HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Sports
  • >Chennai Super Kings Beats Sunrisers Hyderabad By 78 Runs

CSK vs SRH: చెపాక్ లో హైదరాబాద్ ని చిత్తుగా ఓడించిన చెన్నై

చెపాక్ వేదికగా జరిగిన మ్యాచ్ లో చెన్నై సూపర్ కింగ్స్ చేతిలో సన్ రైజర్స్ హైదరాబాద్ చిత్తుగా ఓడింది. 78 పరుగుల తేడాతో రుతురాజ్ సేన పాట్ కమిన్స్ నేతృత్వంలోని హైదరాబాద్ ను మట్టికరిపించింది. ఈ మ్యాచ్ లో చెన్నై 200 స్కోర్ చేయడం ద్వారా టీ20 క్రికెట్‌లో చెన్నై 35వ సారి 200 ప్లస్ స్కోర్ చేసింది.

  • Author : Vamsi Chowdary Korata Date : 29-04-2024 - 12:18 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
CSK vs SRH
CSK vs SRH

CSK vs SRH: చెపాక్ వేదికగా జరిగిన మ్యాచ్ లో చెన్నై సూపర్ కింగ్స్ చేతిలో సన్ రైజర్స్ హైదరాబాద్ చిత్తుగా ఓడింది. 78 పరుగుల తేడాతో రుతురాజ్ సేన పాట్ కమిన్స్ నేతృత్వంలోని హైదరాబాద్ ను మట్టికరిపించింది. ఈ మ్యాచ్ లో చెన్నై 200 స్కోర్ చేయడం ద్వారా టీ20 క్రికెట్‌లో చెన్నై 35వ సారి 200 ప్లస్ స్కోర్ చేసింది. అంతకుముందు సోమర్ సెట్ 34 సార్లు 200 ప్లస్ స్కోర్ చేసింది.

తొలుత బ్యాటింగ్ చేసిన చెన్నై సూపర్ కింగ్స్ 20 ఓవర్లలో 212 పరుగులు చేసింది. కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ 98 పరుగులతో ఇన్నింగ్స్ ఆడగా, డారిల్ మిచెల్ 52 పరుగులు చేశాడు. రహానే 9 పరుగుల వద్ద ఔటయ్యాడు. రితురాజ్ గైక్వాడ్ డారిల్ మిచెల్‌తో కలిసి సెంచరీ భాగస్వామ్యాన్ని నెలకొల్పి జట్టుపై పట్టు సాధించాడు.అయితే జాగ్రత్తగా ఆడుతున్న డారిల్ మిచెల్ 52 పరుగులు చేసి పెవిలియన్ చేరాడు. కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ 98 పరుగులతో కెప్టెన్సీ ఇన్నింగ్స్ ఆడాడు. శివమ్ దూబే 20 బంతుల్లో 39 పరుగులతో అజేయంగా నిలిచాడు. ఎంఎస్ ధోనీ అజేయంగా ఐదు పరుగులు చేశాడు.

We’re now on WhatsApp. Click to Join

213 పరుగుల లక్ష్య ఛేదనలో సన్ రైజర్స్ హైదరాబాద్ వరుస వికెట్లను సమర్పించుకుంది. ట్రావిస్ హెడ్ 13, అభిషేక్ శర్మ 15, నితీష్ కుమార్ రెడ్డి 15 పరుగులతో దారుణంగా విఫలమయ్యారు. ఫలితంగా 8 ఓవర్ల సమయానికి సన్ రైజర్స్ 4 వికెట్లు కోల్పోయి 70 పరుగులు చేసింది. హెన్రిచ్ క్లాసేన్ 20 పరుగులతో సరిపెట్టాడు. 32 పరుగుల వద్ద మార్కరం అవుట్ అయ్యాడు. చివర్లో వచ్చిన అబ్దుల్ సమద్ 19 పరుగులతో రాణించాడు. మిగతా బ్యాటర్లు స్వల్ప స్కోరుకే పెవిలియన్ చేరడంతో 18.05 ఓవర్ల నాటికి 10 వికెట్లు కోల్పోయి 134 పరుగులకే ఆలౌట్ అయింది.

చెన్నై సూపర్ కింగ్స్ జట్టు: అజింక్యా రహానే, రుతురాజ్ గైక్వాడ్ , డారిల్ మిచెల్, మొయిన్ అలీ, శివమ్ దూబే, రవీంద్ర జడేజా, మహేంద్ర సింగ్ ధోనీ , దీపక్ చాహర్, తుషార్ దేశ్‌పాండే, ముస్తాఫిజుర్ రెహమాన్, మతీషా పతిరానా.

ఇంపాక్ట్ సబ్-సమీర్ రిజ్వీ, శార్దూల్ ఠాకూర్, షేక్ రషీద్, రచిన్ రవీంద్ర, మిచెల్ సాంట్నర్.

సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు: అభిషేక్ శర్మ, ట్రావిస్ హెడ్, ఐడెన్ మార్క్రామ్, హెన్రిచ్ క్లాసెన్ , నితీష్ రెడ్డి, అబ్దుల్ సమద్, షాబాజ్ అహ్మద్, పాట్ కమిన్స్, భువనేశ్వర్ కుమార్, జయదేవ్ ఉనద్కత్, నటరాజన్.

ఇంపాక్ట్ సబ్- ఉమ్రాన్ మాలిక్, మయాంక్ మార్కండే, అన్మోల్‌ప్రీత్ సింగ్, గ్లెన్ ఫిలిప్స్, వాషింగ్టన్ సుందర్.

Also Read: Kejriwal Wife: సీఎం కేజ్రీవాల్ ని కలిసేందుకు భార్యకు అనుమతి రద్దు


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • 78 runs
  • Chennai Super Kings
  • CSK vs SRH
  • Highlights
  • ipl 2024
  • match updates
  • Sunrisers Hyderabad

Related News

Hyderabad vs Delhi

నేడు ర‌స‌వ‌త్త‌ర పోరు.. స‌న్‌రైజ‌ర్స్ విజ‌యాల‌కు ఢిల్లీ బ్రేక్ వేయ‌గ‌ల‌దా?

ఉప్పల్ స్టేడియం పిచ్ నల్లమట్టితో కూడి ఉంటుంది. ఇది సాధారణంగా హై-స్కోరింగ్ మ్యాచ్‌లకు అనుకూలిస్తుంది. ఇక్కడ బంతికి మంచి బౌన్స్ లభిస్తుంది.

  • Spencer Johnson

    సీఎస్కేకు గుడ్ న్యూస్‌.. స్టార్ ప్లేయ‌ర్ ఎంట్రీ!

  • CSK vs KKR

    IPL 2026 : సీఎస్కే కు కలిసిరాని ఉప్పల్ స్టేడియం ..మరి ఈరోజు ఏమవుతుందో ?

  • IPL 2026

    గాయాల‌తో ఐపీఎల్‌కు దూర‌మ‌వుతున్న ఆట‌గాళ్లు!

  • SRH captain Pat Cummins is back

    SRH: సన్‌రైజర్స్‌కు గుడ్ న్యూస్.. ప్యాట్ కమిన్స్ వచ్చేస్తున్నాడు!

Latest News

  • IPL 2026 – SRH Vs DC : ఢిల్లీ పై 47 రన్స్ తేడాతో SRH విజయం

  • TGSRTC Strike: అర్ధరాత్రి నుండి తెలంగాణలో బస్సులు బంద్

  • IPL 2026 – SRH Vs DC : అభిషేక్ మెరుపులు..DC కి 243 టార్గెట్

  • Good News : ఏపీకి పెద్ద ఎత్తున నిధులు విడుదల చేసిన కేంద్రం

  • Telangana Govt : ప్రభుత్వ ఉద్యోగులకు సీఎం రేవంత్ గుడ్‌న్యూస్

Trending News

    • అమెరికా-ఇరాన్ మధ్య రేపే రెండో రౌండ్ చర్చలు.. రంగంలోకి ట్రంప్?

    • పాత ఉద్యోగం పోయె.. కొత్త ఆఫర్ వెనక్కి తీసుకెళ్లె! సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ ఆవేదన

    • మారుతున్న శాలరీ స్ట్రక్చర్.. ఎవరికి లాభం? ఎవరికి నష్టం?

    • రేపు బ్యాంకుల‌కు సెల‌వు ఉందా?

    • వేసవిలో ఏసీలు ఎందుకు పేలుతాయి?

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd