Elon Musk Vs Aliens : 6,000 శాటిలైట్లు.. ఏలియన్స్ సంచారం.. ఎలాన్ మస్క్ కీలక వ్యాఖ్యలు
Elon Musk Vs Aliens : ఏలియన్స్ .. అదేనండీ గ్రహాంతర జీవులు !!
- Author : Pasha
Date : 28-04-2024 - 3:44 IST
Published By : Hashtagu Telugu Desk
Elon Musk Vs Aliens : ఏలియన్స్ .. అదేనండీ గ్రహాంతర జీవులు !! వీటి గురించి మన ఇండియన్స్‌కు పెద్దగా ఇంట్రెస్టు లేకపోయినా అమెరికా లాంటి బాగా డెవలప్ అయిన దేశాల ప్రజలకు చాలా ఆసక్తి ఉంటుంది. ఏకంగా అమెరికా ప్రభుత్వం కూడా ఏలియన్స్ రీసెర్చ్ కోసం కొన్ని ప్రత్యేక ప్రాజెక్టులను నడుపుతుంటుంది. తాజాగా ప్రపంచ కుబేరుడు, అమెరికా అగ్ర వ్యాపారవేత్త ఎలాన్ మస్క్ ఏలియన్స్‌పై కీలక వ్యాఖ్యలు చేశారు. వివరాలివీ..
We’re now on WhatsApp. Click to Join
2014 సంవత్సరంలో ఎంహెచ్370 విమానం 227 మంది ప్రయాణికులతో కౌలాలంపూర్ నుంచి బీజింగ్‌కు బయలుదేరింది. అయితే అది బయలుదేరిన 40 నిమిషాల తర్వాత కనిపించకుండా పోయింది. తర్వాత ఓ గంట పాటు మిలిటరీ రాడార్లలో దాని ఆనవాళ్లు కనిపించాయి. మాలే ద్వీపం, అండమాన్ సముద్రాన్ని దాటేసి ఆ విమానం వెళ్లినట్లు గుర్తించారు. ఆ తర్వాత దాని జాడ ఇప్పటి వరకు కనిపించలేదు. తాజాగా ఆ విమానానికి సంబంధించిన ఓ వీడియో సోషల్ మీడియాలో వైరలైంది. దాంట్లో ఒక గుండ్రటి వస్తువు విమానం చుట్టూ చక్కర్లు కొడుతున్నట్లు కనిపించింది. అది ఫేక్ వీడియో అని.. గ్రాఫిక్స్‌ను యాడ్ చేశారని ఇప్పటికే తేలిపోయింది. అయినా అదే వీడియోను ఓ యూజర్ ‘ఎక్స్’లో పోస్ట్ చేస్తూ.. దానిపై స్పేస్‌ఎక్స్ వ్యవస్థాపకుడు ఎలాన్ మస్క్ అభిప్రాయాన్ని కోరాడు.
Also Read : Samantha Birthday : సమంత కెరీర్‌లో ఎలాంటి టఫ్ టైమ్స్‌ను చూశారో తెలుసా ?
సదరు యూజర్ పోస్ట్ చేసిన వీడియోను చూసిన ఎలాన్ మస్క్ ఎట్టకేలకు దానిపై స్పందించారు. ‘‘నాకైతే ఇప్పటిదాకా ఎన్నడూ ఏలియెన్స్‌కు సంబంధించిన ఆధారాలు లభించలేదు. ఒకవేళ నాకు అలాంటి వివరాలు ఏవైనా తెలిస్తే వెంటనే ఎక్స్‌లో పోస్ట్ చేస్తాను. స్పేస్‌ఎక్స్‌కు చెందిన దాదాపు 6,000 శాటిలైట్లు ప్రస్తుతం కక్ష్యలో ఉన్నాయి. వీటిలో ఒక్కటి కూడా ఇప్పటిదాకా ఏలియెన్స్‌ను చూసిన దాఖలాలు లేనే లేవు’’ అని మస్క్ తేల్చి చెప్పారు.