Chinese Troops : దెప్సాంగ్, డెమ్‌చోక్ నుంచి చైనా బ్యాక్.. శాటిలైట్ ఫొటోలివీ
దెప్సాంగ్, డెమ్‌చోక్(Chinese Troops) నుంచి బలగాల ఉపసంహరణ పూర్తయిన ప్రస్తుత తరుణంలో.. ఇరు దేశాలు 2020 సంవత్సరం ఏప్రిల్‌కు మునుపటి ప్రాంతాల్లోనే గస్తీని నిర్వహించనున్నాయి.
- By Pasha Published Date - 10:06 AM, Sat - 26 October 24

Chinese Troops : అమెరికా, పశ్చిమ దేశాలకు షాక్ ఇచ్చేలా భారత్ – చైనాల మధ్య సరిహద్దు వివాదానికి తాత్కాలిక పరిష్కారం లభించింది. భారత్ అభ్యంతరం తెలిపిన సరిహద్దు ప్రాంతాల నుంచి చైనా బలగాల ఉపసంహరణ ప్రక్రియ వేగవంతంగా జరుగుతోంది. తూర్పు లద్దాఖ్‌లోని దెప్సాంగ్, డెమ్‌చోక్ ప్రాంతాల నుంచి భారత్-చైనా తమ సైనిక బలగాలను వెనక్కి పిలుచుకుంటున్నాయి.ఈ నెల 28, 29 తేదీల్లోగా ఇరుదేశాల సైనిక బలగాల ఉపసంహరణ ప్రక్రియ పూర్తి కానుంది. ఈ తరుణంలో దెప్సాంగ్, డెమ్‌చోక్ ప్రాంతాల నుంచి చైనా సైనిక నిర్మాణాలను తొలగించిన శాటిలైట్ ఫొటోలు బయటికి వచ్చాయి. సైనిక బలగాలు, నిర్మాణాలు, టెంట్లు, వాహనాలను ఆయా ఏరియాల నుంచి చైనా ఆర్మీ తొలగించినట్లు ఆ హై రెజెల్యూషన్ ఫొటోలలో స్పష్టంగా కనిపిస్తోంది. అక్టోబరు 9 నాటి శాటిలైట్ ఫొటోలను చూసినట్లయితే.. ఆయా ప్రాంతాల్లో చైనా ఆర్మీ కదలికలు స్పష్టంగా కనిపించాయి. దెప్సాంగ్, డెమ్‌చోక్(Chinese Troops) నుంచి బలగాల ఉపసంహరణ పూర్తయిన ప్రస్తుత తరుణంలో.. ఇరు దేశాలు 2020 సంవత్సరం ఏప్రిల్‌కు మునుపటి ప్రాంతాల్లోనే గస్తీని నిర్వహించనున్నాయి.
Also Read :Israel Vs Iran : ఇరాన్‌పై ఇజ్రాయెల్ ప్రతీకార దాడులు
2020 సంవత్సరం మార్చి నుంచి చైనా-భారత్ మధ్య సరిహద్దు విషయంలో సైనిక ప్రతిష్టంభన నడుస్తోంది. నాలుగేళ్ల సైనిక ప్రతిష్టంభనకు సుదీర్ఘ చర్చలతో భారత్, చైనాలు ముగింపు పలికాయి. ఇరు దేశాలు వాస్తవాధీన రేఖ (ఎల్‌ఏసీ) వెంబడి గస్తీకి, బలగాల ఉపసంహరణకు సంబంధించి ఓ ఒప్పందాన్ని కుదుర్చుకున్నాయి. ఇటీవలే బ్రిక్స్ సదస్సు సందర్భంగా రష్యాలోని కజన్‌లో చైనా అధ్యక్షుడు షి జిన్‌పింగ్, భారత ప్రధాని మోడీ సరిహద్దు వివాదంపై చర్చించారు. పరస్పర గౌరవంతో, ఉమ్మడి ప్రయోజనాల పరిరక్షణ కోసం ఇరుదేశాలు ప్రయత్నించాలనే నిర్ణయానికి వారు వచ్చారు.
Also Read :New Maruti Suzuki Dzire: మారుతీ నుంచి మరో కొత్త కారు.. మైలేజ్ 32కిమీ!
2020 సంవత్సరం జూన్‌లో లడఖ్‌లోని గల్వాన్ లోయలో భారత్-చైనా సైనిక బలగాలు తీవ్ర ఘర్షణకు దిగాయి. ఈ ఘటనలో 20 మంది భారత సైనికులు అమరులయ్యారు. చైనాకు చెందిన కొందరు సైనికులు కూడా చనిపోయారు. అయితే ఎంతమంది చనిపోయారనే వివరాలను చైనా అధికారికంగా ప్రకటించలేదు.