Weight Loss: 10 రోజుల్లో 2 కిలోల బరువు తగ్గాలనుకుంటున్నారా?
బరువు తగ్గాలని కలలు కనే వారికి శుభవార్త. ఖరీదైన డైట్ ప్లాన్‌లు లేదా కఠిన వ్యాయామాలు లేకుండానే కేవలం 10 రోజుల్లో 1 నుండి 2 కిలోల బరువు తగ్గే సులభమైన టెక్నిక్‌లు ఇక్కడ ఉన్నాయి.
- Author : Gopichand
Date : 29-03-2025 - 11:34 IST
Published By : Hashtagu Telugu Desk
Weight Loss: బరువు తగ్గాలని (Weight Loss) కలలు కనే వారికి శుభవార్త. ఖరీదైన డైట్ ప్లాన్‌లు లేదా కఠిన వ్యాయామాలు లేకుండానే కేవలం 10 రోజుల్లో 1 నుండి 2 కిలోల బరువు తగ్గే సులభమైన టెక్నిక్‌లు ఇక్కడ ఉన్నాయి. రోజువారీ జీవనశైలిలో చిన్న చిన్న మార్పులు చేసుకోవడం ద్వారా కొవ్వు కరిగిపోతుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఈ అలవాట్లు ఏమిటో తెలుసుకుందాం.
ఆహారంలో క్రమశిక్షణ కీలకం
బిజీ జీవితంలో చాలా మంది త్వరగా తినడం లేదా మంచం మీద పడుకుని భోజనం చేయడం వంటి అలవాట్లకు అలవాటు పడతారు. ఇది బరువు పెరగడానికి ప్రధాన కారణం. నిపుణుల సూచన ప్రకారం.. టేబుల్ లేదా కుర్చీపై కూర్చుని నెమ్మదిగా ఆహారం తినడం వల్ల అతిగా తినే అవకాశం తగ్గుతుంది. ఇది జీర్ణక్రియను మెరుగుపరచడంతో పాటు, అవసరమైన పోషకాలను శరీరం సరిగ్గా గ్రహించేలా చేస్తుంది.
సమయానికి భోజనం చేయండి
సరైన సమయంలో అల్పాహారం, భోజనం, రాత్రి భోజనం చేయడం బరువు తగ్గడంలో కీలకం. రాత్రి ఆలస్యంగా తినడం వల్ల జీర్ణ ప్రక్రియ మందగిస్తుంది. బరువు పెరిగే అవకాశం పెరుగుతుంది. నిద్రపోయే ముందు 2-3 గంటల ముందు భోజనం పూర్తి చేయాలని నిపుణులు సిఫార్సు చేస్తున్నారు. మధ్యాహ్న భోజనం తర్వాత తేలికపాటి నడక లేదా శారీరక శ్రమ కూడా జీవక్రియను పెంచుతుంది.
నీరు, వ్యాయామం మిస్ కాకూడదు
తగినంత నీరు తాగడం వల్ల ఆకలి నియంత్రణలో ఉంటుంది. జీవక్రియ ఆరోగ్యంగా మారుతుంది. అయితే భోజనం తర్వాత వెంటనే ఎక్కువ నీరు తాగడం మానేయండి. ఇది జీర్ణవ్యవస్థను దెబ్బతీస్తుంది. రోజుకు 30-40 నిమిషాల కార్డియో (పరుగు, సైక్లింగ్) లేదా బలమైన శిక్షణ (వెయిట్ లిఫ్టింగ్) వంటి వ్యాయామాలు కొవ్వును కరిగించడంలో సహాయపడతాయి.
Also Read: Weight Loss: 10 రోజుల్లో 2 కిలోల బరువు తగ్గాలనుకుంటున్నారా?
నిద్ర, ఒత్తిడి నియంత్రణ
తగినంత నిద్ర (7-8 గంటలు) లేకపోతే హార్మోన్ల అసమతుల్యత ఏర్పడి ఆకలి పెరుగుతుంది. జీవక్రియ మందగిస్తుంది. అలాగే ఒత్తిడి కార్టిసాల్ హార్మోన్‌ను పెంచి జంక్ ఫుడ్ తినే అలవాటుకు దారితీస్తుంది. ఒత్తిడిని తగ్గించేందుకు యోగా, ధ్యానం వంటివి జోడించండి.
చిన్న మార్పు, పెద్ద ఫలితం
ఈ సులభమైన అలవాట్లు.. నెమ్మదిగా తినడం, సమయానికి భోజనం, వ్యాయామం, తగిన నిద్ర, ఒత్తిడి నియంత్రణపాటిస్తే 10 రోజుల్లో 2 కిలోలు తగ్గడం అసాధ్యం కాదు. కాబట్టి మీరు క్రమం తప్పకుండా వ్యాయామం చేస్తే, సమతుల్య ఆహారం తీసుకుంటే మీరు వేగంగా బరువు తగ్గుతారు.