HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > India
  • >175 People Killed In Stampede Incidents

Stampede : ఇప్పటివరకు జరిగిన తొక్కిసలాట ఘటనల్లో 175 మంది మృతి

Stampede : 2025 జనవరిలో తిరుపతిలో టోకెన్ల జారీ సమయంలో భక్తులు ఎగబడి ఆరుగురు చనిపోగా, అదే నెలలో మహాకుంభమేళా సందర్భంగా మరో 30 మంది మృతి చెందారు

  • Author : Sudheer Date : 04-06-2025 - 8:27 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Rcb Stampede
Rcb Stampede

ఐపీల్ ఫైనల్ (IPL 2025) మ్యాచ్ లో పంజాబ్ పై విజయం సాధించి 18 ఏళ్ల నిరీక్షణ కు తెరదించారు RCB టీం. ఈ సందర్బంగా బుధువారం బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియం లో విజయోత్సవ వేడుక ఏర్పాటు చేసారు. కానీ ఈ విజయోత్సా వేడుక కాస్త విషాద వేడుకగా మారింది. వేడుక ను చూసేందుకు లక్షలాది మంది అభిమానులు స్టేడియం వద్దకు చేరుకోవడం తో ఒక్కసారిగా తొక్కిసలాట (Stampede ) ఘటన చోటుచేసుకుంది. ఈ ఘటన లో ఇప్పటివరకు 15 మంది మరణించగా..50 మందికి పైగా గాయాలపాలయ్యారు. ఈ ఘటన తో మరోసారి ఈ అంశంపై జాతీయ స్థాయిలో చర్చ తెరపైకి వచ్చింది. దేశంలో గత సంవత్సరం నుంచి ఇప్పటివరకు తొక్కిసలాటల్లో చనిపోయిన వారి సంఖ్య 175కి చేరింది. మానవీయ చర్యల్లో విఫలం కావడం వల్ల ఇలా విలువైన ప్రాణాలు పోగొట్టుకుంటున్నారు.

Virat Kohli: కోహ్లీ అభిమానుల‌కు బ్యాడ్ న్యూస్‌.. విరాట్‌ను చూడాలంటే ఆగ‌స్టు వ‌ర‌కు ఆగాల్సిందే!

2024 జూలైలో ఉత్తరప్రదేశ్ హత్రాస్‌లో భోలే బాబా సత్సంగ్ సందర్భంగా 121 మంది చనిపోవడం ఈ దుస్థితికి నిదర్శనంగా నిలిచింది. ఆ తర్వాత డిసెంబర్‌లో పుష్ప-2 సినిమా విడుదల సందర్భంగా హైద‌రాబాద్‌లోని సంధ్య థియేటర్ వద్ద ఏర్పడిన తొక్కిసలాటలో ఓ మహిళ ప్రాణాలు కోల్పోయింది. 2025 జనవరిలో తిరుపతిలో టోకెన్ల జారీ సమయంలో భక్తులు ఎగబడి ఆరుగురు చనిపోగా, అదే నెలలో మహాకుంభమేళా సందర్భంగా మరో 30 మంది మృతి చెందారు. మే నెలలో గోవాలోని ఓ ప్రసిద్ధ ఆలయంలో భక్తుల రద్దీ కారణంగా మరో ఆరుగురు ప్రాణాలు కోల్పోవడం విషాదంగా మారింది.

ఈ వరుస ఘటనలు చూస్తే.. మన దేశంలో భద్రతా ప్రణాళికల లోపాలు, క్రమశిక్షణలేని సమూహ నియంత్రణ, మరియు అధికారుల నిర్లక్ష్యం స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఎప్పటికైనా ఈ దుర్ఘటనలకు చెక్ పెట్టాలంటే, భద్రతా సన్నాహకాల్లో మార్పులు, ఆధునిక టెక్నాలజీ వినియోగం, మరియు సమర్థవంతమైన ప్రజల మార్గదర్శన వ్యవస్థలు ఏర్పాటవ్వాలి. ప్రజల ప్రాణాలు విలువైనవని గుర్తించి, ఏ కార్యక్రమమైనా సురక్షితంగా నిర్వహించేందుకు అధికారులు ముందడుగు వేయాల్సిన సమయం.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • 175 dies
  • Bhole Baba Satsang
  • chinna jeeyar swamy Stadium
  • india
  • Pushpa 2
  • rcb stampede
  • Stampede
  • tirupathi

Related News

Four gangsters killed in encounter in Gurugram

Police Encounter: 11 ఏళ్ల బాలికపై అత్యాచారం.. హత్య కేసులో ప్రధాన నిందితుడిని పోలీసులు ఎన్‌కౌంటర్‌

పశ్చిమ బెంగాల్‌లోని బరుయిపూర్‌లో 11 ఏళ్ల బాలికపై అత్యాచారం మరియు హత్య కేసులో ప్రధాన నిందితుడైన ప్రభాస్ మోండల్, నేర జరిగిన తీరును పునర్నిర్మించేందుకు తీసుకెళ్తుండగా బుధవారం జరిగిన పోలీసు ఎన్‌కౌంటర్‌లో కాల్పుల్లో మరణించాడు. పోలీసుల వివరాల ప్రకారం, బరుయిపూర్ పోలీస్ స్టేషన్ దర్యాప్తు అధికారి మరియు ఇతర పోలీసుల బృందం నిందితుడు ప్రభాస్ మోండల్‌తో కలిసి అర్ధరాత్రి 12:45 గంటల

  • Good news from the AP government for BCs...

    Andhra Pradesh: ఏపీలో కొత్తగా మూడు పోలీస్ కమిషనరేట్ల

Latest News

  • WhatsApp Business Summit : వ్యాపారం కోసం ‘మెటా బిజినెస్ ఏజెంట్’ ఏఐ టూల్ విడుదల!

  • Elite Eco Energies: భీమవరంలో అత్యాధునిక షోరూమ్ ‘ఎలైట్ ఎకో ఎనర్జీస్’ ప్రారంభం

  • Herbalife India : ఫార్ములా 1 షేక్స్‌లో ‘డేట్స్ కారామెల్’ ఫ్లేవర్ విడుదల!

  • Indian Railways: రైల్వే ప్రయాణికులకు బిగ్ షాక్.. రైల్ టికెట్లను స్క్రీన్ షాట్ తీసి చూపించలేరు!

  • PM Modi: న్యూజిలాండ్‌లో తొలిసారి అడుగుపెట్టిన భారత ప్రధాని

Trending News

    • Kissing Day: ఆవేశపూరితమైన ముద్దు నిమిషానికి 6.4 కేలరీల ఖర్చు చేస్తుంది

    • Kalyan Ram : సంక్రాంతి 2027కు సిద్ధమవుతున్న అనిల్ రావిపూడి.. కళ్యాణ్ రామ్ ఫస్ట్ లుక్‌ పోస్టర్ విడుదల !

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd