HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Telangana
  • >Rains Across The State In 24 Hours

Heavy Rain Alert: 24 గంటల్లో రాష్ట్రమంతా వర్షాలు

  • Author : Vamsi Chowdary Korata Date : 01-07-2026 - 1:05 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Rains across the state in 24 hours
Rains across the state in 24 hours

దేశవ్యాప్తంగా నైరుతి రుతుపవనాలు విస్తరించాయి. జూన్ నెలలో కాస్త మందగించినట్లు కనిపించిన రుతుపవన గమనం ప్రస్తుతం వేగం పుంజుకుంది. రాబోయే 24 గంటల నుంచి 72 గంటల వ్యవధిలో తెలంగాణతో పాటు దేశంలోని మరో 23 రాష్ట్రాల్లో భారీ నుండి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ (IMD) హెచ్చరించింది. ఈ మేరకు పలు రాష్ట్రాలకు ముందస్తు అలర్ట్‌లు జారీ చేసింది. ఈ వారంలో బంగాళాఖాతంలో వరుసగా రెండు శక్తివంతమైన అల్పపీడన ప్రాంతాలు ఏర్పడనున్నాయని వాతావరణశాఖ అధికారులు వెల్లడించారు. ఇవి మధ్య భారతదేశం గుండా భూభాగంలోకి పయనించే క్రమంలో వాతావరణంలోకి విపరీతమైన తేమను నెట్టివేస్తాయన్నారు.

దీనివల్ల రుతుపవనాలు మరింత బలపడి విస్తారంగా వర్షాలు కురుస్తాయని చెప్పారు. ముఖ్యంగా జూలై 1 నుంచి జూలై 4 మధ్య దేశవ్యాప్తంగా వానలు దంచికొట్టే అవకాశం ఉండటంతో, ఎండ తీవ్రత తగ్గి గరిష్ఠ ఉష్ణోగ్రతలు 5 నుంచి 6 డిగ్రీల వరకు పడిపోయి వాతావరణం చల్లబడుతుందని చెప్పారు. నేడు తెలంగాణలోని ఉత్తర, తూర్పు జిల్లాలపై వర్ష ప్రభావం ఎక్కువగా ఉండదని అన్నారు. ఆదిలాబాద్‌, కొమురం భీం ఆసిఫాబాద్‌, మంచిర్యాల, నిర్మల్, కరీంనగర్, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, మహబూబాబాద్‌, వరంగల్, హనుమకొండ జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ కేంద్రం అంచనా వేసింది. లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు.

మరోవైపు, ముగిసిన జూన్ నెలలో దేశంలో ఆశించిన స్థాయిలో వర్షాలు పడలేదు. తెలంగాణలో జూన్ నెలలో మొత్తంగా 12 శాతం లోటు వర్షపాతం నమోదైనట్లు వాతావరణ శాఖ తెలిపింది. రాష్ట్రంలో జూన్ సాధారణ వర్షపాతం 13.03 సెం.మీ కురవాల్సి ఉండగా, కేవలం 11.53 సెం.మీ మాత్రమే నమోదైంది. రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 16 జిల్లాల్లో -20 నుంచి -59 శాతం వరకు లోటు కనిపించింది. అన్నింటికంటే ఎక్కువగా హనుమకొండ జిల్లాలో తీవ్ర వర్షపాత లోటు నమోదైంది. ఈ జిల్లాలో సాధారణ సగటు వర్షపాతం 142.1 మి.మీ కురవాల్సి ఉండగా, కేవలం 40.9 శాతం మాత్రమే వర్షపాతం రికార్డైంది. అంటే ఇక్కడ ఏకంగా 71 శాతం లోటు వర్షపాతం ఉంది. మిగిలిన 12 జిల్లాల్లో మాత్రం సాధారణ వర్షపాతం కంటే కేవలం 17 శాతం మాత్రమే నమోదైంది. అయితే జూలై మొదటి వారంలో కురవబోయే భారీ వర్షాలతో ఈ లోటు అంతా భర్తీ అయి, ప్రాజెక్టుల్లోకి భారీగా వరద నీరు వచ్చే అవకాశం ఉందని వాతావరణశాఖ నిపుణులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.

 


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • Heavy Rain Alert
  • Hyderabad Rain Alert
  • IMD Rain Alert
  • rain alert
  • Rain Alert Telangana
  • Rain Alert Today
  • telangana heavy rain alert

Related News

Widespread heavy rains across Telangana districts.

Rain Alert: తెలంగాణ జిల్లాల్లో విస్తారంగా భారీ వర్షాలు

తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా నైరుతి రుతుపవనాలు చురుగ్గా కదలడంతో వాతావరణం ఒక్కసారిగా చల్లబడింది. భారత వాతావరణ శాఖ (IMD) వెల్లడించిన వివరాల ప్రకారం.. ప్రస్తుతం ఉత్తర తెలంగాణ పరిసర ప్రాంతాల్లో ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది. దీనికి తోడు ఈశాన్య మధ్యప్రదేశ్‌ నుంచి తెలంగాణ, విదర్భ వరకు ఒక ద్రోణి.. ఉత్తర కోస్తాంధ్ర నుంచి మధ్య మహారాష్ట్ర, ఛత్తీస్‌గఢ్‌ వరకు మరో ద్రోణి విస్తరించి ఉన్న

  • Heavy rains for the coming week

    Rain Alert: ఏపీలో భారీ వర్షాలు.. కమ్ము కోస్తున్న కారు మబ్బులు

  • Rains across the state in 24 hours

    Weather Report: తెలంగాణలో భారీ వర్షాలు.. ఈ జిల్లాలకు తాజా హెచ్చరిక

  • Major changes in the Bay of Bengal... A barrage of lightning strikes expected in the coming days.

    Rain Alert: బంగాళాఖాతం భారీ మార్పులు.. రానున్న రోజుల్లో పిడుగుల వర్షం

  • Rain alert for Telangana; Meteorological Department issues warnings.

    Rain Alert: తెలంగాణకు రెయిన్ అలర్ట్.. వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ

Latest News

  • YouTuber Prashna Ravan: యూట్యూబర్‌ రావణ్‌ను అరెస్టు చేసిన ఏపీ పోలీసులు

  • KTR: ప్రభాస్‌కు ఫోన్ చేసిన కేటీఆర్

  • Heavy Rain Alert: 24 గంటల్లో రాష్ట్రమంతా వర్షాలు

  • Jnaneswari Missing: జ్ఞానేశ్వరి కేసులో పోలీసులు కొత్త ప్లాన్.. తుని పాప సమాచారం ఇస్తే లక్ష బహుమతి

  • Aaruguru Pathivrathalu: ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్.. ఆరుగురు పతివ్రతల రీ-రిలీజ్‌పై క్లారిటీ వచ్చేసింది

Trending News

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd