Refined Oil : ఈ నూనె వాడితే ఆరోగ్య సమస్యలు వస్తాయ్..
- By Vamsi Chowdary Korata Published Date - 10:30 PM, Thu - 8 December 22

ఈ రోజుల్లో చాలా మంది రిఫైన్డ్ ఆయిల్స్ (Refined Oil)ను ఎక్కువగా వినియోగిస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా ఉపయోగించే అన్ని ఎడిబుల్ ఆయిల్స్‌లో 85 శాతం రిఫైన్డ్ ఆయిల్స్ ఉంటున్నాయి. మన ఆరోగ్యానికి హాని చేసే కొన్ని రిఫైన్డ్ ఆయిల్స్ గురించి ప్రముఖ హోమియోపతి వైద్యురాలు స్మితా భోయిర్ ఇన్‌స్టాగ్రామ్ పేజ్‌లో షేర్ చేశారు. ఈ నూనెలు వాడితే తీవ్రమైన అనారోగ్యాలు వచ్చే ప్రమాదం ఉందని హెచ్చరించారు. నూనెలు మన శరీరానికి అవసరం. అవి మన బాడీకి అవసరమైన క్యాలరీలు, అవసరమైన కొవ్వులను సరఫరా చేస్తాయి. విటమిన్ ఏ, డీ, ఈ, కె వంటి కొవ్వులో కరిగే విటమిన్‌లు శరీరం గ్రహించేందుకు సహాయపడతాయ. నూనెలో ఉండే ఒమేగా 3 కొవ్వులు మెదడు అభివృద్ధికి, హార్మోన్ ఉత్పత్తికి, సెల్యులార్ ఆరోగ్యం, రోగనిరోధక వ్యవస్థకు మేలు చేస్తాయి.
కానీ, అన్ని రకాల నూనెలు ఈ ప్రయోజనాలు ఇవ్వలేవని నిపుణులు అంటున్నారు. ఈ రోజుల్లో చాలా మంది రిఫైన్డ్ ఆయిల్స్ (Refined Oil)ను ఎక్కువగా వినియోగిస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా ఉపయోగించే అన్ని ఎడిబుల్ ఆయిల్స్‌లో 85 శాతం రిఫైన్డ్ ఆయిల్స్ ఉంటున్నాయి. ఇవి చౌకగా రావడమే దీనికి ముఖ్యకారణం. రిఫైన్డ్ ఆయిల్స్‌లో లో క్వాలిటీ ఉత్పత్తులు వాడతారనే విషయం చాలా మందికి తెలియదు. మన ఆరోగ్యానికి హాని చేసే కొన్ని రిఫైన్డ్ ఆయిల్స్ గురించి ప్రముఖ హోమియోపతి వైద్యురాలు స్మితా భోయిర్ ఇన్‌స్టాగ్రామ్ పేజ్‌లో షేర్ చేశారు. ఈ నూనెలు వాడితే తీవ్రమైన అనారోగ్యాలు వచ్చే ప్రమాదం ఉందని హెచ్చరించారు.
Refined Oil’s ఎలా తయారు చేస్తారు:
రిఫైన్డ్ ఆయిల్స్ అంటే శుద్ధి చేసిన నూనెలు. ఈ పద్ధతిలో నూనె తయారీ కోసం పూర్తిగా గింజలనే వాడతారనే నమ్మకం లేదు. పెట్రోలియం బైప్రొడక్ట్ అయిన పాలిమర్ ఆయిల్ నుంచి కూడా రిఫైన్డ్ నూనెలు తయారు చేస్తారు. రిఫైన్ ఆయిల్ తయారీలో నాలుగు ప్రధానమైన స్టేజ్‌లు ఉంటాయి. డీగమ్మింగ్, న్యూట్రలైజేషన్, బ్లీచింగ్, డియోడరైజింగ్. డీగమ్మింగ్లో ముడి చమురుల్లో ఉండే బంకలాంటి (ఫాస్పటైడ్స్) పదార్థాన్ని వేరు చేస్తారు. ఈ ప్రాసెస్లో హెక్సేన్ అనే కెమికల్ ఉపయోగిస్తారు. దీన్ని తర్వాతి స్టేజ్లలో తీసేసే ప్రయత్నం చేసినా కానీ ట్రేసెస్ మిగిలిపోతాయి. రెండో దశ న్యూట్రలైజేషన్. ఇందులో ఫ్యాటీ యాసిడ్స్ను తొలగిస్తారు. దీన్ని ‘కెమికల్ రిఫైనింగ్’ అని కూడా అంటారు. ఫాస్పరిక్ యాసిడ్తో క్రూడాయిల్ని ట్రీట్ చేశాక సోడియం హైడ్రాక్సైడ్ సొల్యూషన్తో నూట్రలైజ్ చేస్తారు. అప్పుడు నూనెపై నురగలాంటి పదార్థం తేలుతుంది. సెంట్రిఫ్యూజ్ విధానం ద్వారా కొన్ని మలినాలను తొలగిస్తారు. ఆ తర్వాత ఆయిల్ని డియోడరైజేషన్ చేస్తారు. ఇక్కడ 240 నుంచి 260 డిగ్రీల సెల్సియెస్ టెంపరేచర్‌లో ఆయిల్ని వేడి చేసి వాసన తొలగిస్తారు. అలా ఈ నాలుగు స్టేజ్ల్లో మరికొన్ని ట్రీట్మెంట్లు చేస్తారు. ఈ ప్రాసెస్‌లో చాలా కెమికల్స్ వాడతారు.
రిఫైన్డ్ ఆయిల్స్ (Refined Oil) ఆరోగ్యానికి మంచిది కాదు:
సహజమాన నూనెలను వివిధ రసాయనాలతో ట్రీట్ చేసి రిఫైన్డ్ ఆయిల్స్ తయారు చేస్తారని హోమియోపతి వైద్యురాలు స్మితా భోయిర్ అన్నారు. ఈ కెమికల్స్ ఆయిల్ రుచి, వాసన లేకుండా చేస్తుందని అన్నారు. రిఫైన్డ్ రైస్ బ్రాన్ ఆయిల్, వేరుశెనగ నూనె, పొద్దుతిరుగుడు నూనె, ఆవనూనె, సోయా బీన్ ఆయిల్, మొక్కజొన్న నూనె ఆరోగ్యానికి హాని చేస్తాయని హెచ్చరించారు. వంటనూనెను పరిమితికి మించి అతిగా వేడి చేసినప్పుడు విషతుల్యంగా మారుతుంది. నూనె రకాన్ని బట్టి పరిమితి ఆధారపడి ఉంటుంది. రిఫైన్డ్ ఆయిల్స్ అధిక ఉష్ణోగ్రతల వద్ద శుద్ధి చేస్తారు. దీని వల్ల నూనెలోని పోషకాలు నాశనం అవుతాయి. రిఫైన్డ్ ఆయిల్స్ వాడితే ట్రాన్స్ ఫ్యాట్స్ పెరుగుతాయి. ఇవి రక్తంలో చెడు కొలెస్ట్రాల్, ట్రైగ్లిజరైడ్స్, ఇన్సులిన్ స్థాయని పెంచుతాయి. ట్రాన్స్ ఫ్యాట్స్ వల్ల శరీరంలో హెచ్‌డీఎల్ కొలెస్ట్రాల్ (మంచి కొలెస్ట్రాల్) తగ్గుతుంది. శరీరంలో మంచి కొలెస్ట్రాల్ స్థాయిలు తగ్గితే గుండె (Heart) సమస్యలు వచ్చే ప్రమాదం ఉంది.
ఈ సమస్యలు వస్తాయి:
రిఫైన్డ్ ఆయిల్స్ రోజూ వాడితే క్యాన్సర్, డయాబెటిస్ మెల్లిటస్ (DM), జీర్ణశయ సమస్యలు, అథెరోస్క్లెరోసిస్, ఊబకాయం, పునరుత్పత్తి సమస్యలు, రోగనిరోధక సమస్యలు, అకాల మతిమరుపు (డిమెన్షియా), కాలేయ సమస్యలు, త్వరగా ముసలితనం రావడం, శరీరం లోపల వాపు (జనరలైజ్డ్ ఇన్‌ఫ్లమేషన్) వంటి తీవ్రమైన ఆరోగ్య సమస్యలు వచ్చే ప్రమాదం ఉందని హోమియోపతి వైద్యురాలు స్మితా భోయిర్ అన్నారు.
Also Read: Ghee : శీతాకాలంలో నెయ్యి చేసే అద్భుతం..