MP Candidates Qualifications : లోక్‌సభ అభ్యర్థుల విద్యార్హతల చిట్టా ఇదిగో..
MP Candidates Qualifications : తెలంగాణ లోక్‌సభ ఎన్నికల్లో ప్రధాన పోటీ కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీల మధ్యే నెలకొంది.
- Author : Pasha
Date : 28-04-2024 - 12:50 IST
Published By : Hashtagu Telugu Desk
MP Candidates Qualifications : తెలంగాణ లోక్‌సభ ఎన్నికల్లో ప్రధాన పోటీ కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీల మధ్యే నెలకొంది. ఈ మూడు పార్టీలకు చెందిన 51 మంది అభ్యర్థులు లోక్‌సభ పోల్స్‌లో పోటీ చేస్తున్నారు. వీరిలో ఎంత మంది అభ్యర్థులు ఎంత వరకు చదువుకున్నారు ? అనేది ఇప్పుడు తెలుసుకుందాం..
We’re now on WhatsApp. Click to Join
- తెలంగాణలోని మూడు ప్రధాన పార్టీలకు చెందిన 51 మంది లోక్‌సభ అభ్యర్థుల్లో 17 మంది ఇంటర్, ఆలోపే చదువుకున్నారు.
- పదో తరగతి అంతకంటే తక్కువ చదివిన లోక్‌సభ అభ్యర్థులు ఆరుగురు ఉన్నారు.
- ఇంటర్మీడియట్ చదివిన లోక్‌సభ అభ్యర్థులు 11 మంది ఉన్నారు.
- లోక్‌సభ అభ్యర్థుల్లో ఐదుగురు డాక్టర్లు(MP Candidates Qualifications) ఉన్నారు.
- ఆలిండియా సర్వీసుల అధికారులు ముగ్గురు ఉన్నారు. ఈ లిస్టులో రిటైర్డ్ ఐఏఎస్ అధికారి వెంకట్రామిరెడ్డి మెదక్ నుంచి బీఆర్ఎస్ అభ్యర్థిగా పోటీ చేస్తుండగా, నాగర్ కర్నూల్ నుంచి రిటైర్డ్ ఐపీఎస్ అధికారి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ బీఆర్ఎస్ తరఫున బరిలో నిలిచారు. మరో రిటైర్డ్ ఐఏఎస్ అధికారి చొల్లేటి ప్రభాకర్ నల్గొండ లోక్‌సభ స్థానం నుంచి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు.
- రిటైర్డ్ ఐఏఎస్ అధికారి వెంకట్రామిరెడ్డి సహా 11 మంది పోస్టుగ్రాడ్యుయేట్లు పోటీ చేస్తున్నారు. ఇందులో 10 మంది ఎంఏ, ఒకరు ఎంబీఏ చేశారు. ఒకరు బీటెక్ చేయగా మరో 10 మంది వివిధ డిగ్రీలు చదివారు.
- ఐదుగురు అభ్యర్థులు విదేశాల్లో ఉన్నత విద్యను చదివారు.
- ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్ హార్వర్డ్ యూనివర్సిటీలో పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్‌లో మాస్టర్స్ చేశారు. అసదుద్దీన్ ఓవైసీ లండన్‌లో లా పూర్తి చేశారు. కొండా విశ్వేశ్వర్‌రెడ్డి అమెరికాలో ఎంఎస్ పూర్తి చేశారు. పెద్దపల్లి కాంగ్రెస్ అభ్యర్థి గడ్డం వంశీకృష్ణ అమెరికాలో గ్రాడ్యుయేషన్ చేశారు. భువనగిరి కాంగ్రెస్ అభ్యర్థి చామల కిరణ్ కుమార్ రెడ్డి సైప్రస్‌లో హోటల్ మేనేజ్మెంట్ కోర్సు చేశారు.
Also Read :Marriage With Robot : రోబోతోనే ప్రేమ.. త్వరలోనే పెళ్లి.. అతగాడి టేస్టే వేరప్ప!
- టి.జీవన్‌రెడ్డి(కాంగ్రెస్), బి. వినోద్‌కుమార్(బీఆర్ఎస్), రఘునందన్‌రావు(బీజేపీ)లు న్యాయ విద్య(ఎల్ఎల్బీ) చదివారు.
- చేవెళ్ల కాంగ్రెస్ అభ్యర్థి రంజిత్ రెడ్డి వెటర్నరీ సైన్స్‌లో మాస్టర్స్(ఎంవీఎస్సీ) పూర్తి చేశారు.
- మల్లు రవి(కాంగ్రెస్), కడియం కావ్య(కాంగ్రెస్), బూర నర్సయ్యగౌడ్(బీజేపీ), సుధీర్‌కుమార్(బీఆర్ఎస్)లు ఎంబీబీఎస్, ఆపై చదువులు చదువుకొని వైద్యులుగా సేవలందించారు.
- మహబూబాబాద్ బీజేపీ అభ్యర్థి ప్రొఫెసర్ అజ్మీరా సీతారాంనాయక్ పీహెచ్డీ పూర్తి చేశారు.