Railway Job Notification : 10వ తరగతి అర్హతతో రైల్వేలో 238 ఉద్యోగాలు..

రైల్వేలో జాబ్స్ సాధించాలని కలలు కనే నిరుద్యోగులకు గుడ్‌న్యూస్‌. తాజాగా నార్త్ వెస్ట్రన్ రైల్వే అసిస్టెంట్ లోకో పైలట్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది.

Railway Job Notification : రైల్వేలో జాబ్స్ సాధించాలని కలలు కనే నిరుద్యోగులకు గుడ్‌న్యూస్‌. తాజాగా నార్త్ వెస్ట్రన్ రైల్వే (North Western Railway), అసిస్టెంట్ లోకో పైలట్ (Assistant Loco Pilot) పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. 10వ తరగతి, ఐటీఐ చదివిన వారు ఈ పోస్టులకు అర్హులు. దరఖాస్తు ప్రక్రియ ఏప్రిల్ 7 నుంచి ప్రారంభమైంది. దరఖాస్తులకు చివరితేది మే 6, 2023.

నోటిఫికేషన్ వివరాలు ఇవీ..

  1. మొత్తం ఖాళీలు : 238
  2. జనరల్ కేటగిరీకి 120, ఓబీసీకి 36, ఎస్టీకి 18, ఎస్సీకి 36 పోస్టులున్నాయి.
  3. అసిస్టెంట్ లోకో పైలట్ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థికి 10వ తరగతి ఉత్తీర్ణత తప్పనిసరి.
  4. అభ్యర్థి ఫిట్టర్ మొదలైన ట్రేడ్‌లో ఐటీఐ డిగ్రీని కలిగి ఉండాలి.
  5. దరఖాస్తుదారుల వయస్సు 42 సంవత్సరాల కంటే ఎక్కువ ఉండకూడదు.
  6. OBC కేటగిరీకి వయోపరిమితి 45 సంవత్సరాలు, SC, ST వర్గాలకు 47 సంవత్సరాలుగా నిర్ణయించారు.
  7. అన్ని కేటగిరీల అభ్యర్థులని దరఖాస్తు ఫీజు నుంచి మినహాయించారు. అంటే ఏ కేటగిరీ అభ్యర్థులు దరఖాస్తు ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదు.
  8. ఇక అభ్యర్థుల ఎంపిక విషయానికొస్తే.. CBT పరీక్ష ద్వారా అభ్యర్థులను ఉద్యోగాలకి ఎంపిక చేస్తారు. ఇందులో ఉత్తీర్ణులైన అభ్యర్థులను డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ ఎగ్జామ్‌కు పిలుస్తారు.
  9. ఈ రిక్రూట్‌మెంట్‌కు సంబంధించిన మరింత సమాచారం కోసం అభ్యర్థులు ఎప్పటికప్పుడు అధికారిక నోటిఫికేషన్‌ను లేదా అధికారిక వెబ్‌సైట్‌లలో చెక్‌ చేసుకోవచ్చు.
  10. అర్హత, ఆసక్తిగల అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్ https://rrcjaipur.in/  లేదా  https://nwr.indianrailways.gov.in/  ద్వారా అప్లయ్‌ చేసుకోవచ్చు.

Also Read:  ISRO Job Notification: ఇస్రో లో జాబ్స్.. నెలకు రూ.1,42,400 శాలరీ.. ఏప్రిల్ 24 లాస్ట్ డేట్

దరఖాస్తు ప్రక్రియ ఇదీ..

  1. అభ్యర్థులు ముందుగా అధికారిక వెబ్‌సైట్ https://rrcjaipur.in/ ని ఓపెన్‌ చేయాలి.
  2. తర్వాత New Registration పై క్లిక్ చేయాలి.
  3. మెయిల్ ఐడి, ఫోన్ నంబర్, పుట్టిన తేదీని ఎంటర్‌ చేయడం ద్వారా నమోదు చేసుకోవాలి.
  4. తర్వాత అప్లికేషన్‌ను ప్రారంభించి సమాచారాన్ని ఎంటర్ చేయాలి.
  5. అవసరమైన అన్ని పత్రాలను అప్‌లోడ్ చేసి సబ్‌మిట్‌ చేయాలి.

Also Read:  DCCB Job Notification: DCCB విజయనగరం లో జాబ్స్.. ఏప్రిల్ 15 లాస్ట్ డేట్