Monkey Fever Symptoms: మంకీ ఫీవర్ అంటే ఏమిటి..? దాని లక్షణాలివే..!
గత కొన్ని రోజులుగా దేశంలో మంకీ ఫీవర్ (Monkey Fever Symptoms) ముప్పు పొంచి ఉంది. ఇటీవల కర్ణాటకలోని ఉత్తర కన్నడ జిల్లాలో అనేక మంకీ ఫీవర్ కేసులు నమోదయ్యాయి.
- Author : Gopichand
Date : 06-02-2024 - 9:30 IST
Published By : Hashtagu Telugu Desk
Monkey Fever Symptoms: గత కొన్ని రోజులుగా దేశంలో మంకీ ఫీవర్ (Monkey Fever Symptoms) ముప్పు పొంచి ఉంది. ఇటీవల కర్ణాటకలోని ఉత్తర కన్నడ జిల్లాలో అనేక మంకీ ఫీవర్ కేసులు నమోదయ్యాయి. మీడియా నివేదికల ప్రకారం.. ఇప్పటివరకు మొత్తం 49 వైరస్ కేసులు నిర్ధారించబడ్డాయి. కర్ణాటకతో పాటు, మహారాష్ట్ర, గోవాలో కూడా దీని కేసులు కనిపించాయి. ఇలాంటి పరిస్థితుల్లో ఈ వైరస్ విజృంభిస్తున్న దృష్ట్యా వైద్యారోగ్య శాఖ అధికారులు చురుగ్గా వ్యవహరించి అదుపు చేసేందుకు సిద్ధమవుతున్నారు. ఇలాంటి పరిస్థితిలో మంకీ ఫీవర్ అంటే ఏమిటి..? ఈ వ్యాధి ఎలా వ్యాపిస్తుంది..? దాని లక్షణాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం. తద్వారా మీరు దాని లక్షణాలను సకాలంలో గుర్తించి చికిత్సకు వెళ్లవచ్చు.
మంకీ ఫీవర్ అంటే ఏమిటి..?
వాస్తవానికి మంకీ ఫీవర్ ఫ్లావివిరిడే కుటుంబానికి చెందిన వైరస్. దీనిని వైద్య భాషలో క్యాసనూర్ ఫారెస్ట్ డిసీజ్ (KFD) అంటారు. ఈ తీవ్రమైన వ్యాధి కోతుల శరీరంలో కనిపించే పేలు కాటు ద్వారా మానవులకు వ్యాపిస్తుంది. ఇది కాకుండా ఒక వ్యక్తి ఈ వైరస్ సోకిన జంతువుతో సంబంధం కలిగి ఉంటే కూడా కోతి జ్వరం బారిన పడవచ్చు.
Also Read: Potato Bites: పిల్లలు ఎంతగానో ఇష్టపడే పొటాటో బైట్స్.. ఇలా చేస్తే ఒక్కటి కూడా మిగలదు?
మంకీ ఫీవర్ లక్షణాలు
– తీవ్ర జ్వరం
– కళ్లలో వాపు, నొప్పి సమస్య
– శరీరం చాలా చల్లగా అనిపిస్తుంది
– తీవ్రమైన కండరాల నొప్పి, తిమ్మిరి
– శరీర నొప్పి
– జలుబు, దగ్గు సమస్య
– తలనొప్పి
– వాంతులు, వికారం
– రక్తస్రావం సమస్య
– ప్లేట్‌లెట్స్ తగ్గడం
నివారణ చర్యలు ఇవే..!
ఈ తీవ్రమైన వ్యాధిని నివారించడానికి దాని లక్షణాలు కనిపించిన వెంటనే మీరు వైద్యుడిని సంప్రదించి, దానిని తనిఖీ చేయడం ముఖ్యం. మంకీ ఫీవర్ నివారించే ఏకైక మార్గం టీకా అని తెలుసుకోండి. అందువల్ల పరీక్ష తర్వాత టీకాలు వేయించుకోండి.
We’re now on WhatsApp : Click to Join
ఇది కాకుండా ఈ వ్యాధి నిర్ధారణ అయిన ప్రాంతాల్లో నివసించే వ్యక్తులు, ప్రత్యేకంగా ఎప్పటికప్పుడు దాని కోసం పరీక్షలు చేయించుకోవాలి. పరిశుభ్రతపై ప్రత్యేక శ్రద్ధ వహించండి. బాధితుడు చేతులు, కాళ్ళను కప్పి ఉంచుకోవాలి. శరీరాన్ని పూర్తిగా కవర్ చేసే బట్టలు ధరించాల్సి ఉంటుందని నిపుణులు చెబుతున్నారు.