Central Armed Forces : కేంద్ర సాయుధ పోలీసు దళాల్లో 506 జాబ్స్
Central Armed Forces : డిగ్రీ పట్టాతో పాటు నిర్ణీత శారీరక ప్రమాణాలున్న అభ్యర్థులకు గుడ్ న్యూస్.
- By Pasha Published Date - 08:47 AM, Sun - 28 April 24

Central Armed Forces : డిగ్రీ పట్టాతో పాటు నిర్ణీత శారీరక ప్రమాణాలున్న అభ్యర్థులకు గుడ్ న్యూస్. ‘సెంట్రల్ ఆర్మ్‌డ్ పోలీస్ ఫోర్సెస్ (అసిస్టెంట్ కమాండెంట్) ఎగ్జామినేషన్-2024’ నోటిఫికేషన్‌ను యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ విడుదల చేసింది. దీనిలో భాగంగా 506 అసిస్టెంట్ కమాండెంట్ పోస్టులను(Central Armed Forces) భర్తీ చేయనున్నారు. వీటిలో 186 పోస్టులు బీఎస్‌ఎఫ్‌లో, 120 పోస్టులు సీఆర్‌పీఎఫ్‌లో, 100 పోస్టులు సీఐఎస్‌ఎఫ్‌లో, 58 పోస్టులు ఐటీబీపీలో, 42 పోస్టులు సశస్త్ర సీమాబల్‌లో ఉన్నాయి. 2024 ఆగస్టు 1 నాటికి 20 నుంచి 25 ఏళ్లలోపు వయసు కలిగిన వారే ఈ ఉద్యోగాలకు అర్హులు. అప్లికేషన్ ఫీజు రూ.200. అయితే ఎస్సీ, ఎస్టీ, మహిళా అభ్యర్థులకు ఫీజు నుంచి మినహాయింపు ఉంటుంది.మే 14 వరకు దరఖాస్తులను స్వీకరించనున్నారు. దరఖాస్తుల సవరణకు అవకాశం మే 15 నుంచి 21 వరకు ఉంటుంది.
We’re now on WhatsApp. Click to Join
పరీక్షలు, ఫిజికల్ టెస్టుల వివరాలివీ..
- రాతపరీక్ష, ఫిజికల్ స్టాండర్డ్స్ టెస్ట్, ఫిజికల్ ఎఫీషియన్సీ టెస్ట్, మెడికల్ ఎగ్జామినేషన్, ఇంటర్వ్యూ, పర్సనాలిటీ టెస్ట్, డాక్యుమెంట్ వెరిఫికేషన్ ద్వారా అభ్యర్థులను అసిస్టెంట్ కమాండెంట్ పోస్టులకు ఎంపికచేస్తారు.
- ఆగస్టు 4న ఉదయం 10 గంటల నుంచి 12 గంటల వరకు తొలి సెషన్‌లో పేపర్-1, మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు రెండో సెషన్‌లో పేపర్-2 పరీక్ష జరుగుతాయి.
- మొత్తం 450 మార్కులకు రాతపరీక్ష నిర్వహిస్తారు. పేపర్-1లో జనరల్ ఎబిలిటీ అండ్ ఇంటెలిజెన్స్‌కు 250 మార్కులు ఉంటాయి. ఆబ్జెక్టివ్ విధానంలో ప్రశ్నలు అడుగుతారు. పేపర్-2లో జనరల్ స్టడీస్, ఎస్సే, కాంప్రహెన్షన్‌కు 200 మార్కులు కేటాయించారు. అభ్యర్థులు హిందీ లేదా ఇంగ్లిష్‌లో వ్యాసం రాయాల్సి ఉంటుంది. ప్రెసిస్ రైటింగ్, కాంప్రహెన్షన్, ఇతర కమ్యూనికేషన్స్/లాంగ్వేజ్ స్కిల్ టెస్టులు మాత్రం ఇంగ్లిష్‌లోనే రాయాలి.
Also Read : Earthquake : ఇండోనేషియాలో భారీ భూకంపం.. నిమిషం పాటు ఊగిసలాడిన భవనాలు
- అభ్యర్థులు 100 మీటర్ల పరుగు పూర్తిచేయాలి. పురుషులు 16 సెకండ్లలో, మహిళలు 18 సెకండ్లలో దీన్ని పూర్తిచేయాలి.
- 800 మీటర్ల పరుగుపందెం కూడా నిర్వహిస్తారు. పురుషులు 3 నిమిషాల 45 సెకండ్లలో, మహిళలు 4 నిమిషాల 45 సెకండ్లలో దీన్ని పూర్తిచేయాలి.
- లాంగ్ జంప్‌లో పురుషులు 3.5 మీటర్లు, మహిళలు 3.0 మీటర్లు జంప్ చేయాలి.
- పురుషులకు మాత్రమే షార్ట్‌పుట్ నిర్వహిస్తారు. అభ్యర్థులు మూడు అవకాశాల్లో 7.26 కిలోల బరువుండే గుండును 4.5 మీటర్ల వరకు విసరాలి.
- హైదరాబాద్, తిరుపతి, విశాఖపట్నంలో పరీక్ష కేంద్రాలు ఉంటాయి.