HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > India
  • >Bill Gates Avoids Ai Conference

ఏఐ సదస్సుకు బిల్‌గేట్స్‌ దూరం..

  • Author : Vamsi Chowdary Korata Date : 19-02-2026 - 10:13 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Bill Gates 
Bill Gates 
Bill Gates   ప్రపంచవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తున్న ‘ఎప్‌స్టీన్ ఫైల్స్’ వివాదం మైక్రోసాఫ్ట్ సహ వ్యవస్థాపకుడు బిల్ గేట్స్‌ను వెంటాడుతోంది. ఈ వివాదం కారణంగా, ఢిల్లీలో జరుగుతున్న ప్రతిష్ఠాత్మక ‘ఇండియా ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్ 2026’లో ఆయన ఇవ్వాల్సిన కీలక ప్రసంగాన్ని చివరి నిమిషంలో రద్దు చేసుకున్నారు. ఈ మేరకు గేట్స్ ఫౌండేషన్ గురువారం ఉదయం అధికారికంగా ప్రకటించింది.

లైంగిక నేరస్తుడిగా శిక్ష అనుభవించి జైలులో ఆత్మహత్య చేసుకున్న జెఫ్రీ ఎప్స్టీన్‌కు సంబంధించిన పత్రాలు ఇటీవల బయటకు రాగా, అందులో బిల్ గేట్స్ పేరు ఉండటం తీవ్ర దుమారం రేపింది. గేట్స్‌కు రష్యన్ అమ్మాయిలతో ఉన్న సంబంధాలను కప్పిపుచ్చేందుకు ఎప్‌స్టీన్ ప్రయత్నించాడని ఆ పత్రాల్లో ఆరోపణలు ఉన్నాయి. అయితే, ఎప్‌స్టీన్ తనను బ్లాక్‌మెయిల్ చేసేందుకే ఇలా చేశాడని, ఈ ఆరోపణల్లో నిజం లేదని బిల్ గేట్స్ ఇప్పటికే స్పష్టం చేశారు.

షెడ్యూల్ ప్రకారం గురువారం ఉదయం 11:50 గంటలకు బిల్ గేట్స్ ప్రసంగించాల్సి ఉంది. ఇప్పటికే సోమవారం భారత్‌కు చేరుకున్న ఆయన, ఆంధ్రప్రదేశ్ పర్యటన కూడా ముగించుకుని ఢిల్లీ వచ్చారు. అయితే, తాజా వివాదం నేపథ్యంలో సదస్సు అసలు ఉద్దేశం పక్కదారి పట్టకూడదనే ఉద్దేశంతోనే ఆయన తన ప్రసంగాన్ని రద్దు చేసుకున్నారని గేట్స్ ఫౌండేషన్ ‘ఎక్స్’ వేదికగా తెలిపింది. ఆయన స్థానంలో ఆఫ్రికా-ఇండియా విభాగాల ప్రెసిడెంట్ అంకుర్ వోరా ప్రసంగిస్తారని పేర్కొంది.

ఈ సదస్సులో ప్రధాని నరేంద్ర మోదీ, ఓపెన్ ఏఐ సీఈవో శామ్ ఆల్ట్‌మన్, గూగుల్ సీఈవో సుందర్ పిచాయ్ వంటి టెక్ దిగ్గజాలు పాల్గొంటున్నారు. మరోవైపు, బిల్ గేట్స్ ఫౌండేషన్‌తో తమ రాష్ట్ర ప్రభుత్వం ఒప్పందాలను రద్దు చేసుకోవాలని బీహార్‌కు చెందిన కొందరు ఎంపీలు డిమాండ్ చేయడం గమనార్హం.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • AI summit
  • bill gates
  • delhi
  • Epstein files
  • Gates Foundation
  • India AI Impact Summit 2026
  • Jeffrey Epstein
  • Russian Girls
  • Satya Nadella

Related News

Death

Delhi : పెళ్లికి కోటి రూపాయలకు పైగా ఖర్చు.. 17 నెలల్లోనే కూతురు మృతి

ఢిల్లీ సమీపంలోని గ్రేటర్ నోయిడాలో 25 ఏళ్ల దీపిక నాగర్ అనుమానాస్పద మృతి కలకలం రేపుతోంది. అత్త ఇంటిలోని పైకప్పు నుంచి పడిపోయి మృతి చెందినట్టు పోలీసులు చెబుతుండగా… ఇది ఆత్మహత్య కాదు, కట్నం కోసం చేసిన హత్య అని బాధితురాలి కుటుంబం ఆరోపిస్తోంది. “ఫార్చ్యూనర్ కారు, ₹51 లక్షలు కావాలని వేధించారు. పెళ్లిలోనే ₹11 లక్షల నగదు, ₹50 లక్షల బంగారం, ఫర్నిచర్, స్కార్పియో కారు ఇచ్చాం” అంటూ త‌న తం

  • ACB raids

    ACB Raids : మాజీ ఏపీ భవన్ అధికారి ఇళ్ల‌లో ఏసీబీ సోదాలు.. కోట్ల విలువైన అక్రమ ఆస్తుల గుర్తింపు

Latest News

  • RCB : ఐపీఎల్ 2026 విజేత ఆర్సీబీ.. వ‌రుస‌గా రెండోసారి టైటిల్ గెలుచుకున్న రాయ‌ల్ ఛాలెంజ‌ర్స్‌

  • RCB vs GT : ఐపీఎల్ 2026 ఫైనల్ : ఆర్‌సీబీ బౌలర్ల ధాటికి కుప్పకూలిన గుజరాత్ బ్యాట్స్‌మ‌న్స్‌

  • Forever New : వైజాగ్‌లో ఫరెవర్ న్యూ సరికొత్త స్టోర్

  • PM-Setu Scheme : ఏపీకి దక్కిన అరుదైన గౌరవం

  • RCB vs GT : ఐపీఎల్ 2026 ఫైనల్: టాస్ గెలిచిన ఆర్‌సీబీ.. రెండో టైటిల్ కోసం ఇరుజ‌ట్లు పోటీ

Trending News

    • fake news: లిక్కర్ కేసులో నా భార్యకు నోటీసులు రావడం అంతా అబద్ధం.. కేశినేని చిన్ని !

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd