Samantha Birthday : సమంత కెరీర్లో ఎలాంటి టఫ్ టైమ్స్‌ను చూశారో తెలుసా ?
Samantha Birthday : ఇవాళ (ఏప్రిల్ 28న) ప్రముఖ హీరోయిన్ సమంత 37వ పుట్టినరోజు.
- By Pasha Published Date - 01:57 PM, Sun - 28 April 24
Samantha Birthday : ఇవాళ (ఏప్రిల్ 28న) ప్రముఖ హీరోయిన్ సమంత 37వ పుట్టినరోజు. 2010 సంవత్సరంలో నటిగా కెరీర్‌ను ప్రారంభించింది సామ్.. సక్సెస్ఫుల్ హీరోయిన్గా పేరు తెచ్చుకుంది. తనపై ఎన్ని నెగెటివ్ కామెంట్స్ వచ్చినా.. సమంత వాటిని ఎదుర్కొంటూ ధైర్యంగా ముందుకు సాగుతూనే ఉన్నారు. ఓ వైపు కెరీర్లో.. మరోవైపు రియల్ లైఫ్‌లోనూ ఆమె ఎన్నో సవాళ్లను ఎదుర్కొన్నారు. అటువంటి స్ఫూర్తిదాయక పయనం సాగిస్తున్న సమంతకు ఇవాళ ఫ్యాన్స్ నుంచి బర్త్ డే విషెస్ వెల్లువెత్తుతున్నాయి.
We’re now on WhatsApp. Click to Join
- స్టార్ హీరోయిన్ సమంత బాల్యంలో చాలా తెలివైన స్టూడెంట్.
- ఆమె నటనా ప్రపంచంలోకి ఊహించని విధంగా అడుగుపెట్టారు.
- ఇంట్లో ఆర్థిక పరిస్థితి బాగా లేక సమంత(Samantha Birthday) చదువుకునే టైంలో చిన్నచిన్న ఉద్యోగాలు చేయాల్సి వచ్చింది.
- సమంత ఇంటర్ చదువుతుండగా ఎనిమిది గంటల షిఫ్ట్ కోసం ఒక కాన్ఫరెన్స్ హాల్లో హోస్టెస్ గా పనిచేశారు. అందుకోసం ఆమెకు రూ.500 జీతంగా ఇచ్చారు.
- కాలేజీలో ఉండగా సమంత మోడలింగ్‌పై ఆసక్తి చూపారు.
- ఆర్థిక పరిస్థితులు బాగా లేక ఆమె ఉన్నత విద్య కోసం ఆస్ట్రేలియాకు వెళ్లలేకపోయారు.
- ఈక్రమంలో ఫ్యామిలీకి అండగా ఉండేందుకు ఫుల్ టైమ్ మోడలింగ్ వర్క్‌లను సమంత చేశారు.
- సమంతకు సినిమాల్లో తొలి అవకాశాన్ని దర్శకుడు, సినిమాటోగ్రాఫర్ రవివర్మన్ ఇచ్చారు. దాంతో ఆమె జీవితం మారిపోయింది.
- నటుడు, దర్శకుడు రాహుల్ రవీంద్రన్ తో ‘మాస్కోఇన్ కావేరి’ మూవీ సమంత తొలి మూవీ. అయితే ఈ సినిమా కంటే ముందే ఏ మాయ చేశావే విడుదలైంది.
- టాలీవుడ్ అగ్రనిర్మాత అల్లు అరవింద్.. ఓ సందర్భంలో ఈ జెనరేషన్ హీరోయిన్లలో సమంతను మరో సావిత్రిగా పోల్చడం గమనార్హం. సమంత తన నటనతో అంతటి పేరును సంపాదించుకుంది.
- ఎన్టీఆర్, మహేశ్ బాబు లాంటి నటులతో జతకట్టి హిట్లు కొడుతూ గోల్డెన్ లెగ్ అనే ట్యాగ్‌ను కూడా సమంత దక్కించుకుంది.
- తమిళంలో కూడా సమంత ఒక సక్సెస్ఫుల్ కెరీర్‌ను కొనసాగించింది.
Also Read : Sunetra vs Supriya : శరద్ పవార్‌కు అగ్నిపరీక్ష.. శివాజీ వారసుడికి ఒవైసీ మద్దతు
- సమంత, నాగచైతన్య కలిసి నాలుగు సినిమాల్లో నటించారు.
- 2017లో పెళ్లి చేసుకున్న సమంత, నాగచైతన్య.. 2021లో విడాకులు తీసుకున్నారు.
- 2021లో విడాకులను ప్రకటించిన తర్వాత 2022లో తాను మాయాసైటీస్ అనే ఇమ్యూనిటీ వ్యాధితో బాధపడుతున్నానని సమంత బయటపెట్టింది. దాని వల్ల పర్సనల్‌గా తను చాలా వీక్ అయిపోయింది. అందుకే తన వద్దకు వచ్చిన సినిమా అవకాశాలను కూడా వదులుకుంది.
- సమంత జీవితంలో ముఖ్యంగా మాట్లాడుకోవాల్సిన మరో అంశం ‘ప్రత్యూష ట్రస్ట్’. తన కెరీర్ ప్రారంభంలోనే అనాథ పిల్లలకు సాయం చేయడం కోసం ఈ ట్రస్ట్‌ను ఏర్పాటు చేసి తన జీవితంలోని ప్రతీ స్పెషల్ సందర్భాన్ని ఆ పిల్లలతోనే జరుపుకుంటుంది సామ్.
Also Read :MP Candidates Qualifications : లోక్‌సభ అభ్యర్థుల విద్యార్హతల చిట్టా ఇదిగో..
Related News
Samantha : హమ్మయ్య మళ్ళీ సినిమాలు మొదలుపెట్టిన సమంత.. బర్త్ డే రోజు రీ ఎంట్రీ సినిమా అనౌన్స్..
నేడు సమంత పుట్టిన రోజు కావడంతో అభిమానులకు గుడ్ న్యూస్ చెప్పింది. సమంత నెక్స్ట్ సినిమాను నేడు ప్రకటించింది.