BJP : మహారాష్ట్ర ఎన్నికలు.. 40 మందిని స్టార్ క్యాంపెయినర్లుగా ప్రకటించిన బీజేపీ
BJP : మహారాష్ట్రలో మొత్తం 288 స్థానాలకు ఒకే విడతలో ఎన్నికలు నిర్వహించనున్న విషయం తెలిసిందే. నవంబర్ 20న ఎన్నికలు నిర్వహించి.. 23న ఫలితాలు వెల్లడించనున్నారు. రాష్ట్రంలో మొత్తం 9 కోట్ల 63 లక్షల మంది ఓటర్లు ఉండగా.. లక్షా 186 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు ఈసీ ఇప్పటికే ప్రకటించింది.
- Author : Latha Suma
Date : 26-10-2024 - 2:04 IST
Published By : Hashtagu Telugu Desk
Star campaigners : మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో బీజేపీ స్టార్ క్యాంపెయినర్లను ప్రకటించింది. ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ, కేంద్ర మంత్రులు అమిత్ షా, జేపీ నడ్డా, రాజ్‌నాథ్ సింగ్, నితిన్ గడ్కరీ, శివరాజ్ సింగ్ చౌహాన్, అస్సాం సీఎం హిమంత బిశ్వ శర్మ, యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ సహా మొత్తం 40 మంది పేర్లను ప్రకటించింది.
మహారాష్ట్రలో మొత్తం 288 స్థానాలకు ఒకే విడతలో ఎన్నికలు నిర్వహించనున్న విషయం తెలిసిందే. నవంబర్ 20న ఎన్నికలు నిర్వహించి.. 23న ఫలితాలు వెల్లడించనున్నారు. రాష్ట్రంలో మొత్తం 9 కోట్ల 63 లక్షల మంది ఓటర్లు ఉండగా.. లక్షా 186 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు ఈసీ ఇప్పటికే ప్రకటించింది. ఇక నవంబర్ 26తో మహారాష్ట్ర అసెంబ్లీ గడువు ముగియనుంది.
ఇకపోతే.. లోక్‌సభ ఎన్నికల తర్వాత ఎన్డీఏ, ఇండియా కూటములు ఎదుర్కొంటున్న అతి పెద్ద సవాల్ ఇది. మహారాష్ట్రలో ఈసారి నేరుగా అధికారాన్ని దక్కించుకొని ప్రజా మద్దతు తమకే ఉందని నిరూపించుకునేందుకు బీజేపీ, శివసేన, ఎన్సీపీతో కూడిన మహాయుతి ప్రయత్నం చేస్తోంది. మరోవైపు పార్టీల్లో చీలకలతో కోల్పోయిన అధికారాన్ని తిరిగి పొందాలని కాంగ్రెస్, శివసేన(ఉద్ధవ్), ఎన్సీపీ(శరద్ పవార్)తో కూడిన మహా వికాస్ అఘాడీ పట్టుదలగా ఉంది. దీంతో ఈ ఎన్నికలు ఆసక్తికరంగా మారాయి.