Railway Job Notification : 10వ తరగతి అర్హతతో రైల్వేలో 238 ఉద్యోగాలు..
రైల్వేలో జాబ్స్ సాధించాలని కలలు కనే నిరుద్యోగులకు గుడ్న్యూస్. తాజాగా నార్త్ వెస్ట్రన్ రైల్వే అసిస్టెంట్ లోకో పైలట్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది.
- By Maheswara Rao Nadella Published Date - 04:00 AM, Fri - 14 April 23
Railway Job Notification : రైల్వేలో జాబ్స్ సాధించాలని కలలు కనే నిరుద్యోగులకు గుడ్న్యూస్. తాజాగా నార్త్ వెస్ట్రన్ రైల్వే (North Western Railway), అసిస్టెంట్ లోకో పైలట్ (Assistant Loco Pilot) పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. 10వ తరగతి, ఐటీఐ చదివిన వారు ఈ పోస్టులకు అర్హులు. దరఖాస్తు ప్రక్రియ ఏప్రిల్ 7 నుంచి ప్రారంభమైంది. దరఖాస్తులకు చివరితేది మే 6, 2023.
నోటిఫికేషన్ వివరాలు ఇవీ..
- మొత్తం ఖాళీలు : 238
- జనరల్ కేటగిరీకి 120, ఓబీసీకి 36, ఎస్టీకి 18, ఎస్సీకి 36 పోస్టులున్నాయి.
- అసిస్టెంట్ లోకో పైలట్ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థికి 10వ తరగతి ఉత్తీర్ణత తప్పనిసరి.
- అభ్యర్థి ఫిట్టర్ మొదలైన ట్రేడ్లో ఐటీఐ డిగ్రీని కలిగి ఉండాలి.
- దరఖాస్తుదారుల వయస్సు 42 సంవత్సరాల కంటే ఎక్కువ ఉండకూడదు.
- OBC కేటగిరీకి వయోపరిమితి 45 సంవత్సరాలు, SC, ST వర్గాలకు 47 సంవత్సరాలుగా నిర్ణయించారు.
- అన్ని కేటగిరీల అభ్యర్థులని దరఖాస్తు ఫీజు నుంచి మినహాయించారు. అంటే ఏ కేటగిరీ అభ్యర్థులు దరఖాస్తు ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదు.
- ఇక అభ్యర్థుల ఎంపిక విషయానికొస్తే.. CBT పరీక్ష ద్వారా అభ్యర్థులను ఉద్యోగాలకి ఎంపిక చేస్తారు. ఇందులో ఉత్తీర్ణులైన అభ్యర్థులను డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ ఎగ్జామ్కు పిలుస్తారు.
- ఈ రిక్రూట్మెంట్కు సంబంధించిన మరింత సమాచారం కోసం అభ్యర్థులు ఎప్పటికప్పుడు అధికారిక నోటిఫికేషన్ను లేదా అధికారిక వెబ్సైట్లలో చెక్ చేసుకోవచ్చు.
- అర్హత, ఆసక్తిగల అభ్యర్థులు అధికారిక వెబ్సైట్ https://rrcjaipur.in/ లేదా https://nwr.indianrailways.gov.in/ ద్వారా అప్లయ్ చేసుకోవచ్చు.
Also Read: ISRO Job Notification: ఇస్రో లో జాబ్స్.. నెలకు రూ.1,42,400 శాలరీ.. ఏప్రిల్ 24 లాస్ట్ డేట్
దరఖాస్తు ప్రక్రియ ఇదీ..
- అభ్యర్థులు ముందుగా అధికారిక వెబ్సైట్ https://rrcjaipur.in/ ని ఓపెన్ చేయాలి.
- తర్వాత New Registration పై క్లిక్ చేయాలి.
- మెయిల్ ఐడి, ఫోన్ నంబర్, పుట్టిన తేదీని ఎంటర్ చేయడం ద్వారా నమోదు చేసుకోవాలి.
- తర్వాత అప్లికేషన్ను ప్రారంభించి సమాచారాన్ని ఎంటర్ చేయాలి.
- అవసరమైన అన్ని పత్రాలను అప్లోడ్ చేసి సబ్మిట్ చేయాలి.
Also Read: DCCB Job Notification: DCCB విజయనగరం లో జాబ్స్.. ఏప్రిల్ 15 లాస్ట్ డేట్
Related News
Central Armed Forces : కేంద్ర సాయుధ పోలీసు దళాల్లో 506 జాబ్స్
Central Armed Forces : డిగ్రీ పట్టాతో పాటు నిర్ణీత శారీరక ప్రమాణాలున్న అభ్యర్థులకు గుడ్ న్యూస్.