌కు బ్రాండ్ అంబాసిడర్‌గా ధోనీ
ఇందుకోసం భారత క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ(MS Dhoni) ఫొటోను వాడుకోనుంది.
- By Pasha Published Date - 11:07 AM, Sat - 26 October 24

MS Dhoni : మహేంద్ర సింగ్ ధోనీ.. కేంద్ర ఎన్నికల సంఘం తరఫున జార్ఖండ్ బ్రాండ్ అంబాసిడర్‌గా నియమితులు అయ్యారు. జార్ఖండ్‌లోని 43 అసెంబ్లీ నియోజకవర్గాలకు నవంబరు 13న తొలి దశ పోలింగ్ జరగనుంది. ఈసందర్భంగా ఎన్నికల సంఘం ఓటు విలువపై, పోలింగ్ శాతాన్ని పెంచడంపై ముమ్మర ప్రచారం చేయనుంది. ఇందుకోసం భారత క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ(MS Dhoni) ఫొటోను వాడుకోనుంది. ఇందుకోసం కేంద్ర ఎన్నికల సంఘానికి ధోనీ అనుమతించారని చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్ కె రవికుమార్ వెల్లడించారు. జార్ఖండ్‌లో పోలింగ్ శాతాన్ని పెంచడానికి, సాధ్యమైనంత ఎక్కువ మంది ఓటర్లను పోలింగ్ కేంద్రాల వైపు ఆకర్షించేందుకు మహేంద్ర సింగ్ ధోని తనవంతుగా కృషి చేస్తారని ఆయన తెలిపారు. సిస్టమ్యాటిక్ ఓటర్స్ ఎడ్యుకేషన్ అండ్ ఎలక్టోరల్ పార్టిసిపేషన్ (స్వీప్) ప్రచార కార్యక్రమంలో భాగంగా ప్రజలకు ఓటు విలువ గురించి తెలియజేసే దిశగా ధోనీ ప్రచారం ఉంటుందన్నారు. ధోనీ వల్ల ఈసారి జార్ఖండ్‌లో పోలింగ్ శాతం పెరుగుతుందని చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్ కె రవికుమార్ ఆశాభావం వ్యక్తం చేశారు.
Also Read :BluJ Aerospace : విమానం నిలువునా నింగిలోకి, నేలపైకి.. హైదరాబాద్ స్టార్టప్ తడాఖా
- ఈసారి జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికల కోసం ఇప్పటివరకు నామినేషన్ దాఖలు చేసిన ప్రముఖుల్లో బీజేపీ నేత, మాజీ సీఎం చంపై సోరెన్ కూడా ఉన్నారు.
- ఆల్ జార్ఖండ్ స్టూడెంట్స్ యూనియన్ (ఏజేఎస్‌యూ) పార్టీ అధ్యక్షుడు, జార్ఖండ్ మాజీ ఉప ముఖ్యమంత్రి సుదేష్ మహతో కూడా సిల్లి అసెంబ్లీ స్థానం నుంచి నామినేషన్ వేశారు.
- ఈసారి జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికల కోసం జేఎంఎం 35 మంది అభ్యర్థులతో తొలి జాబితాను రిలీజ్ చేసింది.
- జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికల కోసం 66 మంది అభ్యర్థులతో బీజేపీ తొలి జాబితాను విడుదల చేసింది.
- ఈ ఎన్నికల్లో ఆల్ జార్ఖండ్ స్టూడెంట్స్ యూనియన్ (ఏజేఎస్‌యూ), జనతాదళ్ (యునైటెడ్), లోక్ జనశక్తి పార్టీ (ఎల్‌జేపీ)లతో కలిసి బీజేపీ పోటీ చేస్తోంది. బీజేపీ 68 స్థానాల్లో, ఏజేఎస్‌యూ 10 స్థానాల్లో, జేడీయూ రెండు స్థానాల్లో, ఎల్జేపీ ఒక స్థానంలో పోటీ చేస్తున్నాయి.
- జార్ఖండ్ అసెంబ్లీలోని మొత్తం 81 స్థానాలకు నవంబర్ 13, నవంబర్ 20న రెండు దశల్లో పోలింగ్ జరుగుతుంది.
- నవంబర్ 23న ఫలితాలు వెలువడనున్నాయి.